Search
 • Follow NativePlanet
Share

భోపాల్ – సరస్సులు, మనోహరమైన ఆకర్షణల నగరం!

భారతదేశంలో ప్రసిద్ధ నగరం భోపాల్, మధ్య ప్రదేశ్ రాజధాని కూడా. సరస్సుల నగరంగా పిలువబడే ఈ నగరం ఒకప్పటి భోపాల్ రాజ్యానికి రాజధాని. పరిశుభ్రంగా వుండే ఈ నగరం దేశంలోని పచ్చటి నగరాల్లో ఒకటిగా పేరు గాంచింది.

30

భోపాల్ లోను, చుట్టు పక్కలా పర్యాటక ప్రదేశాలు

భోపాల్ లోను, చుట్టు పక్కల చాలా ఆసక్తికరమైన పర్యాటక కేంద్రాలు వున్నాయి. భోపాల్ శివార్లలోని అందమైన విహార కేంద్రం కేవ్రా డ్యాం. ఒక కొండ శిఖరం మీద వుండడం వల్ల మనుభాన్ కీ టేక్రీ అనే విహార కేంద్ర నుంచి నగర దృశ్యం అందంగా కనబడడమే కాక ఇది జైన మతస్తులకు ముఖ్యమైన ధార్మిక ప్రదేశం.

సాయంత్రాలలోను, వారాంతాల లోను స్థానికులు విరివిగా సందర్శించే మరో విహార కేంద్రం భోపాల్ శివార్ల లోని షాహపురా సరస్సు. నగరానికి ఏడు కిలోమీటర్ల దూరంలో శివుడి కోసం నిర్మించిన గుఫా మందిర్ వుంది. భోపాల్ లో కొన్ని చారిత్రిక కట్టడాలు కూడా వున్నాయి. వీటిలో గోహర్ మహల్, షౌకత్ మహల్, పురానా కిలా, సాదర్ మంజిల్ లాంటివి వున్నాయి.

చరిత్ర పుటల్లో .....

పార్మార్ వంశానికి చెందిన భోజ రాజు క్రీ.శ.1000-1055 మధ్య నిర్మించిన భోపాల్ నగరానికి ఆసక్తి కలిగే గత చరిత్ర వుంది. 18 వ శతాబ్దం రెండో సగం లో ఈ నగరానికి దోస్త్ మొహమ్మద్ ఖాన్ ఆధునిక పునాదులు వేశాడు.

అప్పట్లో భోపాల్ ను నవాబులు పరిపాలించేవారు, వారిలో చివరి వాడు హమీదుల్లా ఖాన్. భోపాల్ లోని కళా, నిర్మాణ౦, సంగీత౦, వంటకాల్లో ముఘలాయి, ఆఫ్ఘన్ శైలుల ప్రభావం కనిపిస్తుంది. 1949 లో అధికారికంగా భారత దేశంలో కలిసిన ఈ నగరం అప్పటి నుంచి దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది.

భోపాల్ లో పర్యాటకం

దేశ విదేశాల నుంచి వచ్చే వేలాది మంది పర్యాటకులు సందర్శించే భోపాల్ దేశంలోని సుప్రసిద్ధ పర్యాటక కేంద్రాల్లో ఒకటి. ఆసక్తికరమైన గత చరిత్ర, ఆధునిక పోకడలు వుండడం వల్ల ఈ నగరం ఆసక్తి రేకెత్తిస్తుంది. పైగా, భోపాల్ లో చూసి తీరవలసిన పర్యాటక ఆకర్షణలు కూడా చాలానే వున్నాయి.

ఈ నగర భౌగోళిక స్థితి వల్ల ఈ ప్రాంతంలో సహజ౦గా ఏర్పడిన వన విహార్ అనబడే అభయారణ్యాలు చిరుత పులలకు ఆవాసంగా మారాయి. చరిత్ర ప్రేమికులు పురావస్తు ప్రదర్శనశాల, భారత్ భవన్ చూడాల్సిందే, అలాగే దైవ భక్తులు, బిర్లా మందిర్, మోతీ మసీదు, జామా మసీదు చూడాలి. 

కళా ప్రేమికులు పురాతన కాలంలో భారతదేశంలో అత్యంత నైపుణ్యాన్ని కనబరిచే ఆలయాలు, మ్యూజియం లతోపాటు అన్ని చారిత్రక ప్రదేశాలను తప్పక సందర్శించాలి.

భోపాల్ వాతావరణం !

నగరంలోని ఉప ఉష్ణమండల శీతోష్ణ స్థితి వేసవి, శీతాకాలం, వర్షాకాల సమయంలో స్థల సందర్శనకు చాలా కష్టంగా ఉంటుంది. అయితే, అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య సమయం సులువైన సందర్శనకు సరైనది.

భోపాల్ చేరుకోవడం ఎలా ?

ప్రపంచంలోని ఇతర ప్రదేశాల నుండి ఈ ప్రాంతం వాయు, రైలు, రైలు మార్గాల ద్వారా తేలికగా అనుసంధానించబడి ఉంది.

భోపాల్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

భోపాల్ వాతావరణం

భోపాల్
34oC / 93oF
 • Sunny
 • Wind: NNE 15 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం భోపాల్

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? భోపాల్

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డు ద్వారా రాష్ట్ర సరిహద్దు, మధ్యప్రదేశ్ పట్టణంలో, ఇతర నగరాలకు భోపాల్ నుండి రాష్ట్ర ప్రభుత్వ౦ వారిచే సౌకర్యవంతమైన బస్సులు నడుపబడుతున్నాయి. ప్రయాణ సమయంలో సౌలభ్యం కోరుకునేవారికి ఎయిర్ కండిషన్ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. భోపాల్ బస్ డిపో వారు మీ సమయాన్ని, డబ్బుని ఆదా చేయడానికి ముందుగా చెల్లించే టాక్సీలు, ఆటోలను ఏర్పాటుచేసారు.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలు ద్వారా ఈ నగరం రైలు మార్గం ద్వారా భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు బాగా అనుసంధానించబడి ఉంది. డిల్లీ, ముంబై, కొలకత్తా, చెన్నై వంటి ప్రధాన నగరాలతో భోపాల్ కి రోజువారీ రైళ్ళు అనుసంధానించబడి ఉన్నాయి. ఈ నగరం నుండి డిల్లీ, గ్వాలియర్, ఇండోర్ నగరాలకు కూడా శతాబ్ది రైళ్ళు ఏర్పాటుచేయబడ్డాయి. భోపాల్ రైల్వే స్టేషన్ వెలుపల నుండి కాబ్స్, ఆటలను సులభంగా పొందవచ్చు.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  వాయుమార్గం ద్వారా రాజ భోజ్ గా కూడా పిలువబడే భోపాల్ విమానాశ్రయం భోపాల్ నగరం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ విమానాశ్రయానికి ముంబై, డిల్లీ, ఇండోర్, గ్వాలియర్ నుండి రోజువారీ జాతీయ విమానాలు నడుస్తాయి. ఇది షార్జా, దుబాయ్ వంటి అంతర్జాతీయ విమానాలను కూడా కలిగిఉంది. ఈ విమానాశ్రయం నుండి కొన్ని అంతర్జాతీయ విమానసంస్థలు కూడా పనిచేస్తాయి.
  మార్గాలను శోధించండి

భోపాల్ ట్రావెల్ గైడ్

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Mar,Tue
Return On
27 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
26 Mar,Tue
Check Out
27 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
26 Mar,Tue
Return On
27 Mar,Wed
 • Today
  Bhopal
  34 OC
  93 OF
  UV Index: 6
  Sunny
 • Tomorrow
  Bhopal
  24 OC
  76 OF
  UV Index: 8
  Partly cloudy
 • Day After
  Bhopal
  27 OC
  81 OF
  UV Index: 8
  Partly cloudy