Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రోహటక్ » ఆకర్షణలు » జామా మసీదు

జామా మసీదు, రోహటక్

1

చాలా మసీదులకు వాటిని నిర్మించిన వారి లేదా అవి కట్టిన ప్రదేశాల పేర్లను పెడతారు. కాని ప్రపంచంలోని అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాలలో వాటిని కట్టిన లేదా అవి ఉన్న ప్రదేశాల పేర్లు లేని ఒక రకమైన మసీదు కనబడుతుంది. దీనిని సాధారణంగా జామా మసీదు అని అంటారు. రోహటక్ జిల్లాలోని మహం పట్టణం కూడా జామా మసీదుకు నివాసం.

దీనిని ఎప్పుడు, ఎవరు నిర్మించారనే దాని మీద కొంత గందరగోళం ఉంది. మసీదులో ఉన్న రెండు శాసనాల మీద ఇద్దరు వేర్వేరు నిర్మాతల పేర్లు, అదేరకంగా వేర్వేరు తేదీలు ఉన్నాయి. మెట్ల కింది విశాలమైన వేదికపై ఉన్న ఒక శాసనం ప్రకారం, ఈ మసీదును హుమాయున్ చక్రవర్తి క్రీ.శ.1531 లో నిర్మించాడు.

కాని మసీదుకు దక్షిణ గుమ్మటం పై ఉన్న మరొక శాసనం దీనిని ఔరంగజేబు 1667-68 మధ్య కాలంలో నిర్మించాడని తెలుపుతుంది. తన పాలనలోని పదవ సంవత్సరంలో ఔరంగజేబు ఉత్తర్వుల మేరకు ఈ మసీదును ఖ్వాజా రహ్మత్ ఉల్లా నిర్మించాడని ఇది తెలుపుతుంది. కానీ మసీదు హుమాయున్ రాకకు ముందే ఉనికిలో ఉందనే అభిప్రాయం కూడా ఉంది. ఈ మసీదును ప్రతి రోజు ప్రార్ధనలు జరిగే గురుద్వారాగా మార్చారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Jul,Thu
Check Out
10 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri