హోషంగాబాద్ - సహజ అందాలు, అధ్యత్మికతలు!

నర్మదా నది ఉత్తరపు ఒడ్డున దేశానికి హృదయం వంటి [ప్రాంతం లో హోషంగాబాద్ ఉంది. దేశం అలాగే రాష్ట్రం యొక్క చరిత్రలో హోషంగాబాద్ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందింది. ఇంతకు పూర్వం నర్మదాపురం గా పిలువబడిన ఈ ప్రాంతం పేరు నర్మదా నది నుండి పుట్టింది. ఆ తరువాత నర్మదాపురాన్ని పాలించిన హోశాంగ్ షా పేరుతొ హోషంగాబాద్ గా ఈ ప్రాంతం ప్రాచుర్యం పొందింది. అప్పటి నుండి, ఈ నగరం సహజమైన అనడంతో, ఆధ్యాత్మికత తో ఏంతో మంది పర్యాటకులని అమితం గా ఆకట్టుకుంటోంది.

హోషంగాబాద్ సంగ్రహావలోకనం

హోషంగాబాద్ లో జరిగే వేడుక నర్మదా జయంతి. ఈ పండుగ హోషంగాబాద్ టూరిజం కి ఎంతగానో తోడ్పడుతుంది. సెథాని ఘాట్ అనేది హోషంగాబాద్ లో ఉన్న ముఖ్యమైన ల్యాండ్ మార్క్. ఈ జిల్లాలో ఉన్న రెండు నదుల అంటే నర్మదా ఇంకా తవా ల విభజన ప్రదేశం బంద్రబన్. హోషంగాబాద్ జనాభా వ్యవసాయం మీదే ముఖ్యంగా ఆధారపడి ఉంటుంది.

సోయా బీన్ ని అత్యధికంగా ఉత్పత్తి చెయ్యడం హోషంగాబాద్ కి గర్వకారణం. ఈ నగరం లో పర్యాటకుల కోసం ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. సత్పుర నేషనల్ పార్క్, అడంగర్ కొండలపై పురాతన రాతి రాతలు వంటివి కొన్ని. బంద్రభాన్ పర్యాటకులు ఈ ప్రాంతాలకి ఎక్కువగా మొగ్గు చూపుతారు. సల్కంపూర్, హుషంగ్ షా ఫోర్ట్, ఖేదపతి హనుమాన్ మందిర్, రంజీ బాబా సమాధి వంటివి హోషంగాబాద్ లో ఉన్న మరికొన్ని ఆకర్షణలు. హోషంగాబాద్ ప్రతేకత మరొకటి ఉంది. పంచ్మర్హి అనేది మధ్యప్రదేశ్ లో ని ఒకే ఒక హిల్ స్టేషన్. మహా శివుడి యొక్క భక్తులకు పుణ్యక్షేత్రం ఇది. అందువల్ల, హోషంగాబాద్ పర్యటన పర్యాటకులని తప్పక ఆకర్షిస్తుంది.

హోషంగాబాద్ పర్యటన ఏడాది పొడవునా హోషంగాబాద్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ నగరం రోడ్డు మరియు రైలు మార్గం ద్వారా పొరుగు నగరాలకి చక్కగా అనుసంధానమై ఉంది. ప్రతి దాంట్లో నిజమైన వైవిధ్యాన్ని ప్రదర్శించే నగరం హోషంగాబాద్. మధ్యప్రదేశ్ ని సందర్శించేవారు తప్పక సందర్శించవలసిన ప్రాంతం ఇది.

Please Wait while comments are loading...