డల్హౌసీ - వేసవి విడిది ! 

డల్హౌసీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ధవళధర్ శ్రేణిలో ఉన్న ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశం. 1854 లో వేసవి విడిది గా స్థాపించబడిన ఈ పట్టణం, దీనిని అభివృద్ధి చేసిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ పేరు మీదుగా పిలవబడుతుంది. చంబల్ జిల్లా ప్రవేశ మార్గంగా ప్రసిద్ధి చెందిన డల్హౌసీ, కత్లోగ్, పోర్ట్ రేన్, తెహ్ర, బక్రోట మరియు బాలున్ అనే ఐదు కొండలపై నిర్మించారు. ఇది 13 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నది. ధవళధర్ శ్రేణిని బ్రిటిష్ వారు స్థిర నివాసం కోసం ఎంపిక చేశారు. ఆ సమయంలో, బ్రిటిష్ సామ్రాజ్యం సైన్యాధికారి లార్డ్ నాపియర్, చంబా లోని తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స కోసం పర్వతశ్రేణి వాలులో ఒక ఆసుపత్రి ఏర్పాటును కూడా ప్రతిపాదించారు. ఈ ప్రాంతంలో ఎన్నో ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.

డల్హౌసీ లోని ఎక్కువగా సందర్శించబడే చర్చ్ లలో కొన్ని బాలున్ దగ్గరి సెయింట్ ఆండ్రూ చర్చి మరియు సెయింట్ పాట్రిక్ చర్చి, సుభాష్ చౌక్ దగ్గరి సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి మరియు గాంధీ చౌక్ దగ్గరి సెయింట్ జాన్ చర్చి. జంద్రిఘాట్ వద్ద ఉన్న చంబా పాలకుల రాజభవనము యొక్క నిర్మాణ సమర్థత అనేక మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. పంచపుల మరియు సుభాష్ బోలి ప్రదేశాలు, అజిత్ సింగ్, సుభాష్ చంద్ర బోస్ వంటి భారత స్వాతంత్ర్య సమరయోధులతో ముడిపడి ఉన్నందువల్ల ప్రసిద్ధ పర్యాటక స్థలాలు గా పరిగణించబడుతున్నాయి. యాత్రికులు కేవలం ఈ ప్రాంతపు అత్యద్భుతమైన అందాన్ని ఆస్వాదించడం మాత్రమే కాదు, ఇక్కడి సాహస క్రీడలలో కూడా పాల్గొనవచ్చు. త్రియంద్, ధర్మశాల, దైన్కుండ్,ఖజ్జియర్,చంబా, పాలంపూర్, బైజ్ నాథ్, బీర్ మరియు బిల్లింగ్, ఈ ప్రాంతంలోని ఇతర ప్రముఖ ప్రదేశాలు.

చోబియా కనుమ , గాంధీ చౌక్, భర్మౌర్, చంబా హెచ్.పి, గరం సడక్, అలా నీటి ట్యాంక్, గంజి పహారీ మరియు బజ్రేశ్వరి దేవి ఆలయం, డల్హౌసీ సమీపంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు. 1908 సంవత్సరంలో నిర్మించబడిన భూరి సింగ్ మ్యూజియం, ఈ ప్రదేశంలోని మరొక ప్రసిద్ధ ఆకర్షణ. కళా ప్రేమికులు, రాజా భూరి మ్యూజియం కి దానం చేసిన అందమైన చిత్రాలు చూడవచ్చు. చంబా కి సంబంధించిన చారిత్రక సమాచారం అంతా కలిగి ఉన్న సర్దా లిపి లో ఉన్న అమూల్యమైన శిలాముద్రలను కూడా చూడవచ్చు. ఇది కాక, రాజా ఉమేద్ సింగ్ నిర్మించిన రంగ్ మహల్, మొఘల్ మరియు బ్రిటీష్ తరహా నిర్మాణ శైలికి పేరు గాంచింది. శ్రీ కృష్ణుని జీవితాన్ని వివరించే మ్యూజియం లోని పంజాబి శైలి కుడ్యచిత్రాలు ఇక్కడి ప్రధాన ఆకర్షణ.ఇంకా, పర్యాటకులు, మ్యూజియం ఆవరణ లోనే ఉన్న హిమాచల్ ఎంపోరియం లో చేనేత రుమాళ్ళు లేదా చేతి రుమాళ్ళు, చెక్క మగ్గం తో చేసిన శాలువాలు మరియు చెప్పులు కొనుగోలు చేయవచ్చు.

డల్హౌసీ యొక్క వాతావరణం సంవత్సరం పొడవునా ఆహ్లాదంగా ఉంటుంది. ఇక్కడ వేసవి మార్చి మరియు మే నెలల మధ్య విస్తరించి ఉంటుంది. ఉష్ణోగ్రతలు 15.5 మరియు 25.5 మధ్య ఉంటాయి. చాలా మంది ప్రయాణికులు చక్కటి వాతావరణం మరియు అత్యద్భుతమైన అందం ఆస్వాదించడానికి ఈ సమయంలోనే వస్తారు. డల్హౌసీ పర్వతాల చే చుట్టబడి, వర్షాకాలంలో అద్భుతంగా కనిపిస్తుంది. జూన్ నెలలో లో ప్రారంభామయ్యే వర్షాకాలం సెప్టెంబర్ లో ముగుస్తుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల మరియు 1 డిగ్రీ పరిధిలో ఉంటాయి. డల్హౌసీ, సముద్ర మట్టానికి 2700 మీటర్ల ఎత్తులో ఉండటం వల్ల, ఈ కాలంలో భారీ హిమపాతం అనుభవిస్తుంది.

డల్హౌసీ, భారత రాజధాని ఢిల్లీ నుండి 563 కి.మీ. ల దూరంలో, అమృతసర్ నుండి 191 కి.మీ ల దూరంలో , చంబా నుండి 43 కి.మీ ల దూరంలో మరియు చండీఘర్ నుండి 315 కి.మీ. ల దూరంలో ఉంది. డల్హౌసీ సమీపంలోని విమానాశ్రయం, 80 కి.మీ. ల దూరం లో ఉన్న పఠాన్ కోట్ విమానాశ్రయం. ఇది కేవలం కొత్త ఢిల్లీ విమానాశ్రయం తో మాత్రమే అనుసంధానించబడి ఉంది. డల్హౌసీ నుండి 180 కి.మీ. ల దూరంలో ఉన్న జమ్ము విమానాశ్రయం, అన్ని ప్రధాన నగరాల విమానాశ్రయాలకు అందుబాటులో ఉంది. రైలు ద్వారా ప్రయాణించే పర్యాటకులకు, 80 కి.మీ.ల దూరంలో ఉన్న పఠాన్ కోట్ రైల్వే స్టేషన్, సమీపంలోని రైల్వే స్టేషన్. ఇది ఢిల్లీ, ముంబై మరియు అమృత్సర్ తో సహా భారతదేశం యొక్క అన్ని ప్రధాన నగరాలతో అనుసంధానించబడి ఉంది. రోడ్డు ద్వారా డల్హౌసీ చేరగోరే పర్యాటకులు, సమీపంలోని పట్టణాలు మరియు నగరాల నుండి బస్సుల లో రావచ్చు. డల్హౌసీకి 560 కి.మీ. ల దూరంలో ఉన్న ఢిల్లీ నుంచి తరచూ బస్సులు అందుబాటులో ఉన్నాయి.

Please Wait while comments are loading...