ఇండోర్ - మధ్యప్రదేశ్ యొక్క హృదయ భాగం !

మధ్య ప్రదేశ్ లో ఉన్న మాల్వా పీఠభూమి పర్యాటకులకు ఆనందమయమైన ప్రాంతం. సహజసిద్దమైన ఆకర్షనలతో పోటీ పడుతున్న మానవుని చేతిలో తయారయిన ఆకర్షనలను ఇక్కడ గమనించవచ్చు. మధ్య ప్రదేశ్ యొక్క గుండెకాయ గా ఇండోర్ పిలువబడుతుంది. అందమైన నదులు, ప్రశాంతమైన సరస్సులు ఇంకా గంభీరమైన పీఠభూమి అబ్బురపరిచే విదంగా కనిపిస్తాయి.

సహజ సిద్దమైన ప్రకృతి సౌందర్యం తో పాటు ఇక్కడ కనిపించే పురాతన నిర్మాణ అద్భుతాలు ఈ నేల యొక్క ఘనమైన గతాన్ని గుర్తుచేస్తాయి. ఈ నగరం లో ఖాన్ నది మరియు సరస్వతీ నది ల సంగమం ఉంది. ఈ నగరం లో నిర్మాణ, సంస్కృతీ మరియు సాంఘిక విశేషాల మేలు కలయిక ని పర్యాటకులు చూడవచ్చు.

ఇండోర్ - గత కాల సందర్శనం

మధ్య ప్రదేశ్ లో ఉన్న పెద్ద నగరం ఇండోర్. దీనికి ఘనమైన చరిత్ర ఉంది. ఈ నగరం ఇంద్రేశ్వర్ స్వామి జి కి అన్కితమివ్వబడిన ఆలయానికి ప్రసిద్ది. ఈ ఆలయం 18 వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తారు. ఇందూరు అనే పేరు ఈ స్వామి వారి పేరు నుంచే వచ్చింది. నంద్లాల్ చౌదరి చేత ఈ నగరం కనుగొనబడింది. ఎంతో మంది గొప్ప గొప్ప రాజవంశీకుల పాలనకు ఈ నగరం సాక్ష్యం గా నిలుస్తుంది. కానీ చరిత్రలో ఇండోర్ కి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అందించినది మాత్రం హోల్కర్ రాజవంశీకుల రాజులు.

ఇండోర్ లో ఇంకా చుట్టు పక్కల చూడదగిన ప్రదేశాలు -

సౌందర్యాత్మకమైన రాజభవనాలు, అద్భుతమైన స్మారక చిహ్నాలు మరియు అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రాలు ఇండోర్ లో ని పర్యాటకులని ఆకర్షిస్తాయి. అటువంటి పర్యాటక ప్రాంతాల వల్లే ఇండోర్ భారత దేశం లో నే ప్రసిద్దమైన పర్యాటక ప్రాంతాలలో ఒకటి గా పేరొందింది. ఇండోర్ ని సందర్శించినపుడు అద్భుతమైన రాజ్వాడ పాలసు, మైమరపించే గాజు ఆలయం అయిన కాంచ్ మందిర్, ఈ నగరం యొక్క సమగ్ర దృశ్యాన్ని అందించే బిజసేన్ టేక్రి అనే వ్యూ పాయింట్, హోల్కర్ పాలకుల యొక్క అభిరుచులు ఇంకా జీవన విధానాన్ని తెలిపే లాల్ బాగ్ పాలసు, సహజమైన అద్భుతం పాటల్పని జలపాతం, వర్ణించలేని సౌందర్యం కలిగిన మేఘదూత్ ఉపవన్ అనే తోట, ఈ నగరం యొక్క ప్రధాన ల్యాండ్ మార్క్ అయిన గాంధీ హాల్, అన్ని మతాల వారికి స్వగతం పలికే గీతా భవన్ అనే మందిరం, ఈ నగరం యొక్క ఘనమైన చరిత్రని అలాగే సంస్కృతిని పదిలపరచిన ఇండోర్ మ్యూజియం మరియు మిగతా ఎన్నో అధ్బుతమైన గమ్యస్థానాలు పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తాయి.

ఇండోర్ - పాత కొత్త ల కలయిక

ఇండోర్ లో స్మారక చిహ్నాల మరియు ల్యాండ్ మార్క్ ల యొక్క అందాలను చూడవచ్చు. ఇక్కడే రెండు శతాబ్దాల పూర్వపు రాజ్వాడా పాలసు ఈ నవీన ఆధునిక టెక్నాలజీ యుగం లో కూడా అద్భుతంగా నిలిచి ఉండటం చూడవచ్చు. ఫ్రెంచ్, మొఘలు మరియు మరాఠా ల నిర్మాణ శైలి ని ప్రతిబింబించే అద్భుత స్మారక చిహ్నాలు పర్యాటకులను ఇప్పటికీ కుడా ముగ్ధులను చేస్తాయి. పూర్వపు కట్టడాల ఆకర్షణే కాక చరిత్రను కాపాడుకోవాలనే సమిష్టి కృషి కూడా ఇక్కడి ఆకర్షణకి తోడవుతుంది.

ఇండోర్ - హస్తకళ ల నెలవు

వైవిధ్యమైన కళలకు, హస్త కళ ల కు ఇండోర్ ప్రసిద్ది. సాంప్రదాయక మరియు వారసత్వ కళా నైపుణ్యానికి ఇది పుట్టినిళ్ళు అని చెప్పవచ్చు. ఇండోర్ లో ఉన్న హస్త కళల పరిశ్రమ లు హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్, టై అండ్ డై లేదా బందేజ్, బాటిక్, జ్యూట్ ఇండస్ట్రీ మరియు జారీ వర్క్ లు. ఇక్కడి ప్రదర్శనలలో ఈ విశేష కళాకృతులను వాటి వైవిధ్యాలను ప్రదర్శిస్తారు.

ఇండోర్ సందర్శన

ప్రఖ్యాత పర్యాటక గమ్యస్థానం గా ఇండోర్ మారడం లో ముఖ్య కారణం ఈ నగరం లో ఎక్కడైనా సౌకర్యవంతమైన వసతి అందుబాటు ధరలో లభించడం. ఇక్కడున్న అనేక హోటల్లు మరియు రెస్ట్ హౌస్ లు చక్కటి నాణ్యత కలిగిన మౌలిక వసతులను ఏర్పాటు చేస్తాయి. ఈ నగరం వాయు, రైలు మరియు రోడ్డు మార్గాల ద్వారా అనుసంధానించబడి ఉన్నది.

ఇండోర్ పర్యటనకు ఉత్తమ సమయం

శీతాకాలం లో ఇక్కడ వాతావరణం ఆహ్లాదంగా ఉంది పర్యటనకు అనువుగా ఉంటుంది.

Please Wait while comments are loading...