Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రైసన్ » వాతావరణం

రైసన్ వాతావరణం

సందర్శనకు ఉత్తమ సమయం : వేసవిలో ఆహ్లాదకరమైన వాతావరణం వుంటుంది కాబట్టి ఆ కాలంలో రైసన్ సందర్శన మంచిది. ఈ కాలంలో ఐతే పర్యాటకులు రివర్ రాఫ్టింగ్, పర్వతారోహణ లాంటి వివిధ సాహసక్రీడలు కూడా ఆస్వాదించవచ్చు.

వేసవి

రైసన్ లో వాతావరణం ఏడాది పొడవునా మధ్యస్తంగా వుంటుంది. ఇక్కడి వేసవి చాలా హాయిగా వుంటుంది కానీ శీతాకాలాలు మాత్రం చాలా చల్లగా వుంటాయి.వేసవి (ఏప్రిల్ నుంచి జూన్) : ఏప్రిల్ నుంచి జూన్ దాకా ఇక్కడ వేసవి కాలం నడుస్తుంది. ఈ కాలంలో ఉష్ణోగ్రత గరిష్టంగా 35 డిగ్రీలకు, కనిష్టంగా 25 డిగ్రీలకు చేరుకుంటుంది. ఈ కాలంలో యాత్రికులు ఎలాంటి ఉన్ని దుస్తులు లేకుండా పట్టణంలో యధేచ్చగా తిరగవచ్చు

వర్షాకాలం

వర్షాకాలం (జూలై నుంచి సెప్టెంబర్) : రైసన్ లో వర్షాకాలం జూలై నుంచి సెప్టెంబర్ దాకా వుంటుంది. ఈ ప్రదేశంలో మందకొడిగా వర్షాలు పడతాయి కనుక ఈ కాలంలో కూడా రైసన్ ను సందర్శించవచ్చు.

చలికాలం

శీతాకాలం (అక్టోబర్ నుంచి మార్చ్) : శీతాకాలంలో ఉష్ణోగ్రతలు 0 నుంచి 25 డిగ్రీల దాకా వుంటుంది. శీతాకాలం మధ్యలో ఉష్ణోగ్రత సున్నా కన్నా తక్కువ డిగ్రీలకు పడిపోతుంది కనుక ఆ కాలంలో రైసన్ సందర్శన మంచిది కాదని ప్రయాణీకులకు సూచన.