Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఇండోర్ » వాతావరణం

ఇండోర్ వాతావరణం

ఉత్తమ సమయం అక్టోబర్ నుండి మార్చ్ వరకు ఇండోర్ ని సందర్శించేందుకు ఉత్తమ సమయం. ఈ సమయం లో ఉష్ణోగ్రత ఆహ్లాదకరం గా ఉంటుంది. ఈ ప్రాంత పర్యటనకు ఈ సమయం ఉత్తమమైనది. ఎండాకాల వేడి నుండి ఉపశమనం కలిగించే విధం గా ఇక్కడ ఉష్ణోగ్రతలు ఈ ప్రాంత సందర్శనని ఆహ్లాదకరంగా చేస్తాయి.

వేసవి

ఎండాకాలం ఇండోర్ లో ఎండాకాలం తీవ్రం గా ఉంటుంది. ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. మే నెలలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ సమయంలో ఇక్కడ నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల ల నుండి 40 డిగ్రీల మధ్యలో ఉంటాయి. కానీ మే నెలలో ఉష్ణోగ్రత 45 డిగ్రీల వరకు చేరుకుంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం ఎండాకాలం ఉష్ణోగ్రతలు వర్షాకాలం లో తగ్గు ముఖం పడతాయి. జూలై నుండి సెప్టెంబర్ వరకు ఇక్కడ వర్షాకాలం. నైరుతి ఋతుపవనాల వల్ల ఇక్కడ సాధారణ వర్షపాతం నమోదవుతుంది. ఇక్కడ నమోదయ్యే సగటు వర్షపాతం 30-35 ఇంచెస్ గా ఉంటుంది. ఎండాకాలం వేడి నుండి ఉపశమనం వర్షాకాలం లో పొందవచ్చు.

చలికాలం

శీతాకాలం శీతాకాలం లో ఇండోర్ లో ని వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు శీతాకాలం. రాత్రి పూట సగటు ఉష్ణోగ్రత 10డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతుంది. జనవరి సమయం లో శీతాకాలం ప్రతాపాన్ని చూపిస్తుంది. 2 డిగ్రీల సెల్సియస్ కి ఉష్ణోగ్రత పడిపోతుంది. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి అనువైన సమయం ఇది.