మథుర - ‘అంతు లేని ప్రేమ కల భూమి‘!

మథుర నగరాన్ని బ్రాజ్ భూమి లేదా ‘అంతు లేని ప్రేమ కల భూమి‘ అని గతంలో పిలవటమే కాదు, ఇపుడు కూడా పిలుస్తున్నారు. మథురకు ఈ పేరు శ్రీకృష్ణుడు తన బాల్యాన్ని, ఎదిగే వయసును ఇక్కడ గడపటం చేత వచ్చింది. శ్రీకృష్ణుడి రాస లీలలను ఎన్నో హిందూ పురాణాలలో పేర్కొన్నారు. ఆయన దేవాలయాలను, భజనలను, అనేక కలాక్రుతులను, పెయింటింగ్ లను శ్రీ కృష్ణుడి పేరుపై ప్రచారం చేసి తనివి తీరా ఎల్లపుడూ ఆనందిస్తూ వుంటారు. వాస్తవానికి హిందూ మత కలాక్రుతులలో శ్రీ కృష్ణుడి రాస లీలలకు సంబంధించిన అంశాలే కనపడుతూంటాయి. మథుర, దాని చుట్టూ పక్కలు 16 వ శతాబ్దంలో నిజమని కనుగొనే వరకూ శ్రీకృష్ణుడి లీలలు మిధ్య అనే నమ్మేవారు.

ఒక్కసారి పురాతన కాలంలోకి వెళితే,

మధుర పట్టణం హిందువులకు ప్రధాన యాత్రాస్థలంగా వుండేది. ఇక్కడ శ్రీకృష్ణుడు, ఆయన ప్రియురాలు రాధలకు సంబంధించి అనేక దేవాలయాలు కనపడతాయి. 8వ శతాబ్దంలో ఈ ప్రాధాన్యతను కనుగొనక పూర్వం ఈ పట్టణం బౌద్ధులకు సంబంధించిదిగా వుండేది. బౌద్ధమతానికి చెందిన అనేక బౌద్ధ ఆరామాలు, వాటిలో సుమారు ౩,౦౦౦ మంది బౌద సన్యాసులు వుండేవారు.

ఆఫ్ఘన్ యుద్ధ ప్రభువు మహమ్మద్ గజినీ ఆ తర్వాత ఔరంగజేబ్ 16వ శతాబ్దంలోను ఈ పట్టణం పై దండెత్తి అనేక ప్రసిద్ధ దేవాలయాలను, కేశవ దేవ్ టెంపుల్ మరియు అక్కడే నిర్మించిన ఒక మసీదుల తో సహా విధ్వంసం చేసారు. మధురకు సంవత్సరం పొడవునా యాత్రికులు వస్తూనే వుంటారు. ప్రత్యేకించి పండుగలు, హోలీ, ఆగష్టు/సెప్టెంబర్ లలో వచ్చే జన్మాష్టమి అంటే శ్రీ కృష్ణుడి పుట్టిన రోజున భక్తులు ఈ పట్టణానికి మరింత అధిక సంఖ్యలో వస్తారు.

మధుర చుట్టపట్ల కల ఆకర్షణలు

యమునా నది ఒడ్డున కల మధుర భారతీయ సంస్కృతి మరియు నాగరికతలకు కేంద్రంగా వుంటుంది. భారత దేశం ఆధ్యాత్మిక దేశం. ఈ దేశంలో చాలా మంది ప్రశాంత జీవనానికి ఇక్కడ కల ఆశ్రమాలకు వచ్చి ఆనందిస్తారు. మధురను హిందువులే కాదు, బౌద్ధులు, జైనులు కూడా పవిత్రంగా భావిస్తారు.

ఇక్కడకల శ్రీ కృష్ణ జన్మ భూమి టెంపుల్ చాలా పవిత్రంగా భావిస్తారు. మధుర ఆకర్షణ అంతా కృష్ణుడి తో ముడిపడి వుంది.

మరొక ప్రదేశం విశ్రాం ఘాట్, ఇక్కడ శ్రీకృష్ణుడు తన మేన మామ అయిన కంసుడిని వధించిన తర్వాత , ఇక్కడ కొంత సమయం విశ్రాంతి పొందాడట. ఇక్కడ కల ద్వారకదీష్ టెంపుల్ ప్రధాన టెంపుల్. హిందూ పండుగలలో ఈ టెంపుల్ ను అతి వైభవంగా అలంకరిస్తారు. హిందువుల పండుగలు అయిన, జన్మాష్టమి, గీతా మందిర్ వంటివి అతి వైభవంగా ఆచరిస్తారు. క్రి.శ.1661లో నిర్మించిన జామా మసీదు కొంత వరకూ ఇక్కడ కల ముస్లిం జనాభాను సూచిస్తుంది.

ఇక్కడ డేమ్పియర్ పార్క్ లో కల ప్రభుత్వ మ్యూజియంలో గుప్తుల కాలం నుండి కుషాన్ రాజుల కాలం వరకూ అంటే సుమారు క్రి.పూ.400 సంవత్సరాల నుండి క్రి.శ.1200 సంవత్సరాల వరకూ సేకరించిన అనేక చారిత్రక అంశాలు వుంటాయి. ఇంకా ఇక్కడ కల ఆకర్షణలలో కాంస్ కిలా, పోతన కుండ్, మధుర లోని ఘాట్ లు అనేకం కలవు. మధురకు వెళ్ళేటపుడు, పక్కనే కల బృందావనం నగరం కూడా తప్పక చూడాలి.

మధుర ఎలా చేరాలి ?

మధురకు రైలు, రోడ్డు, వాయు మార్గాలు కలవు. మధుర పట్టణానికి సమీప పెద్ద నగరం ఢిల్లీ.

పర్యటనకు ఉత్తమ సమయం

ఇక్కడ సంవత్సరం పొడవునా ఉత్సవాలు, పండుగలు జరుగుతాయి కనుక ఎపుడైనా సందర్శించవచ్చు.

Please Wait while comments are loading...