ఇటార్సి - ఒక వ్యాపార కేంద్రం !

మధ్య ప్రదేశ్ లోని హోషంగాబాద్ జిల్లా లో కల ఇటార్సి ఒక ప్రసిద్ధ వాణిజ్య కూడలి మరియు ఒక ప్రఖ్యాత రైలు జంక్షన్. ఈ సిటీ అగ్రికల్చరల్ గాను మరియు పారిశ్రామికంగాను అభివృద్ధి చెందినది. ఇది ఒక అతి పురాతన రైలు జంక్షన్ కలిగి వుండటం వలన ఇంత అభివృద్ధి సాధించ కలిగింది. ఇటార్సి చేనేత ఉత్పత్తులకు ప్రసిద్ధి. ఈ పట్టణం భోపాల్ కు 111 కి.మీ.ల దూరంలో వుంది.

ఇటార్సి కి ఈ పేరు అక్కడ కల ఇటుకలు మఱియు రస్సి గా చెప్పబడే తాడు వలన వచ్చింది. నేడు ఇక్కడ ప్లయ్ వుడ్ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందినది. ఇటార్సి లో పుష్కలమైన ఖనిజ సంపద కూడా కలదు. మన సాయుధ దళాల అవసరాలకు గాను ఇక్కడ ఒక రక్షణ ఆయుధాల ఫ్యాక్టరీ కూడా కలదు. ఈ సిటీ లోని సోయా ఆయిల్ మిల్స్ కూడా ఇటార్సి ఒక ప్రధాన వాణిజ్య కేంద్రం అయ్యేందుకు దోహదం చేస్తున్నాయి.

ఇటార్సి లోను, చుట్టుపట్ల కల టూరిస్ట్ ప్రదేశాలు

ఇటార్సి పర్యటనలో అనేక ప్రదేశాలు చూడవచ్చు. తావ రివర్ పై కల తావ రిజర్వాయర్, బోరి వైల్డ్ లైఫ్ సంక్చురి వంటివి ప్రసిద్ధి చెందినవి. ఈ సిటీ లో అనేక మతపర ఆకర్షణలు అంటే ఎవాంజెలికల్ లూథరన్ చర్చి, బూది మత మందిర్, హుస్సైని మసీద్ మొదలనవి కలవు. టూరిస్టులకు ఆసక్తి కలిగించే చేతి కళల వస్తువులు అనేకం ఇక్కడ వీధులలో అమ్మబడతాయి.

ఇటార్సి చేరటం ఎలా ?

ఇటార్సి కి భోపాల్ నుండి తేలికగా చేరావచ్చు. రోడ్డు, రైలు మార్గాలలో చక్కగా కలుపబడి వుంది. జాతీయ రహదారి నెం.69 ఇటార్సి గుండా వెళుతుంది. టూరిస్టులకు అనేక వసతులతో కూడిన హోటళ్ళు ఇక్కడ కలవు.

సందర్శనకు మంచి సమయం !

ఇటార్సి సందర్శనకు వింటర్ సీజన్ అనుకూల సమయం

Please Wait while comments are loading...