హోమ్ » ప్రదేశములు » ఇండోర్ » ఆకర్షణలు
 • 01రాజ్వాడా పాలసు

  ఇండోర్ లో ని ముఖ్య ఆకర్షణ ఈ రాజ్వాడా పాలసు. హోల్కార్ వంశస్తుల చారిత్రక భవనం ఈ రాజ్వాడా పాలసు. 200 ఏళ్ళ క్రితం నిర్మించబడి ఇప్పటికి నిలిచి ఉన్న గొప్ప ఆకర్షణ ఈ ప్రదేశం. ఫ్రెంచ్, మరాఠా మరియు మొఘలుల నిర్మాణ శైలిల లో నిర్మించబడినది ఈ వైభవోపేతమైన కట్టడం. ఇది ఏడు అంతస్తుల పాలసు. ఇక్కడి ప్రవేశ తోరణం ఒక ప్రత్యేక ఆకర్షణ. ఇనప స్టడ్స్ తో అలంకరించిన ఒక పెద్ద చెక్క ద్వారం ద్వారా పర్యాటకులు ఈ పాలసు లో కి ప్రవేశిస్తారు.రాయి మరియు చెక్కతో ఈ పాలసు నిర్మాణం జరిగింది. ఇక్కడి కిటికీలు, బాల్కనీలు మరియు కారిడార్లు హోల్కర్ రాజుల వైభవాన్ని వారి జీవన శైలి ని చాటిచెప్తాయి. రాజ్వాడా పర్యాటకులు తప్పక చూడవలసిన ప్రదేశం.

  + అధికంగా చదవండి
 • 02కాంచ్ మందిర్

  కాంచ్ మందిర్

  ఇండోర్ లో ఉన్న అద్భుతమైన మందిరం కాంచ్ మందిర్. తెల్ల రాతితో ఇది నిర్మించబడినది. మధ్య యుగ భవనం గా నిర్మించబడిన ఈ ఆలయం లో పందిరి బాల్కానీ ఇంకా షికారా ఉంది. ఈ ఆలయం లోపల గాజు తో అద్భుతం గా ఉంటుంది. సేథ్ హుకంచాండ్ అనే ప్రఖ్యాత కాటన్ వర్తకుడు చే 20 వ శతాబ్దం లో ఈ ఆలయం నిర్మించబడింది.గాజు తో తయారుచేయాడిన అధ్బుతమైన హస్త కళా నైపున్యనిక్జి ఈ ఆలయం నిదర్శన.

  ఈ ఆలయం లోపల గోడలు, పైకప్పు, నేల, స్థంభాలు, తలుపులు వంటివి గాజు పలకలు మరియు మొజైక్ ల తో కప్పబడినవి. ఈ ఆలయం లోపల వాడిన రంగు రంగుల గాజు అత్యంత ఆకర్షనీయం గా ఉంటుంది. అందంగా అలంకరించబడిన గాజు లాంతర్లు ఇంకా గాజు తో తయారు చేయబడిన షాన్డిలియర్ వంటివి అమితంగా ఆకట్టుకుంటాయి.

  మహావీర మరియు తిర్తంకరల విగ్రహాలు ఈ ఆలయం లో ఉన్నాయి. జైన పుణ్యక్షేత్రం అయిన ఈ ఆలయం జైనులచే అలాగే పర్యాటకులచే సందర్శింపబడుతుంది.

  + అధికంగా చదవండి
 • 03గీతా భవన్

  గీతా భవన్

  ఇండోర్ లో ఉన్న విలక్షణమైన కట్టడం గీతా భవన్. ఇది ఒక మందిరం. ఏ మతానికి చెందినది కాకపోవడం ఈ మందిరం యొక్క ప్రత్యేకత. ప్రజల నమ్మకానికి చెందినది ఈ మందిరం. వివిధ మతాల నమ్మకాలూ కలిగిన భక్తులు అందరూ కలిసి ఈ మందిరాన్ని సందర్శిస్తారు. వివిధ మతాలకు సంబంధించిన ప్రతిమలు ఈ మందిరం లో ఉన్నాయి.

  ఈ మందిరం లో మధ్య లో ఉన్న హాల్ పురాణాల నుండి అలాగే రామాయణ మహాభారత ఇతిహాసాల నుండి కొన్ని సంఘటనలకి చెందిన చిత్రలేఖనాలతో అలంకరించబడి ఉంది. ఆధ్యాత్మిక సంబంధమైన ప్రవచనాలను ఈ మందిరం ప్రోత్సహిస్తుంది. స్థానికులలో అలాగే పర్యాటకులలో ఈ ఆలయం అత్యంత ప్రాచుర్యం పొందింది. ప్రతి సంవత్సరం జరిగే ఒక ప్రోగ్రాం లో వివిధ మతాలకు చెందిన భక్తులు ఇక్కడికి విచ్చేస్తారు.

  + అధికంగా చదవండి
 • 04అన్నపూర్ణ టెంపుల్

  అన్నపూర్ణ టెంపుల్

  అద్భుతమైన అన్నపూర్ణ దేవాలయం ఇండోర్ లో ఉంది. అనేక కారణాల వల్ల ఈ ఆలయం ప్రాచుర్యం పొందింది. ఇండోర్ లో ని పురాతన దేవాలయాలలో ఇది ఒకటి. 9 వ శతాబ్దం లో నిర్మించబడిన ఈ దేవాలయం ఇండో ఆర్యన్ మరియు ద్రవిడ నిర్మాణ శైలి ల లో నిర్మించబడింది. 100 కంటే అడుగుల ఎత్తు కలిగి ఉన్నది ఈ దేవాలయం. ఆహారానికి దేవత గా భావించబడే అన్నపూర్ణ దేవి కొలువై ఉన్నది ఈ దేవాలయం.

  మదురై లో ని ప్రపంచ ప్రసిద్ది చెందినా మీనాక్షి దేవాలయం యొక్క నిర్మాణ శైలి నుండి ప్రేరణ పొంది నిర్మించబడినది ఈ దేవాలయం. నాలుగు పెద్ద ఏనుగుల విగ్రహాలు ఆధారంగా కలిగిన ప్రవేశ ద్వారం ఈ మందిరం యొక్క ప్రత్యేక ఆకర్షణ. ఈ ఆలయ సముదాయం లో అన్నపూర్ణ దేవి కి, శివుడికి, హనుమంతుడికి మరియు కాల భైరవుడి కి ప్రత్యేక మందిరాలు కలవు. ఈ ఆలయ బయట గోడలపై రంగు రంగుల పౌరాణిక చిత్రాలను చూడవచ్చు. ఈ ఆలయం యొక్క ప్రత్యెక ఆకర్షణ పద్మాసనం లో ఉన్న పద్నాలుగున్నర అడుగుల ఎత్తు ఉన్న కాశీ విశ్వనాథుని విగ్రహం.

  + అధికంగా చదవండి
 • 05మహాత్మా గాంధీ హాల్

  మహాత్మా గాంధీ హాల్

  ఇండోర్ లో ఉన్న ముఖ్యమైన ల్యాండ్ మార్క్ నిర్మాణాలలో ఒకటి మహాత్మా గాంధీ హాల్. 1904 లో నిర్మించబడిన ఈ భవనం మొదట కింగ్ ఎడ్వర్డ్ హాల్ గా పిలువబడేది. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1948 లో ఈ హాల్ మహాత్మా గాంధీ హాల్ గా మార్చబడింది.

  బొంబాయి కి చెందిన చార్లెస్ ఫ్రెడరిక్ స్టీవెన్స్ చే ఇండో - గోతిక్ నిర్మాణ శైలి లో రూపకల్పన చెయ్యబడిన ఈ నిర్మాణం ఒక అద్భుతం. దీనినే టౌన్ హాల్ గా కూడా పిలుస్తారు. ఈ నిర్మాణం యొక్క ప్రత్యేకత క్లాక్ టవర్. నాలుగు ముఖాలు గల ఈ క్లాక్ టవర్ భవనం యొక్క మధ్యలో నిర్మితమై డోమ్ ఆకారం లో ఉంటుంది.

  ఈ హాల్ ని క్లాక్ టవర్ అని లేదా ఘంటా ఘర్ అని ప్రాంతీయంగా పిలుస్తారు. పైకప్పు, నమూనాలతో అలంకరించబడి ఉండి, ఎత్తైన పైకప్పులు, అందంగా అలంకరించబడిన గదులు, మినార్లు కలిగిన ఒక గొప్ప నిర్మాణం ఇది. ఈ హాల్ 2000 మంది సమావేశం అవగలిగేటంత విశాలమైనది. ఈ భవనం లో చిన్న పిల్లలకి పార్క్ మరియు లైబ్రరీ సౌకర్యాలు ఉన్నాయి.

  + అధికంగా చదవండి
 • 06ఛత్రీబఘ్

  ఛత్రీబఘ్

  ఛత్రీ అనబడే స్మారక మంటపాలకి ప్రసిద్ది ఛత్రీ బఘ్. హోల్కా వంశస్తుల స్మృత్యర్ధం నిర్మించబడినవి ఈ స్మారక మంటపాలు. ఖాన్ నది కి సమీపం లో ఛత్రి బాఘ్ ఉంది. ఛత్రి బాఘ్ లో ని సమాధులు డోమ్ ఆకృతి లో ఉండి వాటిపై పిరమిడ్ ఆకృతిలో గోపురాలు కలిగి ఉన్నాయి. ప్రతి ఛత్రీ ఒక రాజు లేదా రాణి యొక్క సమాధిని గుర్తుకు తెస్తాయి.

  హోల్కర్ వంశ మూల పురుషుడు అయిన మల్హర్ రావు హోల్కర్ 1 కి సంబంధించిన సమాధి ముఖ్య ఆకర్షణ. రాత్రి పూట పర్యాటకులకి ఈ ప్రదేశం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రాత్రి పూట విద్యుద్దీపాలతో ఈ ఛత్రీ ల ని అలంకరించడం వల్ల మరియు అక్కడి కృత్రిమ కొలనుల ఫౌంటెన్ ల వల్ల ఈ ప్రాంతం అందంగా మారుతుంది. ఈ కొలను చుట్టుతా అందమైన ఉద్యానవనాలు మాత్రమే కాక ఇక్కడ బోటింగ్ చేసే అవకాశం ఉంది.

  + అధికంగా చదవండి
 • 07కృష్ణపుర ఛత్రి

  ఖాన్ నదీ తీరాన ఉన్నది ఈ కృష్ణపుర ఛత్రి. హోల్కర్ రాజవంశస్తులకి చెందినా స్మారక మంటపం ఇది. దీని నిర్మాణ కౌశలం మరియు దీని పై అలంకరించబడిన కళాకృతులు వల్ల ఇది చాలా అద్భుతంగా ఉంది.ఈ మంటపాలు మరాఠా నిర్మాణ శైలిలో నిర్మితమైనవి. ఇవి గోపురాలతో మరియు డోముల ఆకృతి ల లో నిర్మించబడి ఇప్పటికీ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. రాత్రి పూట పర్యాటకులకి ఈ ప్రదేశం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రాత్రి పూట విద్యుద్దీపాలతో ఈ ఛత్రీ ల ని అలంకరించడం వల్ల మరియు అక్కడి కృత్రిమ కొలనుల ఫౌంటెన్ ల వల్ల ఈ ప్రాంతం అందంగా మారుతుంది. ఈ కొలను చుట్టుతా అందమైన ఉద్యానవనాలు ఉన్నాయి.

  + అధికంగా చదవండి
 • 08ఇండోర్ మ్యూజియం

  ఇండోర్ మ్యూజియం

  ఇండోర్ నగరం యొక్క వారసత్వ సంపదను పరిరక్షించే భవనం ఇండోర్ మ్యూజియం. సంస్కృతీ సంప్రదాయాల మూల ల ను తెలుసుకునే ఆసక్తి కలవారికి ఈ మ్యూజియం సమాచారాన్ని అందిస్తుంది. పూర్వికుల జీవన విధానం, నాగరికత ఎలా వచ్చింది, ప్రస్తుత సమాజం ఎలా రూపాంతరం చెందింది ఇలాంటి విషయాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.

  ఇండోర్ లో ఉద్భవించిన పర్మార్ శిల్పాల గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు. మధ్యప్రదేశ్ యొక్క హిందూ మరియు జైన మత విగ్రహాలు ఈ మ్యూజియం లో ఉన్నాయి. ప్రీ-హిస్టారిక్ శకానికి చెందిన కళాకృతులు, నాణేల సేకరణ, ఆయుధాలు, పౌరాణిక చెక్కడాలు వంటి వాటి సేకరణ ఈ మ్యూజియం లో కలదు. ఈ ప్రాంతం యొక్క చరిత్రని తెలుసుకోవడానికి ఇది ఉత్తమమైన ప్రదేశం. ఈ మ్యూజియం ద్వారా ఇండోర్ యొక్క ఘనమైన చరిత్రని తెలుసుకున్న పర్యాటకులు మంత్రముగ్ధులవుతారు.

  + అధికంగా చదవండి
 • 09బిజసేన్ టేక్రి

  బిజసేన్ టేక్రి

  ఇండోర్ లో ని కొండ పైన ఉన్న బిజసేన్ టేక్రి బిజసేన్ మాత యొక్క అందమైన ఆలయం. దుర్గా అమ్మవారి రహస్య అవతారం గా బిజసేన్ మాత ని భావిస్తారు. ఈ చిన్న ఆలయం 1920 లో నిర్మించబడినది. ఈ ఆలయం ఉన్న ప్రదేశం నుండి ఈ నగరం యొక్క అద్భుతమైన వీక్షణం మనోహరం గా ఉంటుంది. ప్రతి సంవత్సరం నవరాత్రి పర్వదినం లో ఈ ఆలయం లో వేడుకలు జరుగుతాయి.

  ఈ వేడుకలకి ఏంతో మంది భక్తులు తరలి వస్తారు. ఈ కొండపై నుండి సూర్యాస్తమయాన్ని చూడడం అనిర్వచనీయమైన అనుభూతి. ఈ ఆలయం కి సమీపం లో హోల్కర్ లకి సంబంధించిన గెస్ట్ హౌస్ ఉంది. ఆ గెస్ట్ హౌస్ ప్రస్తుతం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు అర్మ్స్ మ్యూజియం గా రూపాంతరం చెందింది. ఇండోర్ సందర్శనకి వచ్చిన పర్యాటకులు ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా సందర్శిస్తారు. ఈఆలయానికి విమానాశ్రయం నుండి అలాగే రైల్వే స్టేషన్ ల నుండి సులభంగా చేరుకోవచ్చు.

  + అధికంగా చదవండి
 • 10కమల నెహ్రు పార్క్

  కమల నెహ్రు పార్క్

  జూలాజికల్ పార్క్ అయిన కమల పార్క్ ప్రసిద్ది చెందిన పర్యాటక ఆకర్షణ. ఈ పార్క్ 4000 చదరపు అడుగుల మేరకు విస్తరించబడినది. స్థానికంగా చిదియా ఘర్ గా ఈ పార్క్ ప్రసిద్ది చెందింది. సహజసిద్దమైన వాతావరణం లో నెలకొని ఉండటం వల్ల ఈ పార్క్ కి ఒక వైపు ఖాన్ నది ప్రవహిస్తూ ఉంటుంది. వివిధ రకాల పక్షులు అలాగే జంతువులూ ఈ పార్క్ లో ఉన్నాయి. తెల్ల పులి ఇంకా పులి పిల్లలు ఈ పార్క్ యొక్క ప్రత్యేకతలు.

  ప్రత్యేక శ్రద్ధ తో వాటిని ఈ పార్క్ లో పరిరక్షిస్తున్నారు. సహజ సిద్దమైన వాతావరణం లో జంతువుల పునరుత్పత్తి ఇంకా వాటి సంరక్షణ కి ఈ పార్క్ భాద్యత వహిస్తుంది. ఈ పార్క్ లో రక రకాల మొక్కలు కూడా ఉన్నాయి. గుర్రపు స్వారీ, ఏనుగు సఫారీ ఇంకా ఒంటెలపై ప్రయాణం చేసే అవకాశం ఈ పార్క్ కి విచ్చేసిన సందర్శకులని అత్యంత గా ఆకర్షిస్తుంది.

  చిన్న పిల్లల కోసం ఆటవిడుపు స్థలం కూడా ఈ పార్క్ లో ఉంది. ఇందులో అందమైన తోట తో చిన్న చిన్న రైడ్స్ చేసే అవకాశం ఉంది. పిల్లలతో కలిసి ఈ పార్క్ లో ని సందర్శన ఆనందంగా ఉంటుంది.

  + అధికంగా చదవండి
 • 11గోమాతగిరి

  గోమాతగిరి

  సహజసిద్దమైన కొండల మధ్య గోమాతగిరి ఉంది. జైన మతానికి చెందిన వారికీ ముఖ్యమైన ప్రార్ధనా కేంద్రం ఇది. గోమాతేశ్వర్ లేదా బాహుబలి యొక్క పెద్ద విగ్రహానికి ఈ ఆలయం ప్రసిద్ది. ఈ విగ్రహం 21 అడుగుల ఎత్తు తో ఉంది. శ్రావణబెలగోల లో ఉన్న బాహుబలి విగ్రహాన్ని పోలి ఉంటుంది. జైన మతానికి చెందినా 24 తీర్తంకర్ ల కు నిర్మించబడిన 24 తెల్ల పాలరాతి ఆలయాలకు గోమాతగిరి ప్రసిద్ది.

  పర్యాటకులని ఆకట్టుకునే ప్రదేశం ఇది. తెల్ల గోడల మధ్య ఉన్న ప్రశాంత వాతావరణం తో ఈ వైభవోపేతమైన ఆలయం ప్రశాంతంగా ఇక్కడి వాతావరణాన్ని ఆనందించేందుకు అనువైన ప్రాంతం. కుటుంబ సమేతం గా హాయిగా, ప్రశాంతం గా గడిపేందుకు గోమాతగిరి అనువైన ప్రదేశం. సందర్శకులకు గెస్ట్ హౌస్, రెస్టారంట్ మరియు ధర్మశాల వంటి సౌకర్యాలు ఇక్కడ కలవు.

  + అధికంగా చదవండి
 • 12సుఖ్ నివాస్ పాలసు

  సుఖ్ నివాస్ పాలసు

  ఇండోర్ యొక్క నిర్మాణ విశేషాల లో సుఖ్ నివాస్ పాలసు అతి ముఖ్యమైనది. ఈ పాలసు ని హోల్కర్ వంశస్తులు వేసవి విడిదిగా వాడుకునేవారు. ఈ అద్భుత భవనం భారతీయ మరియు పాశ్చాత్య నిర్మాణ శైలిల కలయికతో నిర్మించబడినది. ఈ భవనం రాజ వంశస్తుల అభిరుచి మరియు వైభవాన్ని తెలియచేస్తుంది. ఈ పాలసు లో ఉన్న సొరంగ మార్గం హోల్కర్ రాజుల పురాతన పాలసు ని కలుపుతుంది. చుట్టూతా పచ్చదనం ఉన్న ఈ పాలసు ను ఒక పిక్నిక్ రిసార్ట్ గా ఇప్పుడు వినియోగిస్తున్నారు. పర్యాటకులని ఇప్పటికీ విశేషంగా ఆకర్షిస్తున్న ఈ రాజభవనం ఇండోర్ రాజుల యొక్క వైభవానికి ప్రతీక.

  + అధికంగా చదవండి
 • 13బడా గణపతి టెంపుల్

  బడా గణపతి టెంపుల్

  బడా గణపతి దేవాలయం ఇండోర్ లో ని ప్రఖ్యాత దేవాలయం. ఈ దేవాలయం అందులో ని గణేషుని పెద్ద విగ్రహం వల్ల ప్రసిద్ది. 25 అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని ప్రపంచం లో నే అతి పెద్ద గణపతి విగ్రహం గా భావిస్తారు. 1875 లో నిర్మితమైనది ఈ దేవాలయం. ఇతిహాసాల ప్రకారం అవంతిక (ఉజ్జయిని) నగరం లో ని నివసించిన శ్రీ దధిచ్ కి కలలో గణేశుడు కనిపించడం వల్ల ఆ మరునాడు గణేశుడి విగ్రహాన్ని కట్టాలని నిర్నయిచుకున్నాడు.

  ఈ విగ్రహాన్ని ఇటుకల , సున్నపు రాయి, బెల్లం, మట్టి, సెవెన్ మోచా పురి యొక్క మట్టి, అశ్వశాల, గోశాల మరియు ఏనుగుల శాల లో ని బురద, పంచరత్న పొడి (వజ్రం, ముత్యం, పగడం, పుష్పరాగం, పచ్చ) మరియు అన్ని పుణ్యక్షేత్రాల నుంచి సేకరించిన పవిత్ర జలం ల తో నిర్మించారు. మెటాలిక్ ఫ్రేమ్ ని బంగారం, వెండి,ఇత్తడి, రాగి మరియు ఇనుముతో తయారుచేసారు.

  + అధికంగా చదవండి
 • 14ఖజ్రానా గణేశా టెంపుల్

  ఖజ్రానా గణేశా టెంపుల్

  ఇండోర్ లో ని ప్రసిద్ది చెందిన ఆధ్యాత్మిక కేంద్రం ఈ ఖజ్రానా గణేశా టెంపుల్. ఈ ఆలయం రాణి ఆహిల్యబాయి హోల్కర్ చేత నిర్మితమైనది. ఈ ఆలయం లో కొలువున్న దైవం వినాయకుడు. భక్తుల లో ఈ ఆలయం అత్యంత సంతరించుకుంది. ఈ ఆలయం లో ప్రార్ధిస్తే కోరికలు తక్షణం తీరుతాయని భక్తుల నమ్మకం. అందువల్ల ఈ ఆలయం లో ఎక్కువ మంది భక్తులు భగవంతుని ఆశీస్సుల ని పొందడానికి కనిపిస్తారు. ప్రతి బుధ మరియు ఆది వారాలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వినాయక చతుర్థి అనే పండుగ ఈ ఆలయం లో ఘనం గా నిర్వహిస్తారు. ఈ ఆలయం ప్రసిద్ది చెందిన పర్యాటక ఆకర్షణ కూడా. ఇండోర్ ని సందర్శించే వారు ఈ ఆలయాన్ని తప్పక సందర్శించాలి.

  + అధికంగా చదవండి
 • 15మేగ్ దూత్ ఉపవన్

  మేగ్ దూత్ ఉపవన్

  ఇండోర్ లోని అతి పెద్ద పార్క్ ఈ మెఘ్ దూత్ ఉపవన్ . ప్రాంతీయం గా నే కాక పర్యాటకులకు కుడా ముఖ్య ఆకర్షణ ఈ పార్క్ . వారం మొత్తం ప్రజల తో నిండి ఉండే ఈ పార్క్ వారంతం లో మరింత రద్దీ గా ఉంటుంది . ప్రజలు కుటుంబ సమేతంగా ప్రత్యేకించి పిల్లల తో ఇక్కడ సమయం గడపటానికి ఇష్టపడతారు. పార్క్ గొప్ప అందమైన లాన్ ల తో , అధ్బుతమైన గార్డెన్ తెర్రసు ల తో , ఫౌంటెన్ లతో , రేవోల్వింగ్ వాటర్ స్ప్రింగ్స్ మరిన్ని ఇతర ఆకర్షనలతో ఉంటుంది . నగర హడావిడి జీవనం నుండి ఈ పార్క్ ప్రశాంత వాతావరణం లో ప్రజలకు సేదతీరే అవకాసం కలిగిస్తుంది . ఇక్కడ పిక్నిక్ లతో పాటు దగ్గరలోని మంగళ్ మెర్రి ల్యాండ్ అముసేమేంట్ పార్క్ కూడా చూడవచ్చు .

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
21 Feb,Wed
Return On
22 Feb,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
21 Feb,Wed
Check Out
22 Feb,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
21 Feb,Wed
Return On
22 Feb,Thu