జింద్  - పుణ్యక్షేత్రాలకు ఒక నివాళి!

గొప్ప ఇతిహాసం అయిన మహాభారతం లో ప్రస్తావించ బడిన పురాతన తీర్ధమయిన జైన్తపురి నుండి , హర్యానా లోని ఈ జింద్ జిల్లా కు ఆ పేరు వచ్చింది . పాండవులు విజయానికి దేవత అయిన జయంతి అమ్మవారి గౌరవార్ధం జయంతి దేవి టెంపుల్ ని నిర్మించారని ఆ గుడి చుట్టుతా వెలసిన పట్టణమే జయన్తిపురి, కాలక్రం లో జింద్ గా పేరు పొందింది .

పౌరాణిక విశేషమే కాక ఇక్కడ జరిగిన తవ్వకాల ద్వారా కూడా ఈ జిల్లా పురాతన విశేషాలు ముడిపడి ఉన్నాయి .అనేక హరప్పా నాగరికత కి పూర్వం మరియు చివరి కాలానికి సంబంధించిన మరియు రంగులద్దిన బూడిద రంగు కుండలు ఈ ప్రదేశం లో లభించాయి .

జింద్ లోని మరియు పరిసర పర్యాటక ప్రదేశాలు

జింద్ లో ఉన్న అనేక పుణ్యక్షేత్రాల ములకంగా ఒక ముఖ్య తీర్ధ యాత్ర గమ్యస్థానం గా పేరు గడించింది .

రఘ్బిర్ సింగ్ , జింద్ రాజు , చే నిర్మించబడిన శివ దేవాలయం భుతెస్వర టెంపుల్ . శివుణ్ణి భుతనాదుడు అని కూడా పిలుస్తారు . ధమ్తన్ సాహిబ్ అనే ప్రదేశం ఇక్కడి పురాతన శివ దేవాలయం మరియు రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి ఆశ్రమం వల్ల ప్రఖ్యాతి చెందినది . జయంతి దేవాలయం 550 ఏళ్ల పురాతనమైనదని నమ్ముతారు .

రామ్ రాయి లేక రామ హ్రద ప్రదేశం లోని అయిదు కొలనులు భగవంతుడు పరశు రాముని చే నిర్మితమయినవి .

ఇక్కడకి సమీపాన ఒక పురాతన పరశు రామ దేవాలయం ఉన్నది . హన్సదేహర్ కూడా మరొక పూరణ విశేషం కల చూడతగ్గ నగరం . తెహసిల్ నార్వన లోని గొప్ప సూఫీ సాధువు హజ్రత్ గైబి సాహిబ్ కు అంకితం ఇవ్వబడిన సమాధి కూడా భక్తులను ఆకర్షించటం లో తన వంతు పాత్ర పోషిస్తున్నది .

నాగేశ్వర మహాదేవ , నాగదామ్ని దేవి మరియు నాగ శేత్ర అనబడే చరిత్ర పూర్వపు పుణ్యక్షేత్ర కేంద్రాలయిన ఈ దేవాలయాలు కల సఫిదోన్ నగరం. ఇక్కాస్ గ్రామం లో ఉన్న ఎకహంస టెంపుల్ జింద్ నుండి అయిదు కిలో మీటర్ ల దూరం లో ఉన్న మరొక ముఖ్య పుణ్యక్షేత్రం .

మహాభారతం లో ప్రస్తావించబడిన అశ్విని కుమార తీర్ధ మరొక పుణ్యక్షేత్రం. ఇక్కడ తీర్థం లోని పవిత్ర జలాలలో స్నానమాచరిస్తే ఆత్మ పరిశుద్ద త పొంది మోక్షం లభిస్తుందని చెప్తారు. అంతే కాక ఈ జలాలకు రోగాలను నివారించే గుణముందని అనేక వ్యాధులను నిర్ములిన్చాగాలదని నమ్ముతారు .

బర గ్రామం లోని భగవంతుడు శ్రీ మహా విష్ణువు యొక్క పుణ్యక్షేత్రమైన వరాహ తీర్థ జింద్ నుండి పది కిలో మీటర్ ల దూరం లో ఉన్నది . ఇది విష్ణువు వరాహ రూపం స్వీకరించినపుడు ఈ ప్రదేశంలో నివశించినట్లుగా నమ్ముతారు

నిర్జన్ గ్రామం లో ని మున్జవత తీర్థ దేవ దేవుడయిన మహాదేవునిది.ద్ఖ్నిఖేర గ్రామం లో ఉన్న యక్షిని మహాగ్రహి కి అంకితమివ్వబడిన దేవాలయం యక్షిని తీర్థ జింద్ కి 8 కి మీ దూరం లో ఉన్నది .

పొంకర్ ఖేరి గ్రామం లో ఉన్న పుష్కర దేవాలయం జింద్ కు దక్షిణాన పదకొండు కిలో మీటర్ ల దూరం లో ఉన్నది.

పురాణ గ్రందాల ప్రకారం ఈ దేవాలయం పరశురాముని చే నిర్మితమయినది గా భావిస్తారు . బాబా ఫోన్కేర్ దేవాలయం మరొక ఆధ్యాత్మిక విశేషం . జింద్ కి ఉత్తరాన 16 కి మీ దూరం లో ఉన్న కసోహన్ గ్రామం లో కాయసోధన దేవాలయం ఉన్నది . పురాణాల ప్రకారం భగవంతుడు విష్ణువు కాయశోధన , లోకోద్దార్ వద్ద స్నానం చేయటం వాళ్ళ ఏర్పడిందని భావిస్తారు .

నార్వన తెహసిల్ లోని శ్రీ తీర్థ , జింద్ యొక్క సిమ్ల గ్రామం లో ఉన్నది . ఈ ప్రదేశాన్ని అతి ఉన్నతమయిన ఆధ్యాత్మిక ప్రదేశం గా భావిస్తారు . సమీపం లోని పవిత్ర కొలను లో స్నానం భక్తులకు ప్ర శాంత త , ఆనందాన్ని కలిగిస్తాయని నమ్ముతారు .

నార్వన తెహసిల్ , జింద్ జిల్లా లోని సంఘాన్ గ్రామం లోని దేవతకు చెందిన దేవాలయం ఉన్నది. ఈ తీర్థం లో పూజించే, ప్రత్యేకించి ఆడవారికి శంఖిని లక్షణాల ఆశిస్సులు లభిస్తాయని నమ్ముతారు .

జింద్ వాతావరణం జింద్ లో మూడు కాలాలు చూడవచ్చు . నవంబర్ నుండి మార్చ్ వరకు జింద్ ని సందర్శించ టానికి ఉత్తమ సమయం .

జింద్ కు చేరటం ఎలా జింద్ రోడ్డు ద్వారా చక్కగా అనుసంధానించ బడింది . జింద్ స్టేషన్ దగ్గరలో ఉన్న మిగతా పట్టణాలకు అనుసంధానిస్తుంది.

Please Wait while comments are loading...