పెంచ్ - వృక్ష, జంతు సంపద కలిగిన అపరిమితమైన భూమి !!

పెంచ్ పర్యాటక రంగం ప్రధానంగా మధ్యప్రదేశ్ రాష్ట్ర దక్షిణ సరిహద్దులో ఉన్న పెంచ్ నేషనల్ పార్కు లేదా పెంచ్ టైగర్ రిజర్వ్ కు ప్రసిద్ది చెందింది. ఈ పార్కు వృక్ష, జంతు సంపాదకు బాగా పేరుగాంచింది. జామున్, టేకు, లేన్దియ, పలాస్, బీజ, మహు, కుసుమ, సేమేల్, వెదురు వంటి కొన్ని రకాల గుల్మకాండపు మొక్కలు, గడ్డి ఇక్కడ కనిపిస్తాయి. లంగూర్, సివెట్లు, ఎలుగుబంట్లు, చీతాలు, పులులు, సంబార్లు, అడవి కుక్కలు, పందుల, చిరుతలు, అక్షం దుప్పులు ఈ పార్క్ లో నివసించే జంతువులు.

పెంచ్: చరిత్ర పుటాల నుండి

ఈ పార్కుకి ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. ఈ స్థల గొప్పదనాన్ని, సహజ సంపదను గురించి అయిన్-ఇ-అక్బరి లో వివరించబడింది. పెంచ్ నేషనల్ పార్కు, దాని పరిసరాలు రుడ్యార్డ్ కిప్లింగ్ అందించిన “ద జంగిల్ బుక్” యొక్క ప్రత్యెక అమరిక.

పెంచ్ లో చుట్టుపక్కల

పెంచ్ పర్యాటక రంగం వారు పచ్ధర్ గ్రామం, నవేగాన్ నేషనల్ పార్క్, కన్హ నేషనల్ పార్క్, నాగపూర్, నాగ్జిరా అభయారణ్యం వంటి అందమైన ఆకర్షనలను అందిస్తున్నారు. ఈ ప్రదేశాలన్నీ పెంచ్ కి సమీపంలో ఉన్నాయి.

పచ్ధర్ పెంచ్ తురియ గేట్ నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం. ఇక్కడ ప్రయాణీకులు మట్టిముద్దలతో అద్భుతమైన వస్తువులను తయారుచేసే కుమ్మరులను చూడవచ్చు. మంత్రముగ్ధులను చేసే ఈ చేతిపనిని చూసిన వారు ఒక నమూనాను వారి ఇంటికి పట్టుకుపోవచ్చు.

పెంచ్ పర్యాటకరంగం పెంచ్ నేషనల్ పార్కు చుట్టూ ఉన్న గ్రామాల సమూహాన్ని అందిస్తుంది, అక్కడ పర్యాటకులు గోండ్ తెగ స్థానిక ఆచారాలను, సంస్కృతులను చూడవచ్చు.

పెంచ్ కి సమీపంలో ఉన్న మహారాష్ట్ర నవేగాన్ నేషనల్ పార్కు, నాగ్జిరా అభయారణ్యం ఇతర సహజ అడవులు. కన్హ నేషనల్ పార్కు పెంచ్ నుండి 198 కిలోమీటర్ల దూరంలో ఉంది.

పెంచ్ నేషనల్ పార్క్ సందర్శన

సందర్శకులు ఈ పార్కుని అక్టోబర్ 16 నుండి జూన్ 30 వరకు సందర్శించవచ్చు, జూలై నుండి సెప్టెంబర్ వరకు ఉండే వర్షాకాల సమయంలో ఈ పార్కు మూయబడి ఉంటుంది. ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల మధ్యలో ఈ నేషనల్ పార్కు సందర్శన సరైనది. ఈ పార్కు సందర్శకుల కోసం ఉదయం 6 గంటల నుండి 10.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరవబడి ఉంటుంది.

పెంచ్ ఎపుడు, ఎలా సందర్శించాలి

పర్యాటకులు రైళ్ళలో, విమానాలు, అదేవిధంగా రోడ్డు ద్వారా పెంచ్ సందర్శించవచ్చు. మధ్యప్రదేశ్ లో ఉన్న సియోని పెంచ్ కి సమీప రైలు కేంద్రం. నాగపూర్ లోని సోనేగాన్ పెంచ్ కి సమీప విమానాశ్రయం. సియోని జక్షన్ పెంచ్ కి సమీప బస్ స్టాండ్, ఇక్కడి నుండి పర్యాటకులు ప్రభుత్వ, ప్రైవేట్ బస్సుల ద్వారా పెంచ్ చేరుకోవచ్చు. ఫిబ్రవరి, ఏప్రిల్ మధ్య సమయం పెంచ్ సందర్శన ఉత్తమం.

Please Wait while comments are loading...