మనాలి కి ఆగ్నేయంగా సముద్ర మట్టానికి 6001 మీటర్ల ఎత్తున వున్న దేవ్ టిబ్బా ట్రెక్కింగ్ కోసం పర్యాటకుల్లో ప్రసిద్ది చెందింది. దేవ్ టిబ్బా కు ట్రెక్కింగ్ కు వెళ్ళేటప్పుడు మనాలి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో వున్న జగత్ సుఖ్ గ్రామం కూడా పర్యాటకులు చూడవచ్చు. ఇక్కడి నుంచి యాత్రికులు 2200 మీటర్ల ఎత్తున వుండే ఖనోల్ కు నడిచి వెళ్ళాలి.