ప్రధాన రవాణా సదుపాయాలైన వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా కులుని తేలికగా చేరుకోవచ్చు. వాయుమార్గం ద్వారా: కులు నగరానికి షుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్థానిక సమీప భుంటార్ విమానాశ్రయాన్ని కులు మనాలీ లేదా కులు విమానాశ్రయం అనికూడా పిలుస్తారు. డిల్లీ, పఠాన్ కోట్, చండీగర్, ధర్మశాల, షిమ్లా వంటి భారతదేశంలోని ప్రధాన ప్రాంతాలకు ఈ విమానాశ్రయం బాగా అనుసంధానించబడి ఉంది. పర్యాటకులు ఈ విమానాశ్రయం నుండి కులు కి టాక్సీలలో చేరుకోవచ్చు. ఈ ప్రాంతంలోని అంతర్జాతీయ పర్యాటకులకు డిల్లీ సమీప విమానాశ్రయం.