Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హోషంగాబాద్ » వాతావరణం

హోషంగాబాద్ వాతావరణం

ఉత్తమ సమయం అక్టోబర్ నుండి జూన్ వరకు హోషంగాబాద్ ని సందర్శించేందుకు ఉత్తమ సమయం. ఈ సమయం లో ఉష్ణోగ్రత చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది. వర్షపాతం తక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ సమయం లో ఈ ప్రాంత పర్యటన ఆహ్లాదకరం గా ఉంటుంది.    

వేసవి

ఎండాకాలం హోషంగాబాద్ లో ఎండాకాలం లో నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండదు. ఎక్కువ శాతం వాతావరణం ఆహ్లాదకరం గా ఉండటం వల్ల పర్యాటకులు ఈ నగరం లో ఎటువంటి అసౌకర్యం ఉండదు. ఎండాకాలం లో ఈ ప్రాంతాన్ని సందర్శించే వారు కాటన్ వస్త్రాలని తప్పకుండ తెచ్చుకోవాలి.  

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాల సమయం లో హోషంగాబాద్ కనుల విందుగా ఉంటుంది. జూన్ నుండి సెప్టెంబర్ వరకు నమోదయ్యే వర్షపాతం ఇక్కడి వాతావరణాన్ని ఆహ్లాదపరుస్తుంది. 1343.6 మిమీ ల వర్షపాతం ఇక్కడ నమోదవుతుంది. ఈ సమయం లో అత్యధిక వర్షపాతం నమోదవడం వల్ల ఈ సమయం సందర్శనకు అనువుగా ఉండదు.

చలికాలం

శీతాకాలం నవంబర్ లో మొదలయ్యే శీతాకాలం ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. శీతాకాల సమయం లో, హోషంగాబాద్ యొక్క ఉష్ణోగ్రత 19.42 సెలిసియస్ కంటే తక్కువగా ఉండదు. వాతావరణం ఆహ్లాదకరం గా ఉంటుంది. ఈ సమయం ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు అనువైనది.