కులు - దేవతల లోయ !

‘దేవతల లోయ’ గా పిలువబడే కులు హిమాచల్ ప్రదేశ్ లోని అందమైన జిల్లా. ఒకప్పుడు దేవీ దేవతలకు, ఆత్మజ్ఞానులకు ఆవాసంగా వుండడం వల్ల ఈ పేరు వచ్చిందని నమ్ముతారు. బియాస్ నది ఒడ్డున సముద్ర మట్టానికి 1230 మీటర్ల ఎత్తున వుండే ఈ ప్రాంతం చుట్టూ అందమైన ప్రాకృతిక పరిసరాలు వుంటాయి.

‘భూమి మీది చిట్ట చివరి ప్రాంతం’ అని అర్ధం వచ్చేలా దీన్ని ‘కుల-అంతి-పీఠం’ అనే వారు – దీని ప్రస్తావన మహాభారతం, రామాయణం, విష్ణు పురాణాల్లో కూడా వుంది. త్రిపుర కు చెందిన బెహంగమణి పటేల్ స్థాపించిన ఈ అందమైన పర్వత ప్రాంతానికి 1 వ శతాబ్దం నాటి చరిత్ర వుంది. 1947 లో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చే దాకా ఈ ప్రాంతం చేరుకోవడం కష్టంగా ఉండేదని చెప్తారు.

ఈ వేసవి విడిది చుట్టూ ఎత్తైన కొండలు, దేవదారు వనాలు, నదులు, యాపిల్ తోటలు వున్నాయి – దీని ప్రాకృతిక అందానికి ఈ ప్రదేశం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందింది. ఇవే కాక కులు తన పురాతన కోటలు, ధార్మిక క్షేత్రాలు, వన్యప్రాణి అభయారణ్యాలు, ఆనకట్టలకు కూడా ప్రసిద్ది చెందింది.

రూపి పేలస్ గా పిలువబడే సుల్తాన్పూర్ పేలస్ ఇక్కడి ప్రసిద్ధ కేంద్రాల్లో ఒకటి. 1905 లోనే తీవ్రమైన భూకంపం కారణంగా అసలు కట్టడం ద్వంసమైనా, దాన్ని మళ్ళీ పునరుద్ధరించారు.

రాముడి కోసం నిర్మించిన రఘునాధ దేవాలయం కులు లోని మరో ప్రధాన ఆకర్షణ. 17 వ శతాబ్దంలో రాజా జగత్ సింగ్ నిర్మించిన ఈ దేవాలయం పిరమిడ్, పహాడి శైలుల మిశ్రమ శైలి లో వుంటుంది.

స్థానికంగాను, పర్యాటకుల్లోను ప్రసిద్ది చెందిన ఇక్కడి మరో ప్రధాన ఆకర్షణ బిజిలీ మహాదేవ్ దేవాలయం. శివుడి కోసం నిర్మించిన ఈ గుడి బియాస్ నది ఒడ్డున వుంది. ఒక ఇతిహాసం ప్రకారం ఈ గుడిలో వున్న శివలింగం ఒకప్పుడు మెరుపుల కారణంగా ముక్కలైపోయింది. తరువాత, ఆలయ పూజారులు ఆ ముక్కలన్నీ పోగేసి వెన్నతో అతికించారు.

ఉత్తర భారతంలో హిమాలయ పర్వత ప్రాంతాలలో నివసించే ప్రజలను సాధారణంగా పహాడీ లనే పదం తో వ్యవహరిస్తారు – ఇక్కడి జగన్నాథ దేవి, బసవేశ్వర మహాదేవ్ దేవాలయాలు పహాడీ శైలినే ప్రతిబింబిస్తాయి.

పురాతనమైన జగన్నాధ దేవి ఆలయాన్ని 1500 ఏళ్ళ నాడు నిర్మించారని అంటారు. ఈ గుడి గోడల మీద శక్తి స్వరూపిణి దుర్గా దేవి చిత్రాలు చూడవచ్చు. ఈ గుడిని చేరుకోవాలంటే 90 నిమిషాల పాటు పర్వతారోహణ మార్గం గుండా ప్రయాణించాలి. శివుడి కోసం నిర్మించిన ఇక్కడి బసవేశ్వర దేవాలయం 9 వ శతాబ్దం లో నిర్మించారు. ఇక్కడి గుడి నిర్మాణం సంక్లిష్టమైన శిల్ప శైలికి పేరుపొందింది.న

కైస్ధర్, రైసన్, దేవ్ టిబ్బా కులు లోని ఇతర ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు. ఇవన్నీ దేవదారు వనాల మధ్యలో వుండి మంచు ఖండాలతో నిండిన సరస్సుల మీదుగా పర్వతారోహణ చేసి చేరుకోవచ్చు. కులు పర్యటించే వారు 180 జాతుల వన్య ప్రాణులున్న గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ చూడవచ్చు. బియాస్ నది మీద నిర్మించిన పండో ఆనకట్ట 76 మీటర్ల ఎత్తులో వుంటుంది. జల విద్యుత్ ఉత్పత్తి చేసే ఈ డ్యాం కులు మనాలి ల విద్యుదవసరాలను తీరుస్తుంది.

ట్రెక్కింగ్, పర్వతారోహణ, హైకింగ్, పేరా గ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్ లాంటి వివిధ సాహస క్రీడలకు కూడా కులు ప్రసిద్ది చెంది౦ది. లడఖ్ లోయ, జన్స్కార్ లోయ, లాహౌల్, స్పితి ఇక్కడి ప్రసిద్ధ పర్వతారోహణ ప్రాంతాలు. భారత దేశంలో కులు పేరా గ్లైడింగ్ లాంటి సాహస క్రీడలకు ప్రసిద్ది. సోలంగ్, మహదేవ్, బీర్ లాంటి చోట్ల అనువైన ప్రారంభ కేంద్రాలు వున్నాయి. హనుమాన్ టిబ్బా, బియాస్ కుండ్, మలానా, దేవ్ టిబ్బా, చంద్రతల్ లాంటి ప్రాంతాల్లో పర్వతారోహణ కూడా చేయవచ్చు. పర్యాటకులు బియాస్ నదిలో చేపలు కూడా పట్టవచ్చు.

వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా పర్యాటకులు కులు చేరుకోవచ్చు. కులు మనాలి విమానాశ్రయంగా పిలువబడే భుంటార్ ఇక్కడికి దగ్గరలోనే వుంది. కులు నగరం నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ విమానాశ్రయం నుంచి డిల్లీ, షిమ్లా, చండీఘర్, పఠాన్ కోట్, ధర్మశాల లాంటి ప్రధాన నగరాలకు విమానాలు నడుస్తాయి. విదేశాలకు విమానాలు నడిపే డిల్లీ ఇక్కడికి దగ్గరలోని అంతర్జాతీయ విమానాశ్రయం.

నగరం నుంచి 125 కిలోమీటర్ల దూరంలో వున్న జోగీందర్ నగర్ ఇక్కడికి దగ్గరలోని రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి చండీఘర్ గుండా అనేక ప్రాంతాలకు రైళ్ళు నడుస్తాయి. హిమాచల్ ప్రదేశ్ రవాణా సంస్థ ద్వారా (హెచ్.పి.టి.సి) బస్సులు కులు నుంచి ఇతర సమీప నగరాలకు బస్సులు నడుపుతుండగా, హిమాచల్ ప్రదేశ్ పర్యాటక అభివృద్ది శాఖ (హెచ్.పి.టి.డి.సి) చండీఘర్, షిమ్లా, డిల్లీ, పఠాన్ కోట్ లాంటి నగరాలకు కులు నుంచి డీలక్స్ బస్సులు నడుపుతుంది.

వేసవిలో కులులో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడం వల్ల ఇది ఒక వేసవి విడిదిగా ప్రసిద్ది చెందింది. అయితే, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలలో ఇక్కడ విపరీతంగా మంచు కురవడం వల్ల శీతాకాలంలో గడ్డకట్టే చలి ఉంటుంది, కానీ స్నో స్కీఇంగ్ కు ఈ సమయం అనువుగా ఉంటుంది.

మార్చ్ నుండి అక్టోబర్ వరకు ఈ పర్వత కేంద్రాన్ని సందర్శించడానికి అనువైన సమయం. బహిరంగ కార్యకలాపాలకు, స్థల సందర్శనకు మార్చ్ నుండి జూన్ నెలలు అనుకూలమైనవి కాగా జూన్ నుండి అక్టోబర్ వరకు రివర్ రాఫ్టింగ్, పర్వతారోహణ, హైకింగ్, ట్రెక్కింగ్ లాంటి కార్యక్రమాలకు అనుకూలంగా ఉంటుంది.

Please Wait while comments are loading...