Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » డల్హౌసీ » వాతావరణం

డల్హౌసీ వాతావరణం

సందర్శించడానికి ఉత్తమ కాలం మార్చి మరియు నవంబర్ మధ్య కాలం, డల్హౌసీ సందర్శించడానికి అనువైనదిగా భావిస్తారు. మార్చి మరియు జూన్ నెలల మధ్య మధ్యస్థ వాతావరణం ఉండి, ఈ ప్రాంత సౌందర్యాన్ని ఆస్వాదించడానికి అనువుగా ఉంటుంది. చిన్న పర్యటనలను ఆస్వాదించడానికి జూలై నుండి నవంబర్, చల్లని వాతావరణం కోరుకునే వారికి డిసెంబర్ నుండి ఫిబ్రవరి అనువుగా ఉంటాయి. డల్హౌసీ మంచు తో కూడిన ప్రాంతం కావటం వల్ల, ప్రయాణికులు శీతాకాలంలో పర్యటించాలనుకుంటే, సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

వేసవి

డల్హౌసీ, సంవత్సరం లో చాలా భాగం ఆహ్లాదంగా ఉండే, హిమాచల్ ప్రదేశ్ లోని ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశం. వేసవి (మార్చి నుండి మే): డల్హౌసీ యొక్క వాతావరణం వేసవిలో ఆహ్లాదంగా ఉంటుంది. స్థలం యొక్క ఉష్ణోగ్రత 15.5 డిగ్రీలు మరియు 25.5 డిగ్రీల మధ్య ఉంటుంది. యాత్రికులు ప్రకృతి నడక దారులు ఆస్వాదించడానికి వేసవిలో డల్హౌసీ వెళ్ళాలని సలహా ఇస్తారు.

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి సెప్టెంబరు): డల్హౌసీ లో, వర్షాకాలం జూన్ మరియు సెప్టెంబర్ మధ్య విస్తరించి ఉంటుంది. ఈ స్థలం యొక్క వార్షిక వర్షపాతం 214 సెం.మీ. వద్ద నమోదు చేయబడింది. వర్షాకాలాలలో పర్వతాల దృశ్యం మంత్రముగ్దంగా ఉంటుంది. కాబట్టి, పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఈ సమయంలో డల్హౌసీ సందర్శించడానికి ప్రణాళిక వేస్తుంటారు.

చలికాలం

శీతాకాలాలు (డిసెంబర్ నుండి ఫిబ్రవరి): డల్హౌసీ యొక్క ఉష్ణోగ్రత, శీతాకాలంలో 10 డిగ్రీలు మరియు 1̊ డిగ్రీ మధ్య ఉంటుంది. అధిక ఎత్తులో ఉన్న డల్హౌసీ కూడా ఈ కాలంలో హిమపాతం అనుభవిస్తుంది. ఈ సమయంలో భారీ ఊలు దుస్తులు తీసుకువెళ్లాల్సిందిగా యాత్రికులను సూచిస్తారు. శరత్కాలం (అక్టోబర్ నుండి నవంబర్): డల్హౌసీ లో శరత్కాలం, అక్టోబర్ మరియు నవంబర్ నెలల మధ్య కాలంలో ఉంటుంది. ఈ సమయంలో, అడపాదడపా తేలికపాటి వర్షం తో కూడిన ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది.