Search
  • Follow NativePlanet
Share

రైసన్ - రివర్ రాఫ్టర్ల ప్రేమాయణం !

6

కులు నుంచి 16 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 1433 మీటర్ల ఎత్తున నెలకొని వుంది రైసన్. బియాస్ నది ఒడ్డున కొన్ని చిన్న చిన్న గ్రామాలతో ఏర్పడిన రైసన్ తేట నీటి మీద రాఫ్టింగ్ కి, క్యాంపింగ్ చేసే ప్రదేశాలకి ప్రసిద్ది. అసంఖ్యాకమైన యాపిల్ తోటలు, రేగు, నేరేడు తోటలు ప్రకృతిని మరింత రమణీయంగా మారుస్తాయి. శీతాకాలం చివరికి, మార్చ్ నెలలో ఈ ప్రాంతం అంతా కొత్తగా పుష్పించే పూలతో వర్ణమయంగా మారిపోతుంది.

ప్రతి ఏటా వేసవి లో జరిగే రాజేంద్ర ప్రసాద్ నేషనల్ ఆప్తాల్మాలజీ సెంటర్ వారి చికిత్సా శిబిరం ఈ ప్రాంతపు ప్రధాన ఆకర్షణ. ఈ శిబిరంలో అనేక నేత్ర వ్యాధులకు చికిత్స చేస్తారు. రైసన్ లోని రఘునాథ్ దేవాలయం హిందువుల పుణ్య క్షేత్రం. రాముడి పేరిట నిర్మించిన ఈ దేవాలయం ఏడాది పొడవునా ఎంతో మంది యాత్రికులను ఆకర్షిస్తుంది.

రైసన్ లో చూసి తీరాల్సిన మరో దేవాలయం జగన్నాది దేవాలయం. కులు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని బెఖీ అనే గ్రామంలో వుండే ఈ దేవాలయం అత్యద్భుత నిర్మాణ కౌశలం తో నిర్మించబడింది. కులు, మనాలి, గుషైని, నగ్గర్, భు౦టార్, మణికరణ్, పాలంపూర్ ఇక్కడికి దగ్గరలోని కొన్ని ఇతర పర్యాటక ప్రదేశాలు.

రైసన్ వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. రైసన్ లో రైల్వే స్టేషన్ గానీ విమానాశ్రయం గానీ లేకపోయినప్పటికీ, దగ్గరలోని విమానాశ్రయం లేదా రైల్వే స్టేషన్ దాకా వెళ్లి, అక్కడినుంచి రైసన్ చేరుకోవచ్చు. కులు లో వున్నది ఇక్కడికి దగ్గరలోని విమానాశ్రయం. అక్కడి నుంచి టాక్సీల ద్వారా ప్రయాణీకులు ఇక్కడికి తేలిగ్గానే చేరుకోవచ్చు. రోడ్డు ద్వారా రావాలంటే 21 కిలోమీటర్ల దగ్గర లోని కులు గుండా రావచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు రెండిటిలోనూ ఇక్కడికి చేరుకోవచ్చు.

రైసన్ లో ఏడాది పొడవునా వాతావరణం ఒక మాదిరిగానే వుంటుంది. వేసవిలో ఇక్కడి ఉష్ణోగ్రతలు 25 నుంచి 35 డిగ్రీల మధ్య వుంటాయి. వర్షాకాలంలో ఒక మోస్తరు వర్షాలు పడతాయి. కనుక యాత్రికులు ఈ కాలంలో కూడా ఇక్కడికి రావచ్చు. శీతాకలాల్లో ఇక్కడి ఉష్ణోగ్రతలు 25 నుంచి 0 డిగ్రీల మధ్య వుంటాయి. చలి తీవ్రంగా వుంటుంది కనుక యాత్రికులు మంచి శీతాకాలం అప్పుడు ఇక్కడికి రాకుండా వుండడం మంచిది.

రైసన్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

రైసన్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం రైసన్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? రైసన్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం : 21 కిలోమీటర్ల దూరంలోని కులు గుండా రైసన్ కు రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.కులు కు షిమ్లా, చండీఘర్, అమృతసర్, దేశంలోని ఇతర ప్రధాన నగరాల నుంచి బస్సులు అందుబాటులో వున్నాయి. ప్రయాణీకులు ప్రభుత్వ, ప్రైవేటు బస్సుల్లో కులు నుంచి రైసన్ కు చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం : చండీఘర్ ఇక్కడికి దగ్గరలోని రైల్వే స్టేషన్. ఇది చెన్నై, న్యూ డిల్లీ, అమృతసర్ లాంటి ప్రధాన నగరాలకు అనుసంధానం చేయబడి వుంది. రైలు మార్గం : చండీఘర్ రైసన్ కు దగ్గరలోని రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి చెన్నై, న్యూడిల్లీ, అమృతసర్ లాంటి నగరాలకు రైళ్ళు వున్నాయి. స్టేషన్ బయటి నుంచి బస్సులు లేదా టాక్సీలలో ఇక్కడికి చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    ప్రయాణానికి ఉత్తమ మార్గం : రైసన్ లో విమానాశ్రయం గానీ రైల్వే స్టేషన్ గానీ లేవు. ఐతే భు౦టార్ విమానాశ్రయం నుంచి లేదా చండీఘర్ రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ పట్టణానికి అనేక బస్సులు నిత్యం నడుస్తుంటాయి. దగ్గరలోని నగరాలు, పట్టణాలకు రైలు లేదా విమానాల్లో చేరుకొని అక్కడినుంచి రైసన్ పట్టణానికి వెళ్ళవచ్చు. వాయు మార్గం : 21 కిలోమీటర్ల దూరంలో వున్న భు౦టార్ ఇక్కడికి దగ్గరలోని విమానాశ్రయం. ఈ విమానాశ్రయం దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు బాగా అనుసంధానించబడి వుంది. యాత్రికులు ఇక్కడినుంచి నగర కేంద్రానికి టాక్సీలు లేదా బస్సుల్లో చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Jul,Fri
Check Out
11 Jul,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat