Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఖాండ్వా » వాతావరణం

ఖాండ్వా వాతావరణం

శీతాకాలంలో ఖాండ్వా సందర్శించడానికి ఉత్తమ సీజన్. ఉష్ణోగ్రత చల్లగా మరియు ఆహ్లాదకరమైనదిగా ఉంటుంది. అన్ని ప్రయాణ ప్రణాళికలకు ఏ ఆటంకం వాతావరణ రూపంలో ఉండదు. అంతేకాక ఈ కాలంలో ఇక్కడ శివరాత్రి, దుర్గ పూజ లు అన్ని పండుగలు జరుపుకుంటారు. ఈ శిఖరంనకు పర్యాటక సీజన్ నాటికి ముందుగానే రిజర్వేషన్లు చేయించుకోవాలి.

వేసవి

వేసవి కాలం ఖాండ్వా వేసవి సీజన్ లో చాలా వేడిగాను మరియు పొడిగాను ఉంటుంది. మార్చి మరియు మే మధ్య కాలంలో సాధారణంగా వేసవి ఉంటుంది. ఉష్ణోగ్రత అత్యదికంగా 42°సెల్సియస్ గా ఉంటుంది. ఈ ప్రయాణంలో ఉన్నప్పుడు అత్యదిక వేడి వలన మీరు నిర్జలీకరణకు గురి అవుతారు. ఈ సమయంలో  ఖాండ్వా ను సందర్శించడానికి అనువుగా ఉండదు.

వర్షాకాలం

వర్షాకాలంజూన్ లో వర్షాకాలం ప్రారంభం కావడంతో ఖాండ్వాలో కాల్చి భస్మము చేసే సూర్యుడు నుండి ఉపశమనం కలుగుతుంది. ఉష్ణోగ్రత 23°సెల్సియస్ క్రిందకి ఉండి వాతావరణము ఆహ్లాదకరముగా ఉంటుంది. ఈ ప్రాంతంలో భారీ వర్షంఉంటుంది. అందువల్ల మీ ప్రయాణమునకు సరైన సమయం కాదు.

చలికాలం

శీతాకాలముశీతాకాలం అక్టోబర్ లో మొదలై  ఫిబ్రవరి వరకు ఉంటుంది. జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో చాల చల్లగా ఉంటుంది. శీతాకాలంలో కనిష్ట సగటు ఉష్ణోగ్రత 10°సెల్సియస్ ఉంటుంది. ఖాండ్వా అక్టోబర్ నెల నుండి ఫిబ్రవరి వరకు ఒక అందమైన ప్రదేశంగా మారుతుంది. పర్యాటకులు తేలికపాటి ఉన్ని దుస్తులు తీసుకువెళ్లటం మంచిది.