వ్యోమగమనం చేసి దేశానికి గర్వకారణంగా నిలిచిన ధైర్యవంతురాలు కల్పనా చావ్లా హర్యానా లోని కర్నాల్ లో జన్మించింది. ఆమె ప్రయాణిస్తున్న స్పేస్ క్రాఫ్ట్ కూలిన దుర్ఘటనలో ఆమె మరణాంతరం ఆవిడ స్మారకార్ధం హర్యానా ప్రభుత్వం కల్పనా చావ్లా స్మారక ప్లానెటేరియం ను నిర్మించింది. వ్యోమగామిగా ఆమె చేసిన పనులను ఈ ప్లానెటేరియం విపులంగా చూపిస్తుంది.
ఈ భవనంలో అత్యాధునిక ఆప్టో మెకానికల్, డిజిటల్ ప్రొజెక్టర్లు, ఆధునిక సరౌండ్ సౌండ్ వ్యవస్థ వున్నాయి, వీటిని ప్లానెటేరియం ప్రెజెంటేషన్ లలో వినియోగిస్తారు. ఈ నిర్మాణం మీద 12 మీటర్ల పైకప్పు వుంది, ఇది తేలిగ్గా ఒకే దిశలో 120 మంది కూర్చోడానికి వీలు కల్పిస్తుంది.
సెంట్రల్ ఎయిర్ కండిషన్ చేసిన, పూర్తిగా విద్యుదీకరించిన ఈ ప్లానెటేరియం ఆస్ట్రోనాట్, ఒయాసిస్ అనే రెండు కార్యక్రమాలను ప్రజలకోసం, ముఖ్యంగా విద్యార్ధుల కోసం ప్రదర్శిస్తారు.
ఇక్కడ వుండే శాశ్వత గాలరీ లో ఖగోళం మీద చాలా ఇంటర్-యాక్టివ్ ప్రదర్శనలు వుంటాయి – ఏ వాక్ త్రూ టైం, డే అండ్ నైట్, యువర్ వెయిట్ ఆన్ వేరియస్ ప్లానేట్స్, సీజన్స్ ఆన్ ఎర్త్, వాల్డ్ టైం, అవర్ అడ్రస్ ఇన్ యూనివర్స్, అవర్ సోలార్ సిస్టం, బియాండ్ సోలార్ సిస్టం, ఆస్ట్రో క్విజ్, జోడియాక్ క్విజ్ లాంటి చాలా ప్రదర్శనలు వేస్తారు. ఈ గాలరీ లోని ఒక ప్రత్యేక ప్రాంతంలో డాక్టర్ కల్పనా చావ్లా జీవితం, సాధించిన విజయాలను దర్శింప చేస్తూ వుంటాయి.