Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మహేశ్వర్ » వాతావరణం

మహేశ్వర్ వాతావరణం

మహేశ్వర్, వానాకాలంలో, అలానే శీతాకాలంలో కూడా దర్శించటానికి అనుకూలంగా ఉంటుంది. ఏదిఏమైన, అక్టోబర్ నుండి ఫిబ్రవరి నెలల వరకు అంటే శీతాకాల సమయంలో వాతావరణం అనుకూలంగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ప్రదేశమంతా శివమయం కావున, ఇక్కడ శివరాత్రి పండుగను ఫిబ్రవరి మరియు మార్చ్ నెలలలో జరుపుకుంటారు. ఈ సమయంలో మహేశ్వర్ సందర్శన చాలా బాగుంటుంది.

వేసవి

వేసవికాలం:ఈ సమయంలో ఇక్కడ చాలా వేడిగా మరియు పొడిగా ఉంటుంది. ఈ సమయంలో అత్యల్ప మరియు అత్యధిక ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల నుండి 42 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు అవుతుంది. మార్చ్ లో మొదలై మరియు జూన్ వరకు ఉంటుంది. మే నెలలో చాలా వేడిగా ఉంది ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు అవుతుంది. ఈ సమయంలో ఈ ప్రదేశాన్ని దర్శించటం మంచిది కాదు.

వర్షాకాలం

వానాకాలం: ఈ కాలం జూలై నెలలో మొదలై మరియు సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ సమయంలో మహేశ్వర్ చాలా అద్భుతంగా ఉంటుంది. వర్షపాతం కావలసినంత మేరనే ఉంటుంది అందువలన ఈ సమయంలో ఈ ప్రదేశం దర్శించటానికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

చలికాలం

శీతాకాలం: ఈ సమయంలో సగటు ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఈ శీతాకాలం ఉంటుంది. ఈ సమయంలో వాతావరణం చల్లగా మరియు హాయిగా ఉండటం వలన పర్యాటకులు మహేశ్వర్ సందర్శనను చాలా సంతోషిస్తారు. ఈ సమయంలో వాతావరణం చాలా అనుకూలంగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది.