భూరి సింగ్ మ్యూజియం, డల్హౌసీ

హోమ్ » ప్రదేశములు » డల్హౌసీ » ఆకర్షణలు » భూరి సింగ్ మ్యూజియం

భూరి సింగ్ మ్యూజియం, 1908 సంవత్సరం లో, ఆ కాలంలో చంబాని పాలించిన రాజా భూరి గౌరవార్ధం నిర్మించారు. రాజు, తన కుటుంబానికి చెందిన విలువైన చిత్రాలు మ్యూజియం కి అందజేశారు. చిత్రాల మాత్రమే కాకుండా, చంబా యొక్క కీలక చారిత్రక సమాచారం కలిగిన సర్దా లిపి లో ఉన్న శిలాముద్రలు కూడా మ్యూజియం లో ఉన్నాయి.

మ్యూజియం లో ప్రదర్శన కోసం ఉంచిన తరవారి, కళ మరియు సంస్కృతి పట్ల చంబా పాలకులకు కల ప్రేమను చూపిస్తాయి. ఇక్కడ ఉంచబడిన గులేర్-కాంగ్రా శైలి చిత్రాల అందమైన సేకరణ, మ్యూజియం యొక్క ఆకర్షణ పెంచడానికి దోహదపడుతుంది. యాత్రికులు భగవత్ పురాణం మరియు రామాయణ శైలులు విశదపరిచే బసోలి చిత్రాలు కూడా తప్పక చూడాలి. ఈ స్థలం యొక్క ఇతర ఆకర్షణలలో,అందంగా బుటాలు వేసిన చంబా-రుమాళ్ళు లేదా చేతిరుమాళ్ళు ఉన్నాయి. అదనంగా, పర్యాటకులు, మ్యూజియం లో ప్రదర్శించబడున్న కవచాలు, ఆయుధాలు, నాణేలు, పర్వత ఆభరణాలు, వస్త్రాలు, విభిన్న అలంకార కళాఖండాలు మరియు సంగీత సాధనాలు చూడగలరు. మ్యూజియం సెలవు దినాలు మరియు సోమవారాలు ఉదయం 10 మరియు సాయంత్రం 5 గంటల మధ్య సందర్శించవచ్చు.

Please Wait while comments are loading...