కసౌలి - గూర్ఖాల రాజ్యం !

హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లాలో కసౌలి ఒక హిల్ స్టేషన్. సముద్ర మట్టానికి సుమారు 1800 మీటర్ల ఎత్తున కలదు. ఈ ప్రదేశం గురించి రామాయణ కావ్యం లో కూడా పేర్కొనబడింది. పురాణాల మేరకు, హిందువుల అర్రధ్య దైవం హనుమంతుడు ఈ ప్రదేశం పై సంజీవని హిల్ తీసుకు వచ్చేటపుడు మధ్యలో అడుగు పెట్టాడని చెపుతారు. ఈ ప్రదేశానికి ఈ పేరు అక్కడ కల ఒక జలపాతం కారణంగా వచ్చింది. ఈ జలపాతం కౌసల్య అనే పేరు తో జాబలి మరియు కసౌలి ల మధ్య కలదు.

19 వ శతాబ్దంలో గూర్ఖాల రాజ్యంలో కసౌలి ఒక ప్రధాన పాత్ర వహించింది. తర్వాతి కాలంలో ఈ ప్రదేశాన్ని బ్రిటిష్ వారు మిలిటరీ టవున్ గా మార్చారు. ఈ ప్రదేశం లోనే అనేక మంది స్థానికులతో సహా చాలా మంది 1857 సిపాయిల తిరుగుబాటు జరిగినపుడు బ్రిటిష్ సైన్యం లో చేరారు. . తర్వాతి కాలం లో వీరు కసౌలి సైనికులతో చేతులు కలిపి బ్రిటిష్ వారిచే దారుణమైన కొన్ని శిక్షలు కూడా అనుభవించారు.

ప్రస్తుతం కసౌలి ఇండియన్ ఆర్మీకి ఒక కంటోన్మెంట్ ప్రాంతంగా వుంది. సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కసౌలి క్లబ్ , లారెంసు స్కూల్ వంటివి కసౌలిలో మరియు ప్రపంచం లోనే కొన్ని ప్రధాన సంస్థలు. కసౌలి ప్రకృతి అందాల మధ్యన కలదు. ఇక్కడి క్రిస్ట్ చర్చి, మంకీ పాయింట్, కసౌలీ బ్రూవరీ, బాబా బలాక్ నాథ్ టెంపుల్, గూర్ఖా ఫోర్ట్ లు ప్రధాన ఆకర్షణలు.

పర్యాటకులు కసౌలి ని వాయు, రైల్వే, రోడ్డు మార్గాలలో చేరవచ్చు. ఈ ప్రదేశానికి చందిఘాట్ ఎయిర్ పోర్ట్ సుమారు 59 కి. మీ. ల దూరంలో కలదు. ఈ ఎయిర్ పోర్ట్ నుండి దేశంలోని శ్రీనగర్, కోల్కత్త, న్యూ ఢిల్లీ, ముంబై నగరాల ఎయిర్ పోర్ట్ లకు విమానాలు నడుస్తాయి.

కసౌలి నుండి 40 కి. మీ.ల దూరంలోకల కలకా స్టేషన్ సమీప రైలు స్టేషన్. హిమాచల్ ప్రదేశ్ లోని వివిధ ప్రదేశాల నుండి బస్సులు కూడా కలవు. ఎల్లపుడూ అనుకూలమైన వాతావరణం వుండటంచే ఈ హిల్ స్టేషన్ ను సంవత్సరంలో ఎపుడైనా సందర్శించవచ్చు.

Please Wait while comments are loading...