Search
  • Follow NativePlanet
Share

సాంగ్ల - సుందర దృశ్యాల పర్వత పట్టణం!

22

సాంగ్ల, హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలో ఉన్న సుందర దృశ్యాల పర్వత పట్టణం. బాస్పా లోయలో ఉన్న ఈ ప్రాంతం టిబెటన్ సరిహద్దుకి దగ్గరలో ఉంది. టిబెటన్ భాషలో ‘పాస్ ఆఫ్ లైట్’ అన్న అర్ధం వచ్చే గ్రామం పేరుని ఈ పట్టణానికి పెట్టారు. చుట్టూ అటవీ వాలులు, పర్వతాలతో మహోన్నత హిమాలయాలలో ఉన్న ఈ ప్రాంత ప్రాకృతిక అందాలు మంత్రముగ్ధుల్ని చేస్తాయి. 1989 వరకు, ఈ ప్రాంతాన్ని సందర్శించదలుచుకున్న పర్యాటకులు భారత-చైనా సరిహద్దులో ఉన్నందువలన భారత ప్రభుత్వ ప్రత్యెక అనుమతి తీసుకోవలసి వచ్చేది. అయితే, తరువాతి కాలంలో పర్యాటక రంగాన్ని అభివృద్ది చేయడానికి ఈ నియమాన్ని నిషేధించారు.

ఈ ప్రాంతం పైన్ గింజ తోటలు, అందమైన యాపిల్, చెర్రీ చెట్లకు ప్రసిద్ది పొందింది. చిట్కుల్, కర్చం, బట్సేరి వంటి గ్రామాలూ సాంగ్ల లో ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు. ఇపుడు కామాక్షి దేవి ఆలయంగా మారిన కామరూ ఫోర్ట్ కూడా ఇక్కడి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. ఈ ఆలయం పురాతన కళా నైపుణ్యతను ప్రదర్శిస్తుంది. పర్యాటకులు ఆలయ మూడవ అంతస్తులోని ఈ దేవత భారీ విగ్రహాన్ని చూడవచ్చు. మాతా దేవిగా ప్రసిద్ది చెందిన చిట్కుల్ మాతి విగ్రహం ఉన్న ఈ ఆలయం సాంగ్ల లోని మరో ప్రసిద్ధ ధార్మిక ప్రదేశం. ఈ దేవతను ప్రార్ధించడానికి ప్రతి ఏటా అనేకమంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.

సాంగ్ల గుండా ప్రవహించే బస్పా నది కూడా ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణ గా భావిస్తారు ఎందుకంటే ఇక్కడ చేపలు పట్టడం, పర్వతారోహణ, క్యాంపింగ్ లాంటి కార్యక్రమాలతో ఆనందించడానికి బాగుంటుంది. ఈ ప్రాంతమంతా అందమైన పైన్ చెట్లు, ఓకు వనాల మధ్య వుండగా, ఇక్కడ వుండే మంచు సెలయేళ్ళు, వనాలు ఈ అందాన్ని మరింత ఇనుమడింప చేస్తాయి.

షాపింగ్ చేయాలనుకునే వారు సాంగ్ల నుంచి 8 కిలోమీటర్ల దూరంలో వున్న బత్సేరి గ్రామం నుంచి చేతితో తయారు చేసిన శాలువాలు, కిన్నౌరీ టోపీలు కొనవచ్చు. చిల్గోజా లేక పైన్ గింజలు ఉత్పత్తి చేసే ఏకైక కేంద్రం కావడం వల్ల బత్సేరీ గ్రామం చాల ప్రసిద్ది చెందింది. సాంగ్ల కు దగ్గరలో వున్న ఇతర గ్రామాలు సాప్ని, కందా, ట్రౌట్ చేపల పెంపక కేంద్రం. మధ్యయుగాల నాటి నిర్మాణ శైలిని తలపించే ఇక్కడి చెక్క ఫర్నిచర్ కూడా యాత్రికులను ఇక్కడికి ఆకర్షిస్తుంది. చేత్తో చేసిన చెక్క ఫర్నిచర్ దొరికే సాంగ్ల లోని టిబెటన్ చెక్క తయారీ కేంద్రం కూడా బాగా ప్రసిద్ది చెందింది. ఇవి ఇక్కడి వారి కళకు ప్రాతినిధ్యం వహిస్తాయి.

సాంగ్ల నుంచి 238 కిలోమీటర్ల దూరంలో వున్న షిమ్లా లోని జుబ్బర్ హట్టి ఇక్కడికి సమీప విమానాశ్రయం. యాత్రికులు ఇక్కడి నుంచి సాంగ్ల చేరుకోవడానికి సరసమైన ధరలకు టాక్సీలు మాట్లాడుకోవచ్చు. రైల్లో వెళ్లాలనుకునే యాత్రికులు షిమ్లా కు నేరుగా కలిసే ఇక్కడికి సమీపంలోని కల్కా రైల్వే స్టేషన్ కు చేరుకోవచ్చు. భారత దేశంలోని ప్రధాన నగరాలకు అనుసంధానం చేసి వున్న షిమ్లా ఇక్కడికి దగ్గరలోని ప్రధాన రైల్వే స్టేషన్. చండీఘర్ నుంచి సాంగ్ల కు ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు అందుబాటులో వున్నాయి.

శీతాకాలాల్లో తప్ప సాంగ్ల లో ఏడాది పొడవున వాతావరణం ఆహ్లాదకరంగానే వుంటుంది. వేసవి లో ఉష్ణోగ్రతలు 8 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య వుండి హాయిగా ఉంటు౦ది. వర్షాకాలంలో సాంగ్ల లో వర్షం తక్కువగానే పడుతుంది. శీతాకాలాలు చాలా చల్లగా వుంటాయి, కనుక ఆ సమయంలో ఇక్కడికి రావడం మంచిది కాదు. అప్పుడు ఇక్కడి ఉష్ణోగ్రత 10 డిగ్రీల నుంచి -10 డిగ్రీల వరకు వుంటుంది. వర్షాకాలం, వేసవికాలం ఈ అందమైన ప్రాంతాన్ని చూడడానికి అనువైన సమయాలుగా భావిస్తారు.

సాంగ్ల ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

సాంగ్ల వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం సాంగ్ల

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? సాంగ్ల

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ద్వారా: షిమ్లా, చండీగర్ నుండి సాంగ్ల కు రోజువారీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాల నుండి ప్రతిరోజూ అనేక డీలక్స్ బస్సులు నడుస్తాయి. ఈ బస్సులు ఎంతో సౌకర్యవంతంగా, అదేవిధంగా సరసమైన ధరలలో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుమార్గం ద్వారా: నారో గేజ్ రైలు కేంద్రమైన కాల్కా సాంగ్ల కు సమీప రైల్వే స్టేషన్. అయితే, ఈ రైల్వే స్టేషన్ ప్రధాన రైలుకేంద్రమైన షిమ్లా రైల్వే స్టేషన్ కు నేరుగా కలుపబడి ఉంది. షిమ్లా రైల్వే స్టేషన్ భారతదేశం లోని ప్రధాన నగరాలతో అనుసంధానించబడి ఉంది. పర్యాటకులు రైల్వే స్టేషన్ బయటి నుండి అద్దె కాబ్స్, టాక్సీల ద్వారా ఈ పట్టణ కేంద్రానికి చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    సాంగ్ల ప్రాంతానికి వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా తేలికగా చేరుకోవచ్చు. వాయుమార్గం ద్వారా: షిమ్లా లోని జుబ్బర్ హట్టి విమానాశ్రయం సాంగ్ల కి సమీప కేంద్రం. ఈ విమానాశ్రయం న్యూ డిల్లీ, చండీగర్ వంటి భారతదేశం లోని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉంది. పర్యాటకులు విమానాశ్రయం వెలుపల నుండి షుమారు 238 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాంగ్ల ను అద్దె కాబులు, టాక్సీల ద్వారా చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Apr,Thu
Check Out
19 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri