Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కోట్ ఖాయి » వాతావరణం

కోట్ ఖాయి వాతావరణం

కోట్ ఖాయి సందర్శకులు రుతుపవన కాలం తప్పించి మిగతా అన్ని రోజులలో ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు

వేసవి

కోట్ ఖాయి లో వాతావరణం సంవత్సరం పొడుగునా ఆహ్లాదంగా ఉంటుంది. వేసవిలో కూడా వాతావరణం ఇక్కడ ఆహ్లాదంగానే ఉంటుంది. వర్షాకాలం లో యాపిల్ పళ్ళని రవాణ చేసే ట్రక్కులు ఇతర వాహనాలు ఎక్కువగా తిరుగుతుండటం వల్ల ఈ కాలం కోట్ ఖాయి సందర్శనకి అంత అనువైనది కాదు.వసంత రుతువు: మార్చ్ లో ఇక్కడ వసంత రుతువు మొదలవుతుంది.ఈ కాలం లో ఇక్కడి ఉష్ణొగ్రత 10-20 డిగ్రీల మధ్య ఉంటుంది.వేసవి కాలం:ఈ ప్రాంతం లో ఏప్రిల్ లో మొదలైన వేసవి జూన్ వరకూ కొనసాగుతుంది.వేసవి లో ఇక్కడ నమోదైన గరిష్ట కనిష్ట ఉష్ణొగ్రతలు 28 డిగ్రీలు మరియు 15 డిగ్రీలు.ఇక్కడ నమోదయ్యే ఉష్ణొగ్రతల్లో అధిక ఉష్ణొగ్రత మే నెల లో నమోదవుతుంది. వేసవి లో ఉండే ఆహ్లాద వాతావరణం వల్ల సందర్శకులు ఈ కాలంలో కోట్ ఖాయి ని సందర్శించటానికి ఆసక్తి చూపిస్తారు.

వర్షాకాలం

రుతు పవన కాలం:జూలై లో మొదలయ్యే రుతుపవన కాలం సెప్టెంబరు వరకూ కొనసాగుతుంది. పగటి పూట తేమ శాతం ఎక్కువ గాఉండి రాత్రి ఉష్ణొగ్రతలు బాగా పడిపోతాయి. అందువల్ల రాత్రి బాగా చల్ల గా ఉంటుంది. నైరుతి రుతు పవనాల వల్ల ఇక్కడ వర్షపాతం నమోదవుతుంది.

చలికాలం

శీతాకాలం:ఇక్కడ శీతాకాలం నవంబరు-ఫిబ్రవరి మధ్య కాలం లో ఉంటుంది.ఈ కాలంలో ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీ ల నుండీ 15 డిగ్రీల వరకూ ఉంటుంది.