మహేశ్వర్ టూరిజం - హెరిటేజ్ మరియు చేనేతలు

మహేశ్వర్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఖర్గోన్ జిల్లాలో ఉన్న ఒక అందమైన పట్టణం. ఈ ప్రదేశం పూర్వ సంస్కృతికి ప్రతిబింబం వంటిది మరియు మహేశ్వర్ పర్యాటక రంగాన్ని పెంచే చేనేత వస్త్రాలకు చాలా ప్రసిద్ధి చెందింది. అంతేకాక, ఇది మధ్యప్రదేశ్ సాంస్కృతికరంగంలో అత్యంత అభివృద్ధి సాధిస్తున్నది.

మహేశ్వర్ లో ఉన్న మరియు చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

మహేశ్వర్ పర్యాటక రంగ ప్యాకేజీలు వారసత్వ సైట్లతో ఆకర్షణ గొలుపుతూ ఉంటాయి. అది కోటలు, కనుమలు, రాజ భవనాలు, ఆలయాలు లేదా ఏ ఇతర సైట్ అయిన అవనీయండి, మహేశ్వర్ వద్ద పర్యాటకులు వాటి అందాలను ఆస్వాదించడానికి భారీ సంఖ్యలో ఉంటారు. మహేశ్వర్ లో వారసత్వం కోసం వివిధ ప్రామాణికాలతో అమార్చిన ప్రత్యేకమైన నిర్మాణకళను చూసి పర్యాటకులు ఆశ్చర్యపడుతున్నారు.

మహేశ్వర్ - దైవ సంబంధం మరియు వేడుకలు

మహేశ్వర్ లో శివుడి దేవాలయాలు అనేకం ఉన్నాయి మరియు ఈ ప్రదేశం యొక్క పేరును అనువదిస్తే " స్వామి మహేష్ ని స్వర్గం" అని చెప్పవొచ్చు, శివుడికి ఇంకొక పేరు మహేశుడు. ఈ ప్రదేశం ప్రాచీనకాలం నుంచి వేల ప్రజల తీర్థయాత్రా కేంద్రంగా ఉన్నది.

దీనిని దర్శించే యాత్రికులు ఒక పవిత్రమైన భావంతో నర్మదా నదిలో స్నానం చేస్తారు మరియు మహేశ్వర్ లో ఉన్న ఆలయాలను దర్శించుతారు. ఈ పట్టణంలో నిస్సందేహంగా పండుగలు ఉత్సాహభరితంగా మరియు ఆసక్తితో జరుపుకుంటారు. మహా మృత్యుంజయ రథయాత్ర, గణేషుని మరియు నవరాత్ర పండుగలు, ఇక్కడ జరుపుకునే పండుగలలో కొన్ని.

మహేశ్వర్ ఎలా చేరుకోవాలి?

ఇండోర్ నుండి మహేశ్వర్ కు చేరుకోవటానికి 3 గంటల సమయం పడుతుంది. మధ్య ప్రదేశ్ లోని ముఖ్య నగరాల నుండి మహేశ్వర్ కు చేరుకోవటానికి బస్సు ప్రయాణం అనుకూలంగా ఉంటుంది.

మహేశ్వర్ ను దర్శించటానికి అనుకూల కాలం

మహేశ్వర్ ను దర్శించటానికి శీతాకాలంలో అనుకూలంగా ఉంటుంది. మీరు ఇక్కడికి వొచ్చినప్పుడు, మీ ఆడవారి కోసం కాటన్ చీరలు కొనుగోలు చేయటం మర్చి పోవొద్దు.

Please Wait while comments are loading...