Search
  • Follow NativePlanet
Share

సలోగ్ర - పచ్చని పైన్ మరియు దేవదారు అడవుల అందాలు !

4

సలోగ్ర, హిమాచల్ ప్రదేశ్ లో సిమ్లా జిల్లాలోని సోలన్ నుండి 5.3 కి.మీ.ల దూరంలో నెలకొని ఉన్న ఒక ప్రముఖ పర్యాటక కేంద్రం. తోప్-కి-బేర్, మహి, మూల మరియు మాషీవార్ వంటి ఎన్నో సుందరమైన గ్రామాలు ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్నాయి. కాందఘాట్, సోలన్, ధర్మపూర్ మరియు కునిహార్ ఇతర సమీప పట్టణాలు.

క్రోల్ కా తిబ్బా, అని పిలవబడే సుందర దృశ్యాలు గల ఒక అందమైన పర్వతం, సలోగ్ర వద్ద ఉన్న ముఖ్యమైన పర్యాటక కేంద్రం. పచ్చని పైన్ మరియు దేవదారు అడవులతో చుట్టబడిన సలోగ్ర, సందర్శకులకి అత్యంత సహజ ప్రాకృతిక సౌందర్యం ఆస్వాదించడానికి అవకాశం అందిస్తుంది. సలోగ్ర యొక్క మంచుతో కూడిన వాలు ప్రదేశాలలో ట్రెక్కింగ్ ఒక అదనపు ఆకర్షణ. బారోగ్ వద్ద 1 కి.మీ దూరంలో ఉన్న, దుష్టశక్తులను నాశనం చేసేవాడిగా పరిగణించబడే హిందూ దైవం శివునికి అంకితం చేయబడిన, ప్రసిద్ధ ఆలయం అనేక మంది సందర్శకులను ఇక్కడికి ఆకర్షిస్తుంది.

సలోగ్రకు ప్రయాణించేవారు ఇక్కడికి కేవలం 41 కి.మీ ల దూరంలో ఉన్న, అనేక పర్యాటక ఆకర్షణలు గల సిమ్లాకు కూడా వెళ్ళవచ్చు. ఈ ప్రదేశం, రాష్ట్రం లోని ఇతర పర్యాటక ప్రాంతాలకు అనుసంధానించబడిన కల్కా రైల్వే స్టేషన్ తో కలపబడి ఉంది.

సలోగ్ర విమాన మార్గం, రైలు మార్గం మరియు రహదారులు వంటి ప్రధాన రవాణా మార్గాల ద్వారా చేరుకోవచ్చు. ఈ ప్రాంతం, ఏప్రిల్ నెల నుంచి జూన్ నెల వరకు సందర్శనకు అనువుగా ఉంటుంది. అయితే, శీతాకాలంలో ప్రతి ఏటా భారీ హిమపాతం ఉన్నప్పటికీ సలోగ్రలో ట్రెక్కింగ్ కు వాతావరణ పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయి కాబట్టి, ఆ సమయంలో కూడా విహారయాత్రకు రావచ్చు.

సలోగ్ర ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

సలోగ్ర వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం సలోగ్ర

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? సలోగ్ర

  • రోడ్డు ప్రయాణం
    రహదారి: సలోగ్రలో పర్యటించే ఆసక్తిగల యాత్రికులు బస్సులులో కూడా గమ్యం చేరుకోవచ్చు. జాతీయ రహదారి 22 పై ఉన్న సలోగ్ర ను చేరుకోవడానికి, ప్రైవేటు బస్సులు మరియు ప్రభుత్వ యాజమాన్యంలోని బస్సులు ఢిల్లీ మరియు చండీఘర్ నుండి అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని బస్సులు తక్కువ వ్యయంలో అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రైవేటు యాజమాన్యంలో బస్సులో, చండీగఢ్, సలోగ్ర ల మధ్య ప్రయాణానికి 200 రూపాయలు ఖర్చు అవుతుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం: కాల్కా మరియు సిమ్లా రైల్వే స్టేషన్లు, సలోగ్ర కి సమీపంలోని రైల్వే స్టేషన్లు. ప్రయాణికులు, కాల్కా మరియు సిమ్లా నుండి, హిమాలయ క్వీన్ ఎక్ష్ప్రెస్, కాల్కా సిమ్లా పాస్ మరియు కాల్కా సిమ్లా ఎక్ష్ప్రెస్ అనే మూడు రైళ్ళలో సలోగ్ర చేరుకోవచ్చు. రైలు రెండవ తరగతి ప్రయాణానికి 36 రూపాయలు, మొదటి తరగతి ప్రయాణానికి 228 రూపాయలు ఖర్చు అవుతుంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన యానం: సలోగ్ర నుండి దగ్గరగా ఉన్న విమానాశ్రయం, చండీగఢ్ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం ఢిల్లీ, ముంబై, జైపూర్ మరియు శ్రీనగర్ వంటి ప్రధాన నగరాలతో అనుసంధానించబడి ఉంది. విమానాశ్రయం నుండి సలోగ్ర చేరటానికి, టాక్సీ మరియు క్యాబ్ సేవలు సుమారు 1000 రూపాయల వ్యయంలో అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Sep,Wed
Return On
10 Sep,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Sep,Wed
Check Out
10 Sep,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Sep,Wed
Return On
10 Sep,Thu