Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కిన్నౌర్

కిన్నౌర్ - 'ది ల్యాండ్ అఫ్ ఫేరీ టేల్స్'

35

కిన్నౌర్, ఈ అందమైన జిల్లా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లో ఉన్నది, దీనినే 'ది ల్యాండ్ అఫ్ ఫేరీ టేల్స్' అని కూడా పిలుస్తారు. మంచుతో కప్పబడిన పర్వతాలు, దట్టమైన పట్టుకుచ్చులాంటి అకు పచ్చని లోయలు, పంటకు వచ్చిన పండ్ల తోటలు మరియు అందమైన ద్రాక్ష తోటలు ఈ ప్రాంతం యొక్క ప్రకృతి సౌందర్యానికే వన్నె తెచ్చాయి. వీటితోపాటు ఇక్కడ చాలా నదులు ఉన్నాయి మరియు వివిధ జాతులకు చెందిన వృక్షజాలం మరియు జంతుజాలం కూడా ఉన్నాయి. కిన్నార్ కి చెందిన సంస్కృతికి మిగత రాష్ట్ర సంస్కృతికి తేడా గమనించవొచ్చు అదేమిటంటే కిన్నౌర్ సంస్కృతికి టిబెటన్ సంస్కృతికి లోతైన సామీప్యత ఉన్నది.

కిన్నౌర్ ప్రాంతంలో సంగల లోయ మరియు హన్గ్రంగ్ లోయ అనే ముఖ్యమైన లోయలు ఉన్నాయి. సంగల లోయ అందమైన పండ్ల తోటలకు ప్రసిద్ధి కలిగి ఉంటే, హన్గ్రంగ్ లోయ ఆకుపచ్చని పచ్చిక బయళ్ళకు ప్రసిద్ధి చెందింది. ప్రయాణికులు ఇక్కడ బ్రహ్మాండమైన కిన్నెర్ కైలాష్ పర్వతాన్ని కూడా చూడవొచ్చు. ఇది ఈ ప్రాంతానికే ప్రముఖ ఆకర్షణ. ఇవే కాకుండా, ఇక్కడ 'కల్ప' అనే సహజమైన అందంతో ఉన్న గ్రామాన్ని కూడా చూడవొచ్చు.

కిన్నౌర్ లో కల రూపి-భాబా అభయారణ్యం సముద్ర మట్టానికి 909 మీ. నుండి 5650 మీ.ఎత్తున ఉన్నది.  మరియు కిన్నౌర్ లో ఉన్న రాంపూర్ బుశాహ్ర్ నుండి 40 కి. మీ. దూరంలో ఉన్నది. ఈ అభయారణ్యం తూర్పున ఉన్న గ్రేట్ హిమాలయన్ పార్క్స్ ను మరియు ఉత్తరాన ఉన్న పిన్ వాలి నేషనల్ పార్క్ ను రక్షిస్తుంది. ఈ అభయారణ్యాన్నివరుసగా 28 తేది, 1982 మరియు 30వ తేది, 1982న గుర్తించారు. సాట్లుజ్ నది ఒడ్డున ఉన్న ఈ అభయారణ్యం అనేక జాతుల వృక్ష, జంతు జాలానికి పుట్టినిల్లు వంటిది. ఇక్కడ సెరో, నీలిరంగు గొర్రెలు, ఎర్ర నక్క, కస్తూరి జింక, గోరల్, ఐబెక్స్ చిరుత, మంచు చిరుత, బ్రౌన్ ఎలుగుబంటి, హిమాలయాల నల్ల ఎలుగుబంటి వంటి జంతువులు కనిపిస్తాయి. ఇక్కడ వృక్షాలు సమశీతోష్ణ పరిస్థితులలో కూడా శంఖాకారంలో ఉంటాయి.ఇంకా ఖర్సు ఓక్, ఆల్పైన్ పచ్చిక మరియు విస్తృతమైన ఆకులు శంఖాకారంగా ఉన్నాయి.

 కిన్నౌర్ కి సమీపంలో విమానాశ్రయం ఉన్న'షిమ్లా' నగరం ఉన్నది. ఇది 'కల్ప' నగరానికి సుమారు 249 కి. మీ. దూరంలో ఉన్నది. షిమ్లా విమానాశ్రయం ఇండియాలో ఉన్న ముఖ్యమైన నగరాలు, న్యూ డిల్లీ మరియు చండీగర్లకు అనుసంధించబడింది. కిన్నౌర్ కి దగ్గరగా ఉన్న షిమ్లా రైల్వే స్టేషన్ నగరానికి 230 కి. మీ. దూరంలో ఉన్నది. రాంపూర్ మరియు షిమ్లా నుండి కిన్నౌర్ కు రోజూ క్రమంగా బస్సులు అందుబాటులో ఉన్నాయి.

కిన్నౌర్ లో సంవత్సరమంతా సమశీతోష్ణమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడ జూన్ నుండి సెప్టెంబర్ నెలల మధ్య వేసవి కాలం ఉంటుంది. ఇక్కడ శీతాకాలం అక్టోబర్ లో ప్రారంభమై మే వరకు ఉంటుంది. ఈ కాలంలో చలి విపరీతంగా ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు జీరో లెవెల్ కన్నా తక్కువకు పడిపోతుంది. కిన్నౌర్ ను సందర్శించే యాత్రికులు మంచి వూలు దుస్తులను కూడా వెంట తెచ్చుకోవటం మంచిది.

కిన్నౌర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కిన్నౌర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కిన్నౌర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కిన్నౌర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్ ద్వారా: ప్రయాణికులకు కిన్నౌర్ చేరుకోవటానికి దగ్గరలో ఉన్న షిమ్ల మరియు రాంపూర్ ల నుండి బస్సులు అందుబాటులో ఉన్నాయి. బస్సు మరియు టాక్సీలు అందుబాటు ధరలలోనే ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైల్ ద్వారా: కిన్నౌర్ కి 230 కి. మీ. దూరంలో షిమ్ల రైల్వే స్టేషన్ ఉన్నది. ఇది ముఖ్యమైన రైల్వే స్టేషన్ మరియు ఇది ఇండియన్ ముఖ్య నగరాలైన న్యూ డిల్లీ మరియు ముంబైలకు జత చేయబడి ఉంది. కిన్నౌర్ చేరుకోవటానికి ప్రయాణికులు రైల్వే స్టేషన్ బయట టాక్సీలు మరియు కాబ్స్ అద్దెకు తీసుకోవొచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    ప్రయాణికులు విమానం, రైల్, బస్సుల ద్వారా సులభంగా కిన్నౌర్ ప్రాంతాన్ని చేరుకోవొచ్చు. విమానం ద్వారా: కిన్నౌర్ కి దగ్గరగా 'షిమ్ల విమానాశ్రయం' ఉన్నది. ఇది కిన్నౌర్ జిల్లాలో ఉన్న ప్రముఖ గ్రామం, 'కల్ప' నుండి 249 కి. మీ. దూరంలో ఉంది. షిమ్ల విమాన కేంద్రం నేరుగా ఇండియా ముఖ్య నగరాలైన 'డిల్లీ' మరియు 'కుల్లు' లకు అనుసంధించబడింది. విదేశీ ప్రయాణికులు డిల్లీ నుండి ఇక్కడకు జత చేయబడిన విమానాలలో రావొచ్చు. విమానాశ్రయం నుండి టాక్సీలు మరియు కబ్స్ ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed