పాల్వాల్ – పత్తి కేంద్రం!

పాల్వాల్, హర్యానా పాల్వాల్ జిల్లలో పత్తి కేంద్రం ఉంది. ఇది ఢిల్లీ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాండవుల పాలనలో, పాల్వాసుర్ అనే రాక్షసుడి పేరుని ఈ స్థలానికి పెట్టారు. పాల్వాల్ లో పేర్కొన్న పాండవుల రాజ్యమైన ఇంద్రప్రస్థ గురించి మహాభారతంలో చూడవచ్చు. పల్వాసుర్ రాక్షసుడు శ్రీకృష్ణుడి అన్న బలరామునిచే చంపబడ్డాడు. ఇది విక్రమాదిత్య మహారాజు ప్రదేశంగా కూడా ఉంది. బ్రిటీషు వారి పాలనలో, ఇది పంజాబ్, గుర్గాన్ రెండు ప్రాంతాలకు చెందింది. భారత స్వతంత్ర ఉద్యమంలో అనేకమంది స్వాతంత్ర్య సమరయోధులు పాల్గొనడం వల్ల పాల్వాల్ చారిత్రికంగా ప్రసిద్ది చెందింది.

ప్రతి ఏటా ఇక్కడ బలదేవ్ చాట్ కా మేళా అనే పండుగ నిర్వహించబడుతుంది. ఇక్కడ బలరామునికి అంకితం చేసిన దవుజి అనే ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం పాల్వాల్ లోని మునిసిపల్ చౌక్ కి సమీపంలో ఉంది. పాల్వాల్ దేశంలో పత్తి ఉత్పత్తిచేసే అత్యంత ప్రధాన ఉత్పత్తిదరులలో ఒకటి. ఇక్కడి నుండి పత్తి దేశం మొత్తానికి సరఫరా చేయబడుతుంది.

పాల్వాల్ లోను, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు ఇక్కడ పంచవటి అనే ప్రసిద్ధ హిందూ దేవాలయం ఉంది. ఇది హిందూ మతంలో అత్యంత పేరుగాంచింది. భగవాన్ పరసురం మందిర్ కులేనా, జన్గేశ్వర్ మందిరం, దవుజి మందిర్, కామేటి చౌక్ లోని దేవి ఆలయ౦, శ్రధానంద పార్క్, డి పార్కు, టికోన పార్కు, పంచాయత్ భవన్ మొదలైనవి ఇతర ప్రధాన ఆలయాలు. ఇక్కడ కిల్లే వాలా పార్కు, టాన్కి వాలా పార్కు, బాల భావాన్, డిజి ఖాన్ హిందూ, టౌ దేవి లాల్ పార్క్ (టౌన్ పార్క్), దసరా గ్రౌండ్ పార్క్, హుడా పార్క్ వంటి అనేక పార్కులు ఉన్నాయి.

పాల్వాల్ వాతావరణం పాల్వాల్ లో వాతావరణం వర్షాకాలంలో తప్ప మిగిలిన సమయంలో పొడిగా ఉంటుంది.

పాల్వాల్ చేరుకోవడం ఎలా పాల్వాల్ రోడు, రైలు, వాయు మార్గాల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది.

Please Wait while comments are loading...