ఖాండ్వా  - దేవాలయాలు మరియు కుండాలు గల ప్రదేశం!

ఖాండ్వా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు నిమార్ జిల్లాలో ఉన్న ఒక అందమైన పట్టణం. ఇక్కడ పలు ఆలయాలు మరియు మందిరాలు అలాగే అనేక పురాతన కుండాలు ఉండుట వల్ల ఇది పాత పట్టణంగా పరిగణించబడుతుంది. ఖాండ్వాలో అనేక జైన్ మరియు హిందూ మతం దేవాలయాలు ఉన్నాయి. 12 వ శతాబ్దిలో జైన విశ్వాసం పెరిగి ఖాండ్వా జైనమతం యొక్క సెంటర్ గా మారినది. ఖాండ్వా వివిధ యుగాల సమయంలో మారింది. బ్రిటీష్ పాలన సందర్భంగా ఖాండ్వా నిమాడ్ ప్రాంతం ప్రధాన వ్యాపార కేంద్రంగా పరిగణిస్తున్నారు.అంతే  కాకుండా భారీ మౌలిక సదుపాయాలను కలిగి ఉంది. అసాధారణ గాయకుడు అయిన కిషోర్ కుమార్ ఖాండ్వాలో జన్మించాడు.

ఖాండ్వా మరియు పరిసరాలలోని పర్యాటక ప్రదేశాలు

ఖాండ్వాలో సందర్శకులు పర్యటించటానికి అనేక ఆకర్షణలు ఉన్నాయి. పట్టణం యొక్క నడిబోడ్డులో నమ్మశక్యంకాని ఘంటాఘర్ ఉన్నది. ఈ ప్రదేశం సమయం మరియు అదృష్టానికి కఠిన పరీక్షలకు సాక్షిగా ఉంటుంది. ఖాండ్వా లో అనేక పురాతన కుండ్ లు ఉన్నాయి. ఘంటాఘర్ కు నాలుగు దిశల  నాలుగు కుండ్ లు ఉన్నాయి. ఇంగ్లీష్ ఆర్కిటెక్చర్ అనేది ఖాండ్వా లో మరో ప్రధాన ఆకర్షణగా ఉన్నది. దీనిని  జిల్లా కలెక్టర్ బిల్డింగ్ లో చూడవచ్చు. ఒక సంప్రదాయం మరియు ఆధునికత్వం కలయికతో ఉన్న ఈ భవనం ను తప్పనిసరిగా సందర్శించాలి.

ఖాండ్వా పర్యాటనలో అనేక పురాతన దేవాలయాలను చూడవచ్చు. భవానీ మాత దేవాలయం హిందువుల ముఖ్యమైన ప్రార్థనా ప్రదేశం. ఇంకొక ముఖ్య పుణ్యక్షేత్రం దాదా దర్బార్ అని చెప్పవచ్చు. వేలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం నవ్ చండి దేవి ధామ్ కు తరలి వస్తారు.

ఖాండ్వాకు 89 km దూరంలో ఉన్న ఓంకారేశ్వర్ మాంధాత దేవాలయం హిందువులు మరియు జైనుల కోసం ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా ఉంది. సిద్ధావర్ కుట్ అనేది హిందువులకు ముఖ్యమైన మత ప్రదేశంగా ఉంది. అలాగే  మమలేశ్వర్ అనేది జైనులకు ఒక ముఖ్యమైన మత ప్రదేశంగా ఉంది.

డెక్కన్ కేంద్రంగా పిలిచే అసిర్గర్హ్ ఫోర్ట్ ఖాండ్వాలో ఒక ముఖ్యమైన ఆకర్షణగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో ఈ కోటను చూడటానికి వస్తారు. ఈ కోట ఖాండ్వా పర్యాటకంలో ఒక ముఖ్యమైన అంశంగా పరిగణించబడుతుంది. పర్యాటకులు కిషోర్ కుమార్ యొక్క స్మారక చిహ్నం అయిన గౌరీ కుంజ్ ను చూడవచ్చు.

ఖాండ్వా పట్టణంలో అనేక ఆనకట్టలు ఉన్నాయి. ఇందిరా సాగర్ ఆనకట్ట మరియు నగ్చుర్ ఆనకట్టలను ఖాండ్వాలో అద్భుతమైన పర్యాటక స్పాట్స్ గా చెప్పవచ్చు.

ఖాండ్వా చేరుకోవడం ఎలా

ఖాండ్వాను విమాన, రైలు మరియు రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. ఇక్కడ ప్రధాన రైలు జంక్షన్ మరియు ఒక రైల్వే స్టేషన్ ఉంది.

ఖాండ్వా సందర్శించడానికి ఉత్తమ సమయం

ఖాండ్వా సందర్శించడానికి సంవత్సరంలో వాతావరణము ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు అక్టోబర్ మరియు మార్చి నెలల మధ్య కాలంలోను మరియు ప్రధాన పండుగలు జరిగినప్పుడు ఉత్తమ సమయంగా ఉంటుంది.

ఉదయమే లేచి కాఫీ తాగుతున్నారంటే, ఆ పుణ్యం చిక్క మగళూర్ ఊరిదని గుర్తించండి. ఇక్కడ కల కాఫీ తోటల వాసనలు మీరు ఈ ప్రదేశం వదిలినా సరే, కొంత సమయం మీకు వాసన అందిస్తూనే వుంటాయి. అద్భుత సూర్యోదయాలను అందించే ఈ ప్రదేశం మీకు అందమైన ప్రకృతి దృశ్యాలను కూడా అందిస్తుంది.

చిక్క మగళూర్ కు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, ఆ ప్రదేశాన్ని ఆ నాటి రాజు కుమార్తె కు కట్నంగా ఇచ్చాడు. అందమైన పశ్చిమ కనుమలు కల ఈ కర్ణాటక భూ భాగం వంపులు తిరిగిన రోడ్లు, పొగమంచు తో కప్పబడిన గాలి, గల గల పారే నీటి వాలులు, పచ్చటి ప్రాంతాలు కలిగి వుంటుంది. ఈ ప్రాంత ప్రకృతి దానికి అదే సాటి. ఇక్కడ కల జలపాతాల అందాలు వర్ణించనలవి కాదు. వీటి మూలాలు, చరిత్రలు ఎల్లపుడూ సందిగ్ధంగానే వుంటాయి.

మీ చిక్క మగళూర్ సందర్శనలో దిగువ తెలిపిన జలపాతాలను తప్పక చూసి ఆనందంచండి.

Please Wait while comments are loading...