Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » థార్ » వాతావరణం

థార్ వాతావరణం

ఉత్తమ సమయం దార్ ని సందర్శించడానికి ఉత్తమమైన సమయం అక్టోబర్ మరియు నవంబర్ నెలలు. ఈ సమయం లో వాతవరణం ఆహ్లాదం గా ఉంటుంది. ఈ సమయం లో ఈ ప్రాంతాన్ని సందర్శించేటప్పుడు లైట్ వింటర్ వస్త్రాలని దగ్గర పెట్టుకోవడం మరచిపోకూడదు.

వేసవి

ఎండాకాలం మార్చ్ లో లో మొదలయ్యే ఎండాకాలం మెల్లగా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. పగటిపూట వేడిగా ఉన్నప్పటికీ రాత్రి పూట కొంచెం చల్లగానే ఉంటుంది. పగటి పూట ఉష్ణోగ్రత 34°C వరకు చేరుతుంది. రాత్రి పూట ఉష్ణోగ్రత 16°C గా నమోదవుతుంది. ఇక్కడ నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రత 40°C ని మించి ఉంటుంది. అందుచేత ఇక్కడ తేమ శాతం తక్కువగా మరియు వాతావరణం పొడి పొడి గా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం ధార్ లో వర్షాకాలం జూన్ లో మొదలవుతుంది. ఈ పారిశ్రామిక నగరం లో జూలై మరియు ఆగస్ట్ నెలలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. 1000మీమీ ల వర్షపాతం ఏడాదికి ఇక్కడ సగటున నమోదయ్యే వర్షపాతం. తేమ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది.

చలికాలం

శీతాకాలం ఈ సమయంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఈ ప్రాంతం సొంతం. శీతలంగా ఉండే ఈ ప్రాంతం అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు సందర్శించడానికి అనువుగా ఉంటుంది. ధార్ లో నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రత అయిదు డిగ్రీలు. పారిశ్రామిక ప్రాంతం అవడం వలన ఈ సమయం లో వివిధ దేశాల నుండి ప్రజలు ఇక్కడికి వస్తారు.