కురుక్షేత్ర  – యోధుల భూమి !!

కురుక్షేత్ర౦ అంటే ధర్మ క్షేత్రం. కురుక్షేత్ర పర్యాటకం చరిత్ర, పురాణాలతో పెనవేసుకు పోయింది. పాండవులకు, కౌరవులకు మధ్య చారిత్రిక మహాభారత యుద్ధం ఇక్కడే జరిగింది. కృష్ణ భగవానుడు భగవద్గీతను అర్జునుడికి భోదించింది ఇక్కడే. ఈ గ్రంథం కర్మ గురించి, హిందూ మతం లోని అత్యున్నత సూత్రాల గురించి తెలియచేస్తుంది. భగవద్గీత కాకుండా, చాలా ఇతర పవిత్ర గ్రంథాలు కూడా ఇక్కడే రాయబడ్డాయి.

 కురుక్షేత్రకురుక్షేత్ర ఘనమైన వర్ణమయమైన చరిత్ర కలిగి వుంది. కాల గమనంలో దాని పవిత్రత పెరుగుతూనే వుంది, బుద్ధ భగవానుడి సహా చాలా మంది సిఖ్ గురువులు కూడా ఈ ప్రదేశాన్ని సందర్శించి ఈ ప్రాంత ధార్మిక యవనికపై తమదైన ముద్ర వేశారు. ప్రస్తుతం కురుక్షేత్ర పర్యాటకం హిందువులకే కాక, బౌద్ధులకు, సిక్కులకు కూడా సాటిలేని తీర్థ యాత్రా స్థలంగా మారింది. ఈ పట్టణంలో పవిత్ర స్థలాలు, దేవాలయాలు, గురుద్వారాలు, కుండ్ లు లాంటి చాలా ధార్మిక కేంద్రాలు వున్నాయి – వీటిలో కొన్నిటికి భారతీయ నాగరికత తోలినాళ్ళతో సంబంధం వున్న మూలాలు వున్నాయి.

కురుక్షేత్ర లోను చుట్టుపక్కలా పర్యాటక ప్రాంతాలు

కురుక్షేత్ర పర్యాటకాన్ని ఆసక్తికరంగా మార్చే చాలా ధార్మిక కేంద్రాలు ఇక్కడ వున్నాయి. ఇక్కడి బ్రహ్మ సరోవర్ సరస్సు ప్రతి ఏటా, ముఖ్యంగా సూర్య గ్రహణం అప్పుడు, వేలల్లో పర్యాటకులను ఆకర్షిస్తుంది. సన్నిహిత సరోవరంలో మునక వేస్తె ఆత్మ శాంతిస్తుందని చెప్తారు. అందువల్ల భారీ సంఖ్యలో హిందువులు ఈ సరస్సు వద్ద తమ పూర్వీకుల కోసం పిండ ప్రదానం చేస్తారు.

హిందువులకు ప్రపంచంలో అత్యంత గౌరవనీయమైన తీర్థ క్షేత్రాలలో ఒకటైన కురుక్షేత్ర పర్యాటకంలోని ఆసక్తి కరమైన అంశం ఏమిటంటే, మహాభారత యుద్ధ క్షేత్రంలో కృష్ణుడు అర్జునుడికి గీత బోధించిన ప్రదేశం జ్యోతిసర్ ఇక్కడే వుంది. కురుక్షేత్ర అభివృద్ది మండలి 1987 లో ఇక్కడ కృష్ణ మ్యూజియం ను ఏర్పాటు చేసింది. ఇక్కడ ప్రదర్శనకు ఉంచిన అవశేషాలు, శిల్పాలు, చిత్రాలు, చేతిరాత ప్రతులు, జ్ఞాపికలు, ఇతర అనేక వస్తువులు కృష్ణుడు ఎంతటి రాజనీతిజ్ఞుడు, వేదాంతి, నిజమైన ఆధ్యాత్మిక బోధకుడు, ఎంత చక్కటి ప్రేమికుడు అనే విషయాన్ని మనకు తెలియచేస్తాయి. తన చారిత్రిక ఆకాశ యానం ద్వారా భారత దేశానికి చెందిన నిర్భయ పుత్రిక కల్పనా చావ్లా స్మారకార్ధం కల్పనా చావ్లా ప్లానెటేరియం ఏర్పాటైంది. ప్రతి రోజు సాయంత్రం జ్యోతిసర్ లోని ప్రధాన యాత్రా కేంద్రంలో శబ్ద కాంటి ప్రదర్శన నిర్వహిస్తారు.

కురుక్షేత్ర శివార్లలోని దిబ్బల మీద నిర్మించిన షేక్ చేహ్లీ సమాధి మరో ఆసక్తికరమైన పర్యాటక కేంద్రం.

కురుక్షేత్ర లోని పవిత్ర పట్టణం థానేసర్ లో వున్న స్థానేశ్వర్ మహాదేవ శివాలయంలో శివలింగం వుంది.

కురుక్షేత్ర లోని థానేసర్ లో నిర్మించిన నాభి కమల్ దేవాలయంలో రెండు దేవతా విగ్రహాలు ఒకే పైకప్పు కింద వున్నాయి. ఇది పెద్ద దేవాలయం కాకపోయినా, బ్రహ్మ కోసం నిర్మించిన కొద్ది దేవాలయాల్లో ఒకటి.

కురుక్షేత్ర లో పాల రాతితో నిర్మించిన బిర్లా మందిరం కూడా వుంది.

తన సైన్యంతో పాటు ఈ ప్రదేశానికి వచ్చిన సిఖ్ గురువు హరగోబింద్ సింగ్ జ్ఞాపకార్ధం ఇక్కడ గురుద్వారా చేవిన్ పట్షాహిస్ ను కూడా నిర్మించారు.

భీష్మ కుండ్ గా పిలిచే బన్ గంగా – మహాభారతంలోని భావోద్వేగాలతో కూడిన శక్తిమంతమైన నాటకీయ ఘట్టానికి స్మారకంగా నిలుస్తుంది. కురుక్షేత్ర జిల్లా లోని నరకతారీ గ్రామంలో వున్న చిన్న దేవాలయం అంపశయ్య మీద భీష్ముడి మరణానికి గుర్తుగా నిర్మించారు.

దీదార్ నగర్ కురుక్షేత్ర సమీపంలోని ప్రసిద్ధ ధార్మిక క్షేత్రం, ప్రతి ఏటా ఇక్కడికి వేలాదిగా యాత్రికులు వస్తారు.

కురుక్షేత్ర లోని పార్కులు

కురుక్షేత్ర ఎలా చేరుకోవాలి ?

కురుక్షేత్ర ని వాయు, రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం చండీగర్ నుండి ఇక్కడికి చేరుకోవచ్చు.

Please Wait while comments are loading...