కుఫ్రి - ప్రకృతి మరియు శిబిరాలకు

కుఫ్రి 2743 మీటర్ల ఎత్తులో ఉండి సిమ్లా నుండి 13 km దూరంలో ఉన్న ఒక చిన్న పట్టణం.ఈ ప్రదేశంనకు స్థానిక భాషలో 'సరస్సు' అనే అర్థం వచ్చే 'కుఫ్ర్' అనే పేరు నుండి వచ్చింది. ఇక్కడ అనేక ఆకర్షణలు ఉండుట వల్ల సంవత్సరం పొడవునా పర్యాటకులు వస్తారు.

మహాసు పీక్, గ్రేట్ హిమాలయన్ ప్రకృతి పార్క్, మరియు ఫాగు మొదలైనవి కుఫ్రిలో చూడవలసిన ప్రముఖ పర్యాటక ప్రాంతాలు.గ్రేట్ హిమాలయన్ ప్రకృతి పార్క్ లో 180 జాతుల పక్షులు మరియు జంతువులు ఉన్నాయి. కుఫ్రి నుండి 6 కిమీ దూరంలోఉన్న ఫాగు శాంతి ప్రేమికులకు ఒక ప్రసిద్ధ గమ్యస్థానంగా ఉంది. సుందరమైన పర్వత శ్రేణులతో నిండిన,ఈ ప్రదేశంలో ఒక ప్రముఖ మత సంబంధమైన సైట్ ఉంది. దీనికి దగ్గరలో ఉన్న కొన్ని ఆలయాలలో కొయ్య బొమ్మలను ఆరాధిస్తారు. ఈ ప్రదేశంలో హైకింగ్, కాంపింగ్,మరియు ట్రెక్కింగ్ వివిధ సాహస చర్యలకు ప్రసిద్ది చెందింది. సాహస ఔత్సాహికులు మంచుపై జారడం, గుర్రపు స్వారీ వంటి వివిధ క్రీడలను ఆస్వాదించవచ్చు. మంచు గడ్డలపై జారుచూ పోవు చక్రములు లేని బండి (తోబోగ్గనింగ్ ) మరియు కుఫ్రి దగ్గర గడిపిన కాలంలో గో -కార్టింగ్ చేయవచ్చు. అంతే కాకుండా సాహసోపేత కార్యక్రమాలకు గుర్రాలు కూడా చేరలేని ప్రాంతాలకు వెళ్ళటానికి గో -కార్టింగ్ ను ఉపయోగిస్తారు.

కుఫ్రి కి సమీప విమానాశ్రయం 22 కిమీ దూరంలో ఉన్న సిమ్లా లోని జుబ్బార్ హత్తి విమానాశ్రయము. ఈ విమానాశ్రయం సాధారణ విమానాలు ద్వారా అన్ని ప్రధాన నగరాలకు కలపబడింది. కుఫ్రి నుండి 100 కి.మీ. దూరంలో ఉన్న కాల్కా, భారతదేశం యొక్క అన్ని ప్రధాన నగరాలకు సిమ్లాను కలుపుతోంది. కుఫ్రి ఒక నారో గేజ్ రైలు మార్గం ద్వారా సిమ్లాకు అనుసంధానించబడింది. రోడ్డు ప్రయాణం అనుకున్నవారికి పర్యాటకులు సిమ్లా, నర్తండ మరియు రాంపూర్ నుండి నేరుగా బస్సులు లభిస్తాయి. రాష్ట్ర రోడ్డు రవాణా బస్సులు మరియు ప్రైవేట్ డీలక్స్ బస్సులు రెండు సిమ్లా నుండి కుఫ్రి కి సులభంగా అందుబాటులో ఉంటాయి.

కుఫ్రిలో వేసవి కాలం ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉండి,వాతావరణం ఆ సమయంలో సమశీతోష్ణ వాతావరణం కలిగి ఉంటుంది. ఈ సీజన్లో ఉష్ణోగ్రత 12°C నుండి 19°C వరకు ఉంటుంది. రుతుపవన కాలంలో తక్కువ వర్షపాతం మరియు ఉష్ణోగ్రత సుమారు 10 °C వరకు పడిపోతుంది. శీతాకాలాలు చాలా చల్లగా ఉంటాయి, మరియు ఉష్ణోగ్రత 0 ˚ C కన్నా తక్కువకు పడిపోతుంది. మార్చి మరియు నవంబర్ మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని సందర్శించటానికి అనువైనదిగా భావిస్తారు.

గ్రేట్ హిమాలయన్ ప్రకృతి పార్క్..ఈ పార్క్ 2600 మీటర్ల ఎత్తులో ఉండి, మరియు 90 హెక్టార్ల వైశాల్యంలో విస్తరించి ఉన్నది.కుఫ్రిలో ఇది ప్రముఖ ఆకర్షణగా ఉంది. చెట్లలో అనేక రకాలైన ఓక్, ఫిర్, స్ప్రూస్,నీలం దేవదారు చెట్టు, మరియు పచ్చనిపొద వంటివి ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రదేశం నుండి హిమాలయాలు మరియు ఇతర మంచు కప్పబడిన శిఖరాల యొక్క విస్తృత దృశ్యాలను చూడవచ్చు. కస్తూరి జింక, బ్రౌన్ ఎలుగుబంటి, మోనాల్,గోరల్స్, థార్, చిరుత, భరల్, సెరో, కలిజ్,కోక్లాస్, చీర్ త్రాగోపాన్ మరియు మంచు కాక్ సహా అనేక జంతువులు ఉంటాయి. ఈ ప్రకృతి పార్క్ లో 180 రకాల జాతుల జంతువులు మరియు పక్షులు ఉన్నాయి. ఈ పార్క్ అంతరించిపోతున్న కొన్ని మొక్కలు మరియు జంతువుల జాతులను రక్షిస్తుంది.

శిబిరాల సౌకర్యాలు ముఖ్యంగా విద్యార్థులకు మార్గదర్శక ట్రెక్కింగ్ సౌకర్యాలు ఈ పార్కులో పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి. సుమారు 5 నుండి 8 రోజుల ట్రెక్ చేయటానికి సాహస ఔత్సాహికులకు సాయి రోప పర్యాటక కేంద్రం అన్ని సౌకర్యాలను అందిస్తుంది. ఈ పార్క్ సమీపంలో ఉన్న దేవాలయాలు సందర్శించవచ్చు. ఫాగు 2.509 మీటర్ల ఎత్తులో ఉండి,కుఫ్రిలో ఒక ప్రముఖ పర్యాటక కేంద్రం. ఈ ప్రదేశం సిమ్లా నుండి 23 కి.మీ.లు మరియు కుఫ్రి నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రయాణికులు పర్వతాలు, పండ్ల తోటలు, మరియు అడవులు యొక్క అందమైన దృశ్యాల ను చూసి ఆనందించవచ్చు. పైన ఒక పర్యాటక బంగళాలో గిరి లోయ యొక్క సుందరమైన వ్యూ ఉంటుంది. ఇంకా అదనంగా, ఫాగు దగ్గరలో బన్తియా దేవతా,మరియు పలు సుందరమైన దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాల గోడలపై స్థానిక కొయ్య చెక్కడం, హిమాచల్ యొక్క శిల్పుల కళాత్మక శ్రేష్ఠతను వర్ణిస్తాయి.

ఈ ప్రదేశం ప్రయాణీకులు ప్రకృతి మరియు శిబిరాలకు చాలా ప్రసిద్ది చెందింది.ఈ ప్రదేశంలో పర్యాటకులు ఒక రాత్రి గడపాలి అనుకొంటే లైట్లతో కాంతిని ఏర్పాటు చేసుకోవాలి.శీతాకాలంలో స్కై ఉత్సవాలను నిర్వహిస్తారు. అప్పుడు చాలా మంది పర్యాటకులు ఫిబ్రవరి నెలలో ఫాగును సందర్శిస్తారు.

Please Wait while comments are loading...