థార్ - ఘనమైన చరిత్ర కలిగిన ప్రాంతం

మధ్యప్రదేశ్ లో ఉన్నగమ్య స్థానాలలో చారిత్రక మరియు సాంస్కృతిక మేళవింపు కలిగిన ప్రాంతం థార్. మధ్య ప్రదేశ్ లో ని మాల్వాస్ ప్రాంతం లో ఉన్న ఈ నగరం అత్యంత సాంస్కృతిక గమ్యస్థానం గా ప్రత్యేకత పొందినది. ఈ ప్రాంతం పారాస్ ల చేత ఒకప్పుడు పాలించబడిన ఈ ప్రాంతం మరాఠాలా రాచరిక రాష్ట్రం. అంతే కాకుండా 'సెల్యూట్ స్టేట్' అనే హోదా ని కూడా ఆ సమయం లో పొందింది.

ధార్ - సరిపోలని అందం

మధ్యప్రదేశ్ లో ని పశ్చిమ ప్రాంతం లో ఉన్న చిన్న టౌన్ ధార్. ధార్ సుందరమైన ప్రదేశం లో ఉంది. సముద్ర మట్టం నుండి 559 మీటర్ల ఎత్తులో ఉన్న ధార్ చుట్టుతా కొండలు ఇంకా సరస్సులు కనిపిస్తాయి. అంతే కాకుండా, అపారమైన చారిత్రక ప్రాధాన్యం కలిగిన పురాతన భవనాలు ధార్ ని పర్యాటక ప్రాంతం గా మలిచాయి.

ధార్ - మధ్య ప్రదేశ్ యొక్క సాంస్కృతిక నగరం

లలిత కళలు, శిల్ప కళ, చిత్ర లేఖనం, సంగీతం మరియు నృత్యం ఈ ప్రాంతం యొక్క అంతర్భాగం. ప్రపంచ వ్యాప్తం గా ధార్ యొక్క ప్రజలు విభిన్న రకాల కళలతో తమ ఉనికినిచాటి చెప్పారు. ప్రసిద్ది చెందినా బాఘ్ కేవ్స్ ల లో ని చిత్రలేఖనాలు గుప్తుల కాలం నాటి ఘనమైన సంస్కృతినీ అలాగే ప్రజల యొక్క సామర్ధ్యానికి అద్దం పడతాయి.

ధార్ - బాజ్ బహదూర్ మరియు రూపమతిల నగరం

బాజ్ బహదూర్ మరియు రూపమతి ల ప్రేమ కథ తర తరాలకి ప్రేరణ కలిగించింది. కలిగిస్తున్నది కూడా. ఈ ప్రాంతం లో ని ప్రతి మూల వీరి ప్రేమ కథ గురించి మాట్లాడుకుంటుంది. సాహిత్యం, సంగీతం లేదా నృత్యం ఇలా ఏదైనా కానివ్వండి బాజ్ బహదూర్ స్వయంగా ఆసక్తి కనబరచి వీటిని తగిన గుర్తింపు కలిగించారు. భారత దేశ మ్యాప్ లో దార్ కి ప్రత్యేకత కలగడానికి బాజ్ బహదూర్ కృషి ఏంతో ఉంది.

ధార్ పర్యటన ధార్ లో ఇంకా చుట్టు పక్కల ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. బాఘ్ కేవ్స్ ని తప్పక సందర్శించాలి. పారిశ్రామిక పట్టణమైన పీతంపూర్ ఇక్కడి ప్రధాన ఆకర్షణ. అక్టోబర్, నవంబర్ నెల ల లో ధార్ ని సందర్శించవచ్చు. సమీపం లో ఇండోర్ లో ఉన్న విమానాశ్రయం అలాగే రైల్వే స్టేషన్ నుండి ఈ ప్రాంతానికి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు.

Please Wait while comments are loading...