Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కోట్ ఖాయి

కోట్ ఖాయి - సహజ సౌందర్యము

9

కోట్ ఖాయి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లో 1800 మీటర్ల ఎత్తులో సిమ్లా జిల్లాలో ఉన్న ఒక చిన్న పట్టణం. పర్వత శిఖరం మీద ఉన్న ఒక రాజ భవనానికి చెందిన ఒక రాజు గారి పేరు మీద ఈ పట్టణానికి కోట్ ఖాయీ అన్న పేరు వచ్చింది. కోట్ అనగా కోట అని ఖాయి అనగా శిఖరం అనీ అర్ధం. ఈ ప్రదేశానికి ఉన్న సహజ సౌందర్యము, చుట్టూ ఉన్న ప్రశాంత వాతావరణం వల్ల సుదూర ప్రాంతాల నుండీ కూడా పర్యాటకులు ఇక్కడకి వస్తుంటారు.

23 వేల హెక్టార్లలో విస్తరించి ఉన్న యాపిల్ వ్రుక్ష సముదాయాలకి కోట్ ఖాయి ప్రసిద్ధి. ఈ యాపిల్ తోటల యజమానుల నుండి ముందస్తు అనుమతి తీసుకున్న పర్యాటకులు ఈ తోటలని కూడా సందర్శించవచ్చు.

కోట్ ఖాయి లో ఉద్యాన వనాలకి సంబధించిన కార్యకలాపాలు ఎక్కువ."గిరి" నది ఈ పట్టణానికి దగ్గరలో ప్రవహిస్తుంటుంది. అందువల్ల ఇక్కడి నేల బాగా సారావంతమైనది.

రాజా రాణా సాబ్ నిర్మించిన కోట్ ఖాయి రాజ భవనం ఇక్కడ ప్రసిద్ధి చెందిన దర్శనీయ స్థలము. గోపురాన్ని పోలి ఉన్న పైకప్పు కలిగి ఉన్న ఈ రాజ భవనం టిబెట్ తరహా వాస్తు నిర్మాణానికి ఒక ఉదాహరణ. కోట్ ఖాయి ప్రాంతంలో చాలా ఆలయాలున్నాయి. వాటిలో మహమయి గుడి,లంక్ర వీర్ గుడి ప్రసిద్ధి చెందాయి.

ఈ ఆలయాలే కాకుండా సందర్శకులు ఇతర ప్రాంతాలైన "నెర ఘాటి","కియాలా ఫారెస్ట్","ధిలాన్ తాటాకాలని" కూడా సందర్శించవచ్చు.

సందర్శకులు కోట్ ఖాయి ని రైలు,రోడ్డు,వాయు మార్గాలన్నింటి ద్వారా సులువుగా చేరుకోవచ్చు. సిమ్లా విమానాశ్రయం ఇక్కడకి అతి దగ్గరలో ఉన్న విమానాశ్రయం.సిమ్లా భారత దేశ ఇతర ముఖ్య నగరాలైన ఢిల్లీ,కులూ మొదలైన వాటితో అనుసంధానించబడింది.

న్యూ ఢిల్లీ నుండి విదేశీ యాత్రికులు సిమ్లా కి డైరెక్టు విమానం ద్వారా చేరుకోవచ్చు.

సిమ్లా లోనే గల రైల్వే స్టేషను కోట్ ఖాయి కి దగ్గర లో గల రైల్వే స్టేషను. సిమ్లా స్టేషను బయట కోట్ ఖాయి కి ట్యాక్సీలు కూడా దొరుకుతాయి. రోడ్దు మార్గం ద్వారా కోట్ ఖాయి చేరుకోవాలనుకుంటే దగ్గర లో ఉన్న పట్టణాల నుండి కోట్ ఖాయి కి బస్సులు,ట్యాక్సీలు ,క్యాబ్ లు దొరుకుతాయి.

కోట్ ఖాయిలో వాతావరణం సంవత్సరం పొడుగునా ఆహ్లాదంగా ఉంటుంది.ఈ ప్రాంతంలో ఏప్రిల్ లో మొదలైన వేసవి జూన్ వరకూ కొనసాగుతుంది. వేసవి లో ఇక్కడ నమోదైన గరిష్ట కనిష్ట ఉష్ణొగ్రతలు 28 డిగ్రీలు మరియు 15 డిగ్రీలు.ఇక్కడ శీతాకాలం నవంబరు-ఫిబ్రవరి మధ్య కాలంలో ఉంటుంది. ఈ కాలంలో ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీల నుండీ 15 డిగ్రీల వరకూ ఉంటుంది.

కోట్ ఖాయి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కోట్ ఖాయి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కోట్ ఖాయి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కోట్ ఖాయి

  • రోడ్డు ప్రయాణం
    సిమ్లా నుండి కోట్ ఖాయి కి నేరు బస్సు లు కలవు. టాక్సీ ల లో కూడా చేరవచ్చు
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం: సిమ్లా లోనే గల రైల్వే స్టేషను కోట్ ఖాయి కి దగ్గరలో గల రైల్వే స్టేషను. సిమ్లా "కల్కా" స్టేషను కి అనుసంధానించబడినది. సందర్శకులు సిమ్లా స్టేషను బయట దొరికే ట్యాక్సీలు,క్యాబ్ లని ఉపయోగించి కోట్ ఖాయి చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం: సిమ్లా విమానాశ్రయం ఇక్కడకి అతి దగ్గరలో ఉన్న విమానాశ్రయం. సిమ్లా భారత దేశ ఇతర ముఖ్య నగరాలైన ఢిల్లీ,కులూ మొదలైన వాటితో అనుసంధానించబడింది. న్యూ ఢిల్లీ నుండి విదేశీ యాత్రికులు సిమ్లా కి డైరెక్టు విమానం ద్వారా చేరుకోవచ్చు. సిమ్లా విమానాశ్రయం బయట దొరికే ట్యాక్సీలు కూడా యాత్రికులని కోట్ ఖాయి చేరుస్తాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Jul,Thu
Check Out
31 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri