Search
 • Follow NativePlanet
Share

రోహటక్  – హర్యానా రాజకీయ నడిబొడ్డు!

రోహటక్ భారతదేశంలోని హర్యానాలో అదే పేరుతో దానికి ప్రధానకేంద్ర౦గా ఒక పట్టణం ఉన్న ఒక జిల్లా. ఇది ఢిల్లీకి దగ్గరగా ఉంది, నేషనల్ క్యాపిటల్ రీజియన్ II (ఎన్ సి ఆర్) లోనికి చేరింది. ఇది ఢిల్లీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉండటమే కాక, హర్యానా రాజకీయ రాజధాని కూడా. రోహటక్ అక్కడ ఉన్న డైరీలు, వస్త్ర మార్కెట్లు, విద్యా సంస్థలకు పేరొందింది.

17

 సింధు నాగరికత కాలంనాటి మూలాలు రోహటక్ లో ఉన్నాయని విశ్వసిస్తారు. ఖోఖ్రకోట్ దగ్గర బయల్పడిన మినార్లు సింధునాగరికత కాలంనాటి ప్రత్యేకత కల్గినవి. దీని ప్రస్తావన మహాభారతంలో రోహిటికగా ఉంది. రోహటక్, బహుశా యధ్యయాసుల సామ్రాజ్యం బహుధాన్యక రాజధాని కూడా అయిఉండవచ్చు. 3-4 శతాబ్ద కాలానికి చెందిన యధ్యయాసుల నాణేల అచ్చులను భారీ సంఖ్యలో కనుగొన్నారు. కుషానుల కాలంలో ఈ పట్టణం ఉందనడానికి నిదర్శనంగా కుషానుల మూల స్థూపాన్ని ఇక్కడ కనుగొన్నారు. ఈ స్థూపంపై రెక్కల సింహాలు, రౌతుల బొమ్మలు చెక్కి ఉన్నాయి.

రోహటక్ క్రీ.శ. 10 వ శతాబ్దం వరకు అభివృద్ధి చెందిందని విశ్వసిస్తారు. ప్రస్తుతం, రోహటక్ అనేక విద్యాసంస్థలకు నివాసం. ఇది భారత అల్పాహారం రేవడికి కూడా ప్రసిద్ధి.

రోహటక్ లోనూ, చుట్టూ ఉన్న పర్యాటక ప్రాంతాలు

రోహటక్ లో జరిపిన తవ్వకాలలో బూడిదతో చిత్రించిన కళాఖండాలు ఉన్న ఒక హరప్పా ప్రదేశం బయల్పడింది. మహాభారత కాలానికి చెందిన ఈ ప్రదేశం, మదీనా-సమర్ గోపాలపూర్ రోడ్డులో గిరవాడ్ గ్రామంలో కనుగొన్నారు. ఢిల్లీ-హర్యానా సరిహద్దు నుండి సుమారు 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిల్యార్ సరస్సును కూడా మీరు సందర్శించవచ్చు. ఈ సరస్సు చుట్టూ ఒక పచ్చటి ప్రాంతం వ్యాపించి ఉండటం వలన, ఢిల్లీ, దాని చుట్టూ ఉన్న ప్రాంతాలలోని పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తుంది.

ఇక్కడ ఉన్న ఒక జూ పులి, చిరుత, జింక, కోతి, పక్షులు, ఇంకా అనేక ఇతర జంతువులకు నివాసం. గురు గోరఖ్ నాథ్ శాఖ కు చెందిన అస్తాల్ బోహర్ అనే ఆశ్రమ౦ లేదా ఒక ఆధ్యాత్మిక అనుచరుల నివాసంలో అవశేషాలు, పురాతన ఆవిష్కరణలు, చెక్కిన రాతి విగ్రహాలు, పవిత్ర గ్రంథాలు, పుస్తకాలు, ధార్మిక ప్రాధాన్యత ఉన్న అనేక ఇతర వస్తువులు ఉన్నాయి.

మహంలోని రాధాకృష్ణుల ఆలయం ఏడాది పొడవునా భక్తులను ఆకర్షిస్తుంది. ఖోకర్లు నిర్మించినట్లుగా విశ్వసించే ఖోఖర్ కోటను కూడా మీరు సందర్శించవచ్చు. ఇది దాని పురోభివృద్ధి కాలంలో ఒక గొప్ప, బలీయమైన కోట కానీ దురదృష్టవశాత్తూ ప్రస్తుతం శిధిలావస్థలో ఉంది.

రోహటక్ లో మహం పట్టణం నడిబొడ్డున జామా మసీదు కూడా ఉంది. మసీదులోని ఒక శిలాశాసనం ప్రకారం దీనిని క్రీ.శ. 1531 లో హుమాయున్ చక్రవర్తి నిర్మించాడు. కాని మరొక శాసనం దీనిని ఔరంగజేబు కాలంలో క్రీ.శ. 1667-68 మధ్య నిర్మించాడని తెలుపుతుంది.

హర్యానాలోని ఇతర అన్ని నగరాల వలె, రోహటక్ లో కూడా ఒక పవిత్రమైన గోకరణ్ చెరువు లేదా గావు కరణ్ చెరువు ఉన్నాయి. ఇది నగరంలోనే ఉంది. ఈ ప్రాంగణంలో ధార్మిక ప్రాముఖ్యత ఉన్న అనేక నిర్మాణాలు, దేవి, దేవతల ఆలయాలు ఉన్నాయి.

రోహటక్ లో ఉన్నప్పుడు, వారాంతపు విహారయాత్రకు, పక్షి ప్రియులకు, ఫోటోగ్రాఫర్లకు అనువైన గమ్యస్థానం భిందవాస్ సరస్సును కూడా మీరు సందర్శించవచ్చు.

రోహటక్ లో వాతావరణం

రోహాతాక్ లో వాతావరణం వైవిధ్యభరితంగా ఉంటుంది.

రోహతాక్ చేరడం ఎలా

రోహటక్ కు చక్కటి రోడ్డు, రైలు, వాయుమార్గం ఉంది.

రోహటక్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

రోహటక్ వాతావరణం

రోహటక్
35oC / 95oF
 • Haze
 • Wind: W 13 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం రోహటక్

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? రోహటక్

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డుమార్గం ద్వారా రోహటక్ నుండి హర్యానా లోని సిర్స, హిసార్, భివాని, బహాదుర్గా, జింద్, గుర్గావ్ తో సహా ప్రధాన నగరాలు, పట్టణాలకు మార్గం ఉంది. ఇది న్యూ ఢిల్లీ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రైవేట్ బస్సులు, హర్యానా ప్రభుత్వం వారి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల సౌకర్యం ఉంది.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలుమార్గం ద్వారా రోహటక్ లో రైలు స్థావరం ఉంది. న్యూ ఢిల్లీ, బహాదుర్గా, భివాని, జింద్, పానిపట్టులకు రైలు మార్గం ఉంది. రోహటక్ లో రైలుస్టేషన్లు రోహటక్ జంక్షన్
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  వాయు మార్గం ద్వారా న్యూ ఢిల్లీ విమానాశ్రయం అతి దగ్గరది. ఇక్కడ నుండి, రోహటక్ వరకు మీరు టాక్సీ లేదా ప్రభుత్వ/ప్రవేట్ రవాణా సంస్థ బస్సులలో ప్రయాణించవచ్చు.
  మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Nov,Mon
Return On
01 Dec,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
30 Nov,Mon
Check Out
01 Dec,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
30 Nov,Mon
Return On
01 Dec,Tue
 • Today
  Rohtak
  35 OC
  95 OF
  UV Index: 9
  Haze
 • Tomorrow
  Rohtak
  31 OC
  88 OF
  UV Index: 9
  Sunny
 • Day After
  Rohtak
  32 OC
  89 OF
  UV Index: 9
  Partly cloudy