రోహ్రు - ఆపిల్ తోటలకు ప్రసిద్ధి !

రోహ్రు ప్రదేశం సముద్ర మట్టానికి సుమారు 1525 మీటర్ల ఎత్తున పబ్బార్ నది తీరం లో కలదు. ఇది హిమాచల్ ప్రదేశం లోని సిమ్లా జిల్లాలో ఒక మున్సిపాలిటీ. రోహ్రు లో ఆపిల్ తోటలు ప్రసిద్ధి ఈ ప్రదేశం త్రోట్ ఫిషింగ్ కు కూడా ప్రసిద్ధి. ఈ నగరం రాజ బజరంగ్ భాహదూర్ సింగ్ స్థాపించబడి, అభివృద్ధి చేయబడినది. ఆయనకు చేపలవేట అంటే ఆసక్తి అవటంతో ఈనాగారాన్ని ఒక చక్కని ఫిషింగ్ జోన్ గా మార్చాడు . సాహస క్రీడాకారులు ఇక్కడ ట్రెక్కింగ్ పారా గ్లైడింగ్ మరియు హాంగ్ గ్లైడింగ్ లను కూడా అచ్చరిస్తారు

రోహ్రు వచ్చే పర్యాటకులు, శిక్రు దేవత టెంపుల్ చిర్గాఒన్, దోడరా, చంశాల్ పర్వత శ్రేణి మొదలైనవి చూడవచ్చు ఇవే కాక పబ్బార్ నది ఒడ్డున కల హత్కోటి అనే ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ కూడా చూడవచ్చు. ఈ ప్రదేశం లో మూడు నదులు కలుస్తాయి. దీనినే సంగం అంటారు హిందువులకు ఇది పవిత్ర ప్రదేశం హత్కొఇ సంగమ ప్రదేశం లో హిందూ దేవతలైన శివ పార్వతులు వివాదం చేసుకున్నారని చెపుతారు

రోహ్రు ప్రదేశాన్ని వాయు, రైలు, లేదా రోడ్ మార్గం లో చేరవచ్చు రోహ్రు కు సిమ్లా లోని జుబ్బార్ హత్తి ఎయిర్ పోర్ట్ సమీపం. న్యూ ఢిల్లీ నుండి సిమ్లాకు అనేక విమానాలు కలవు 443 కి. మీ. ల దూరంలో కల ఢిల్లీ విమానాశ్రయం నుండి విదేశీయులు కూడా ఈ ప్రాంతానికి చేరవచ్చు.

ట్రైన్ ప్రయాణం చేయాలనుకునే వారికి 165 కి. మీ.ల దూరంలోకల కలకా రైలు స్టేషన్ సమీపం. రైలు స్టేషన్ నుండి రోహ్రు కు టాక్సీలు కాబ్లు దొరుకుతాయి. రోడ్డు ప్రయాణం కోరే వారికి సిమ్లా నుండి బస్సు లు దొరుకుతాయి.

రోహ్రు లో వాతావరణం సంవత్సరం పొడవునా వింటర్ లు తప్ప ఒక మోస్తరు గా వుంటుంది. వింటర్ లో ఉష్ణోగ్రత జీరో స్థాయి కంటే తక్కువగా కూడా పడిపోతుంది. చాలా చలిగా వుండి 10 డిగ్రీ లు నుండి మైనస్ 7 డిగ్రీల వరకు వుంటుంది. కనుక ఈ సమయంలో వచ్చే పర్యాటకులు తమ ఉన్ని దుస్తులు తప్పక తెచ్చుకోవాలి. ఈ ప్రదేశం సందర్శనకు మార్చ్ నుండి నవంబర్ వరకూ అనుకూలం

Please Wait while comments are loading...