Search
 • Follow NativePlanet
Share

సియోనీ - పులులు, అడవులు వుండే భూమి !!

9

సియోనీ అదే పేరు గల జిల్లాలో వుండే అందమైన పట్టణం. ఈ ప్రశాంతమైన పట్టణం మధ్య ప్రదేశ్ లోని సాత్పురా మైదాన ప్రాంతంలోని వాయువ్య భాగంలో వుంది. 8758 చదరపు కిలోమీటర్ల సుదీర్ఘ భౌగోళిక ప్రాంతాన్ని ఆవరించి వుండే సియోనీ జిల్లా 1956 నవంబర్ ఒకటో తేదీన ఏర్పడింది. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి అయిన వ్యవసాయానికి వెయిన్ గంగా నది ఊతం ఇస్తుంది.

సియోనీ గురించి ఆసక్తికరమైన నిజాలు

ఇతిహాసాల ప్రకారం జగద్గురువులు శంకరాచార్యులు ఈ దారి వెంట కేరళ వెళ్తూ ఈ అందమైన పట్టణాన్ని చూసి దీనికి శిరోని అని పేరు పెట్టారు, అదే తరువాత శివ నగరిగా ప్రసిద్ది చెంది తరువాత సియోనీ అయింది. రడ్యార్డ్ కిప్లింగ్ రాసిన జంగిల్ బుక్ లో కథ అంతా ఈ ప్రాంతం లో జరిగేసరికి ఇది ప్రసిద్ది చెందింది. అయితే రడ్యార్డ్ కిప్లింగ్ పుస్తకంలో దీన్ని సీయోనీ అని వ్యవహరించారు.

ఇక్కడ దొరికే వేర్బనాలియాల్ జాతి కి చెందిన సియోనా చెట్టు వల్ల కూడా సియోనీ అనే పేరు వచ్చిందంటారు. దీని నుంచి తీసిన చెక్క తో డోలక్ లు తయారు చేస్తారు. అంతేకాక సియోనీ లో తయారయ్యే ఇంకో ప్రసిద్ధ రకం కలప టేకు.

సియోనీ లోను, పరిసరాలలోనూ పర్యాటక ప్రదేశాలు

సియోనీ పర్యాటకం చాప్రా లో వెయిన్ గంగా నది ఒడ్డున వున్న ఆసియా లోని అతి పెద్ద మట్టి ఆనకట్ట అయిన భీమ ఘర్ సంజయ్ సరోవర్ డ్యాం ను అందిస్తుంది. దీని ప్రధాన ప్రయోజనం వ్యవసాయం. సియోనీ జిల్లాలోని మరో ప్రధాన పర్యాటక ఆకర్షణ పెంచ్ పులుల అభయారణ్యం. సారవంతమైన లోయలు, అందమైన పరిసరాలకు ప్రసిద్ది గాంచిన బార్ఘాట్ అనే చిన్న పట్టణం కూడా సియోనీ జిల్లాలో చూడదగ్గ ప్రదేశం. కాంపింగ్, ట్రెక్కింగ్ లాంటి బహిరంగ కార్యకలాపాలు ఇష్టపడే వారు బార్ఘాట్ సందర్శించాలి.

మహాకాళేశ్వర్ దేవాలయం, శివాలయం, ఆమోద ఘర్ లాంటివి సియోనీ లోని ఇతర ఆకర్షణలు.

సియోనీ కి ప్రయాణించడం

సియోనీ సందర్శన శీతాకాలంలో చేయడం మంచిది. రోడ్డు, రైలు, వాయు మార్గాల ద్వారా ఈ ప్రాంతం బాగా అనుసంధానించబడి వుంది.

సియోనీ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

సియోనీ వాతావరణం

సియోనీ
28oC / 82oF
 • Partly cloudy
 • Wind: SSW 10 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం సియోనీ

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? సియోనీ

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డు మార్గం : మధ్య ప్రదేశ్, మహారాష్ట్రలలోని ప్రధాన నగరాలు, పట్టణాలకు సియోనీ నుంచి రోడ్డు రవాణా సౌకర్యం బాగు౦ది. ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సియోనీ కి రోజులో చాలా సార్లు నడుస్తాయి. సియోనీ నుంచి మధ్య ప్రదేశ్ లోని ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి టాక్సీలు కూడా బాడుగకు తీసుకోవచ్చు.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలు మార్గం : ప్రయాణీకులు నాగపూర్ నుంచి సియోనీ కి రైళ్ళలో కూడా చేరుకోవచ్చు. సియోనీ నుంచి ప్రధాన నగరాలకు నిత్యం రైళ్ళు తిరగవు. నాగపూర్ జబల్పూర్ పాసింజర్, నాగపూర్ చింద్వారా ఎక్స్ ప్రెస్, నాగపూర్ నీర్ జబల్పూర్ పాసింజర్ లాంటివి సియోనీ జిల్లా గుండా ప్రయాణించే కొన్ని రైళ్ళు. ఇవన్నీ రామకోన, ఇట్వారి, హౌబాద్, ఉమ్రా నాలా, కోరడి, కేలోడ్ లాంటి వూళ్ళ గుండా తిరుగుతాయి.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  వాయు మార్గ౦ ద్వారా : సియోనీ పర్యాటకులకు అధ్బుతమైన విమాన సేవలు అందిస్తుంది. సమీపంలోని నాగపూర్ లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం వుంది. ఇది సియోనీ నుంచి సుమారు 154 కిలోమీటర్ల దూరంలో వుండి, జాతీయ అంతర్జాతీయ విమాన సేవలు అందిస్తోంది. సియోనీ నుంచి నాగపూర్ కు టాక్సీలు బస్సులు తిరుగుతాయి. సియోనీ నుంచి రోడ్డు ద్వారా నాగపూర్ కు రెండున్నర గంటల లో చేరుకోవచ్చు.
  మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
19 Mar,Tue
Check Out
20 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed
 • Today
  Seoni
  28 OC
  82 OF
  UV Index: 7
  Partly cloudy
 • Tomorrow
  Seoni
  23 OC
  74 OF
  UV Index: 7
  Partly cloudy
 • Day After
  Seoni
  21 OC
  70 OF
  UV Index: 6
  Moderate or heavy rain shower

Near by City