Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కులు » వాతావరణం

కులు వాతావరణం

పర్యటనకు ఉత్తమ సమయం: మార్చ్ నుండి అక్టోబర్ వరకు ఈ పర్వత ప్రాంతాన్ని సందర్శించడం ఉత్తమం. మార్చ్, జూన్ మధ్య ఉండే మాసాలు బయటి కార్యకలాపాలకు సరైనది. సాహసకృత్యాలు ఇష్టపడేవారు, అంటే పర్వతారోహణ, రాళ్ళు-ఎక్కడం, నదిలో తెప్పలపై ఈదడం వంటి వాటికి అక్టోబర్, నవంబర్ మాసాలు అనుకూలంగా ఉంటాయి. నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఈ ప్రాంతం మంచుతో కప్పబడి ఉంటుంది కావున స్నో స్కీఇంగ్ కి సరైనది.

వేసవి

కులు వాతావరణం ఎడాదిపొడవునా మధ్యస్తంగా, ఆహ్లాదకరంగా ఉండే అనుకూలమైన పర్యాటక కేంద్రం. మధ్యస్థమైన వేసవి, చల్లని, భారీ మంచుతో కూడుకొని ఉన్న శీతాకాలాలు ఉంటాయి. వర్షాకాలంలో ఈ ప్రాంతంలో వర్షాలు అపుడపుడు కురుస్తాయి. వేసవి (మార్చ్ నుండి జూన్ వరకు): వేసవిలో కులులో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడి గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల కంటే ఎక్కువ మించదు. ఈ సమయంలో ఇక్కడి వాతావరణం పర్యటనకు అనువుగా ఉంటుంది కావున అనేకమంది పర్యాటకులు ఈ కొండ ప్రదేశాన్ని సందర్శిస్తారు.

వర్షాకాలం

వర్షాకాలం (జులై నుండి ఆగస్ట్ వరకు): ఈ సమయంలో కులులో వర్షాలు భారీగా పడతాయి కానీ అపుడపుడు కురుస్తాయి. ఈ సమయంలో ఇక్కడి ఉష్ణోగ్రత 15, 25 డిగ్రీల మధ్య ఉంటుంది. ఈ సమయంలో కులులో పర్యటన చాలా ఇబ్బంది కావున పర్యాటకుల సంఖ్య తక్కువగా ఉంటుంది.

చలికాలం

శీతాకాలం (నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు): శీతాకాలంలో కులులో ఉష్ణోగ్రత 0 డిగ్రీల కంటే తక్కువ పడిపోతుంది కావున ఈ సమయంలో ఇక్కడి వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఈ సమయంలో కులులో అత్యధిక మంచు కురుస్తుంది.