Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సియోనీ » వాతావరణం

సియోనీ వాతావరణం

ఉత్తమ సమయం :వర్షాకాలం లో విరివిగా వర్షాలు కురుస్తాయి కనుక అప్పుడు సియోనీ సందర్శనకు మంచిది కాదు. సియోనీ వేసవులు చాలా వేడిగా వుంటాయి, శీతాకాలాలు పొడిగా, చల్లగా వుంటాయి. సాధారణంగా ఇక్కడ ఉప-ఉష్ణ మండల వాతావరణం వుంటుంది. సియోనీ జిల్లా సందర్శనకు శీతాకాలం ఉత్తమ సమయం.

వేసవి

వేసవి సియోనీ లో వేసవి చాలా వేడిగా వుంటుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు వేసవి కొనసాగే సియోనీ లో పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా 48 డిగ్రీలకు, కనిష్టంగా 24 డిగ్రీలకు చేరుకుంటుంది. ఈ సమయంలో సియోనీ సందర్శనకు అనుకూలం కాదు.

వర్షాకాలం

వర్షాకాలం :సియోనీ లో జూలై నుంచి సెప్టెంబర్ వరకు బాగా వర్షపాతం వుంటుంది. ఈ ప్రాంతంలో వర్షాకాలంలో సుమారుగా 2150 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తు౦ది. ఈ వర్షాల్లో తిరగడం బాగా ఇబ్బందిగా వుంటుంది కనుక వర్షాకాలంలో సియోనీ సందర్శన చెప్పదగినది కాదు.

చలికాలం

శీతాకాలం :సియోనీ లో అక్టోబర్ నుంచి జనవరి వరకు శీతాకాలం నడుస్తుంది. శీతాకాలం లో కనిష్టం గా 9 డిగ్రీల సెల్షియస్, గరిష్టంగా 36 డిగ్రీల ఉష్ణోగ్రత వుంటుంది. శీతాకాలంలో సియోనీ సందర్శన, స్థల సందర్శనకు చాలా ఉత్తమం.