ఉత్తర ప్రదేశ్ లోని సహరాన్ పూర్ అదే పేరు కల జిల్లాలో కలదు. ఈ టవున్ అనేక కాటేజ్ పరిశ్రమలు వుడ్ కార్వింగ్ వంటివి కలిగి పర్యాటకులను ఒక ప్రధాన పర్యాటక ప్రదేశంగా ఆకర్షిస్తోంది. వ్యవసాయ పంటలు కూడా పేరు గాంచినవే. మామిడి పండ్లు బసమతి రైస్ వంటివి ఇక్కడ ఉత్పత్తి అవుతాయి. ఈ పట్టణ చరిత్రలో అనేక మంది పాలకులు కలరు. వీరు అందరూ ఈ పట్టణంపై తమదైన సంస్కృతుల ప్రభావాన్ని చూపారు.
సహరాన్ పూర్ లోను మరియు చుట్టపట్ల పర్యాటక ప్రదేశాలు
సహరాన్ పూర్ లోని పురాతన టెంపుల్స్, శాకంబరి దేవి టెంపుల్, బాల సుందరి టెంపుల్ (శక్తి పీఠాలు) చూసేందుకు పర్యాటకులు ఇక్కడకు వస్తారు. నౌగాజాపీర్ కు భక్తులు తమ కోరికలు తీర్చుకునేందుకు ప్రత్యేకంగా వస్తారు. ఇక్కడ టెంపుల్స్ మాత్రమే కాక పురాతన కాలానికి చెందిన అనేక బ్రిటిష్ భవనాలు కూడా కలవు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు స్థాపించిన బొటానికల్ గార్డెన్స్ ప్రసిద్ధి చెందినవి. దీనిలో ఒక రీసెర్చ్ సెంటర్ కూడా కలదు. ప్రశాంతమైన అంబేడ్కర్ పార్క్ మరొక ఆకర్షణ.
సహరాన్ పూర్ ఎలా చేరాలి?
సహరాన్పూర్ ను రైలు,రోడ్,ఎయిర్ మార్గాలలో చేరవచ్చు. సహరాన్ పూర్ కు సమీప ఎయిర్ పోర్ట్ డెహ్రాడూన్ లో కలదు.
సహరాన్ పూర్ సందర్శనకు ఉత్తమ సమయం
సహరాన్ పూర్ సందర్శనకు నవంబర్ నుండి ఏప్రిల్ వరకూ గల నెలలు అనుకూలం.