హోషంగాబాద్ లో ఉన్న ప్రధాన ఆకర్షనలలో రాంజీ బాబా సమాధి ఒకటి. ఈ సమాధి లో రాంజీ బాబా మందిరం కలదు. అత్యంత మంది శిష్యులు కల్గిన మహర్షి ఇతను. ఈ సమాధి వద్ద స్థానికులచే ప్రతి సంవత్సరం దాదాపు ఒక నెల వరకు పండుగని జరుపుతారు. ఈ సమయం లో దూర దూరాల నుండి అనేక మంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తారు.
హోషంగాబాద్ నివాసితుల ఆధ్యాత్మిక విలువలకు నిదర్శనం రాంజీ బాబా యొక్క సమాధి. అనేక మంది భక్తులు ఈ సమాధిని సందర్శించడం రాంజీ బాబా కున్న అనుచరుల గురించి తెలియచేస్తుంది. రాష్ట్ర వ్యాప్తం గానే కాదు దేశ వ్యాప్తం గా రాంజీ బాబా కి అనుచరులు ఉన్నారు. అందువల్ల ఈ ప్రాంతం ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగినది. రాంజీ బాబా సమాధి హోషంగాబాద్ నగరం యొక్క పేరు ని ప్రసిద్ది చేస్తోంది. హోషంగాబాద్ టూరిసం రాంజీ బాబా సమాధికి అలాగే ఇక్కడ జరిగే వార్షికోత్సవానికి ప్రసిద్ది.