నగ్గర్ - ప్రకృతి ఆకర్షణలు !

హిమాచల్ ప్రదేశ్ లో కులు వాలీ లోని నగ్గర్ ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. చారిత్రాత్మకంగా నగ్గర్ ఒక పురాతన పట్టణం. అందమైన దృశ్యాలతో కుళ్ళు కు ప్రత్యేకించి నార్త్ వెస్ట్ వాలీ ప్రాంతానికి ఇది ఒక రాజధానిగా వ్యహరిస్తోంది. ఈ ప్రదేశాన్ని రాజు విసుధ పాల్ కనుగొన్నారు. దాని తర్వాత రాజు జగత్ సింగ్ దానిని సుల్తాన్ పూర్ కు బదిలీ చేసేవరకు, అంటే సుమారు క్రి శ 1460 వరకు రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ గా వున్నది

నగ్గర్ లో అనేక ప్రకృతి ఆకర్షణలు కలవు. వాటిలో జగతి పాట్ మరియు నగ్గర్ కేజల్ ప్రసిద్ధి. సుమారు 500 సంవత్సరాల కిందట నిర్మించిన కేజల్ తర్వాత కాలం లో ఒక హెరిటేజ్ హోటల్ గా మార్చారు అందమైన బీయాస్ నది ఇక్కడే కలదు. ఇక్కడే, నికోలస్ రోరిచ్ ఆర్ట్ గేలరీ కలదు. దీనిలో రష్యన్ చిత్రకారుడు నికోలస్ రోరిచ్ మరియు అతని కుమారుడు గీసిన చిత్రాలు కలవు. నగ్గర్ పర్యాటకులు వీటిని తప్పక చూడాలి.

టూరిస్టులు ఇక్కడ కల దాగ్పో శేద్రుప్లింగ్ అరామాన్ని కూడా తప్పక చూడాలి. ఇది రివర్ బయాస్ కు ఎడమ ఒడ్డున కలదు. దీనిని ఆధ్యాత్మిక పర్యాటకులకు నగ్గర్ టవున్ అనేక దేవాలయాలు కూడా అందిస్తుంది. వాటిలో త్రిపుర సుందరి టెంపుల్ చాముండా భగవతి టెంపుల్ , మురళీధర్ టెంపుల్ మొదలైనవి చక్కని శిల్ప శైలి కలిగి అనేక పండుగలు చేస్తాయి.

నగ్గర్ ఫిషింగ్ ట్రెక్కింగ్ , రివర్ రాఫ్టింగ్ చేసే సాహసికులకు ప్రసిద్ధ ప్రదేశం. ఫిషింగ్ ఆసక్తి కలవారు బియాస్ నది లోను, ట్రెక్కింగ్ చేయాలనుకునేవారు చందేర్ఖాని పాస్ జలోరి పాస్, పిన్ పార్వతి పాస్ వంటి హిమాలయ ప్రదేశాలలో చేయవచ్చు.

నగ్గర్ పర్యటన చేయాలనుకునేవారు రోడ్డు, రైలు, విమాన మార్గాలలో ఈ ప్రాంతం చేరవచ్చు. నగ్గర్ పర్యటనకు వేసవి అనుకూలం ఏప్రిల్ నుండి జూలై వరకు అనుకూలంగా వుంటుంది. మరల వింటర్ సమయంలోకల చల్లని వాతావరణం ఆహ్లాదంగా వుంది పర్యటన మరచిపోలేని అనుభవాన్ని ఇస్తుంది.

Please Wait while comments are loading...