Search
 • Follow NativePlanet
Share

కల్ప  - గొప్ప వారసత్వ సంపద !

24

కల్ప, హిమాచల్ ప్రదేశ్ కిన్నార్ జిల్లాలో ఉన్న ఒక చిన్న గ్రామము. సముద్ర మట్టానికి 2758 మీటర్ల ఎత్తులో వొదిగి ఉన్న కల్ప, గతంలో కిన్నార్ ప్రాంతం యొక్క ప్రధాన కార్యాలయంగా ఉండేది. కాలక్రమంలో, రెకాంగ్ పియో నగరం చేత భర్తీ చేయబడింది. యాత్రికులు, ఉత్కృష్టమైన హిమాలయాల క్రిందికి వస్తూ, కిన్నార్ యొక్క రాతిమయమైన ఉపరితలం గుండా ప్రవహించే అందమైన సట్లెజ్ నదిని, చూడవచ్చు.

చారిత్రిక ఆధారాల ప్రకారం, కల్ప ప్రాంతం, మగధ వంశం పరిపాలన కిందన, తర్వాత 6 వ శతాబ్దంలో మౌర్య సామ్రాజ్యం కిందన ఉందని తెలుస్తుంది. అలాగే, కిన్నార్ ను 9వ మరియు 12 వ శతాబ్దాలలో టిబెట్ కు చెందిన గుగే రాజ్యం పాలించింది. తరువాత, అక్బర్ చక్రవర్తి ఈ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకుని, మొఘల్ సామ్రాజ్యం కిందకి చేర్చాడు.

స్థానిక భాషలో కిన్నెర కైలాష్ పర్వతంగా పిలవబడే కిన్నార్ కైలాష్ పర్వతం, కల్ప యొక్క ప్రధాన ఆకర్షణలలో ఒకటి. ఇది ఈ ప్రాంతం యొక్క స్థానికులచే పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ శిఖరం పైన ఉన్న 70 మీటర్లు పొడవైన శివలింగం భక్తులను మరియు పర్యాటకులను సంవత్సరం పొడువునా, పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తున్నది. సముద్ర మట్టానికి 8900 అడుగుల ఎత్తులో, బాష్పనది ఒడ్డున, ఉన్న సంగ్లా లోయ, మరొక ప్రముఖ ఆకర్షణ.

భవన నిర్మాణశాస్త్రం పట్ల ఆసక్తి ఉన్న ప్రయాణికులు, నిర్మాణ సమర్థతకై ప్రసిద్ధి చెందిన, కమరు కోట, నాగ ఆలయం మరియు సప్ని సందర్శించవచ్చు. పర్యాటకులు, గొప్ప వారసత్వ సంపద మరియు సంప్రదాయానికి పేరుగాంచిన చిని గ్రామం కూడా చూడవచ్చు. సముద్ర మట్టానికి 2290 మీటర్ల ఎత్తులో ఉన్న రెకాంగ్ పియో నగరం, కిన్నార్ కైలాష్ పర్వతం యొక్క విస్తృత దృశ్యం అందిస్తుంది. ఆపిల్ తోటలు నుండి కేవలం 10 నిమిషాల దూరంలో ఆత్మహత్య ప్రదేశం (సూసైడ్ పాయింట్) మరొక ముఖ్య సందర్శనీయ స్థలం. సాహస ఔత్సాహికులు ఈ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేసి, ఈ ప్రదేశం యొక్క అత్యద్భుతమైన అందాన్ని మరింత ఆస్వాదించవచ్చు.

కల్పలో చాలా మంది స్థానికులు, అందంగా నేసిన శాలువాలు మరియు కిన్నారి టోపీలు అమ్మడం ద్వారా, తమ జీవనోపాధి సంపాదిస్తారు. చూడటానికి ఎంతో ఆసక్తికరమైన హిందూ, బౌద్ధ సంస్కృతుల అందమైన సమ్మేళనం, కల్ప సంస్కృతిలో ప్రతిబింబిస్తుంది.

యాత్రికులు విమానాలు, రైళ్ళు లేదా రహదారుల ద్వారా సులభంగా కల్పను చేరుకోవచ్చు. విమాన ప్రయాణం చేయాలి అనుకున్నప్రయాణీకులకు, సిమ్లా విమానాశ్రయం, కల్ప సమీపంలోని వైమానిక స్థావరం. ఇది కల్ప గ్రామం నుండి 276 కి.మీ.ల దూరంలో ఉంది. కొత్త ఢిల్లీ, ముంబై మరియు కుల్లు వంటి పెద్ద నగరాలతో అనుసంధానించబడి ఉంది. సిమ్లా విమానాశ్రయం నుండి కల్పకు, యాత్రికులకు, టాక్సీలు మరియు క్యాబ్ లు, సులభంగా లభిస్తాయి.

కల్పకి సమీపంలోని రైల్వే స్టేషన్, 244 కిలోమీటర్ల దూరంలో ఉన్న, సిమ్లా రైల్వే స్టేషన్. ఇది ముఖ్యమైన భారతీయ నగరాలకు కలపబడిన ఒక ప్రధాన రైల్వేస్టేషన్. టాక్సీలు మరియు బస్సులు రైల్వే స్టేషన్ నుండి కల్పకు సులభంగా అందుబాటులో ఉంటాయి. యాత్రికులు, పోవారి నుండి కల్ప కు కలుపబడే జాతీయ రహదారి-22 (హిందుస్తాన్-టిబెట్ రహదారి) ద్వారా కూడా కల్పకు చేరుకోవచ్చు. యాత్రికులకు, సిమ్లా మరియు రాంపూర్ వంటి సమీపంలోని నగరాలు నుండి కల్పకు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ బస్సులు, లభ్యమవుతాయి. అంతే కాకుండా, పర్యాటకులకు వేసవి కాలంలో మాత్రమే తెరవబడే రోహతంగ్ కనుమ నుండి కూడా బస్సులు లభిస్తాయి.

కల్ప సందర్శించడానికి ఉత్తమ సమయం, వేసవి కాలం. ఈ సమయంలో ఈ ప్రాంత ఉష్ణోగ్రత మధ్యస్థంగా ఉంటుంది. వేసవిలో నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రత 8 ° సెం. ఋతుపవనాల కాలంలో, కల్పలో అనూహ్యమైన వర్షపాతం ఉంటుంది. అందువల్ల, పర్యాటకులు వర్షపు దుస్తులు తీసుకు రావలసిందిగా సూచిస్తారు. యాత్రికులు శీతాకాలంలో ఈ ప్రదేశాన్ని సందర్శించడం మంచిది కాదు. ఉష్ణోగ్రత -10 ° సెం. కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉంది.

కల్ప ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కల్ప వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కల్ప

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? కల్ప

 • రోడ్డు ప్రయాణం
  రహదారి: పోవారి నుండి కల్ప కు వెళ్ళే జాతీయ రహదారి-22 (హిందూస్తాన్-టిబెట్ రహదారి) ద్వారా కూడా కల్పకు చేరుకోవచ్చు. సిమ్లా మరియు రాంపూర్ వంటి సమీపంలోని నగరాలు నుండి కల్పకు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ బస్సులు, లభ్యమవుతాయి. పర్యాటకులకు వేసవి కాలంలో మాత్రమే తెరవబడే రోహతంగ్ కనుమ నుండి కూడా బస్సులు లభిస్తాయి.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలు ప్రయాణం: 230 కి.మీ.ల దూరంలో ఉన్న సిమ్లా రైల్వే స్టేషన్, కల్ప దగ్గరగా ఉన్న రైలు మార్గం. ఇది, ముఖ్యమైన భారతీయ నగరాలతో కల్ప ను కలిపే, ఒక ప్రధాన రైల్వే స్టేషన్. యాత్రికులు రైల్వే స్టేషన్ నుండి సులభంగా కల్ప చేరటానికి, టాక్సీలు అద్దెకు తీసుకోవచ్చు లేదా బస్సులలో రావచ్చు.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  యాత్రికులు ప్రధాన రవాణా మార్గాలైన, వాయు, రైల్వే మరియు రహదారుల ద్వారా కల్ప చేరుకోవచ్చు. విమానయానం: 250 కి.మీ.ల దూరంలో ఉన్న సిమ్లా విమానాశ్రయం, కల్ప సమీపంలోని వైమానిక స్థావరం. ఈ విమానాశ్రయం నుండి కొత్త ఢిల్లీ, కుల్లు కు విమానాలు సులభంగా అందుబాటులో ఉన్నాయి. యాత్రికులు సిమ్లా విమానాశ్రయం నుండి కల్ప చేరటానికి, టాక్సీలు అద్దెకు తీసుకోవచ్చు లేదా బస్సులలో రావచ్చు.
  మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Jan,Sun
Return On
30 Jan,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
29 Jan,Sun
Check Out
30 Jan,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
29 Jan,Sun
Return On
30 Jan,Mon