గాంధీ చౌక్, డల్హౌసీ లోని ప్రముఖ షాపింగ్ ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దీన్ని జి.పి.ఓ అని కూడా పిలుస్తారు. అనేక బిస్ట్రోలు మరియు దుకాణాలతో నిండిన పెద్ద షాపింగ్ ప్రాంతం ఇక్కడ ఉంది. సమీపంలోనే ఉన్న ఒక టిబెట్ అంగడి కూడా అనేక మందిని ఆకర్షిస్తుంది. యాత్రికులు ఈ అంగడి నుండి వివిధ రకాల ఎలక్ట్రానిక్ ఉపకరణాలు లేదా హస్తకళ వస్తువులను కొనుగోలు చేయవచ్చు.
ఈ ప్రదేశం 15 నిమిషాల దూరంలో ఉన్న కేంద్ర బస్సు స్టేషన్ నుండి బస్సుల ద్వారా చేరుకోవచ్చు. ఇక్కడ యాత్రికులు, నిపుణులైన టిబెటన్లు చేసిన వివిధ రకాల ఆభరణాలు, జాకెట్లు, హస్తకళాకృతులు, రగ్గులు, కార్డిగాన్లు మరియు తివాచీలు కొనవచ్చు.