హత్కోటి సిమ్లా నుండి 105 కి. మీ.ల దూరంలో పబ్బార్ రివర్ ఒడ్డున కల ఒక అందమైన గ్రామం. ఇది సముద్ర మట్టానికి 1100 మీటర్ల ఎత్తున కలదు. ఇక్కడ రెండు పర్వత వాగులు, అంటే బీష్ కులతి మరియు రాన్ వీటి అనే పేర్లు కలవి పబ్బార్ నది లో హత్కోటి వద్ద కలసి పోతాయి. ఇక్కడి నది లోని నీటి రంగు బూడిద వర్ణం కలిగి వుంటుంది. ఇతిహాసం మేరకు ఈ నది విషాన్ని వెదజల్లుతుందని చెపుతారు. మూడు నదుల సంగం ప్రదేశం లో వుండటం చేత హిందూ యాత్రికులు దీనిని పవిత్రంగా భావిస్తారు. హిందూ పురాణాల మేరకు, ఈ ప్రదేశం మతపరంగా ప్రాధాన్యత కలది. ఇక్కడ శివుడు పార్వతి వివాదాలు చేసుకున్నారని చెపుతారు.
పర్యాటకులు ఇక్కడ అందమైన టెంపుల్స్ కొయ్య తలుపులు కలవి, రాతి గోడలు పురాతన యుగాల నాటివి చూస్తారు. ఈ టెంపుల్స్ కారణంగా హత్కోటి కి 'వాలీ ఆఫ్ స్టోన్ టెంపుల్స్' అనే పేరు వచ్చింది. హత్కోటి సందర్శకులకు, ట్రెక్కింగ్, మౌన్టేనీరింగ్ మరియు రాఫ్టింగ్ లు సాధారణం.