Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గ్వాలియర్ » వాతావరణం

గ్వాలియర్ వాతావరణం

ఉత్తమ సీజన్ గ్వాలియర్ సందర్శనకు వింటర్ సీజన్లో అనుకూలమైనది. అయితే, పర్యాటకులు ఈ ప్రదేశానికి వెళ్ళేటపుడు తమ ఉన్ని దుస్తులు తప్పక తీసుకు వెళ్ళాలి.

వేసవి

వేసవి గ్వాలియర్ లో వేసవి మార్చ్ లో మొదలై, జూన్ చివర వరకూ కొనసాగుతుంది. వేసవిలో ఈ ప్రదేశం అధిక వేడి, పొడి గా వుంటుంది. ఉష్ణోగ్రత గరిష్టం 47 డిగ్రీలు వరకూ చేరుతుంది. ఈ కాలం పర్యటనకు సూచించ దగినది కాదు.

వర్షాకాలం

వర్షాకాలం గ్వాలియర్ లో వర్షాకాలం జూలై లో మొదలై అక్టోబర్ చివరి వరకూ వుంటుంది. ఈ సమయంలో వర్షాలు తరచుగా పడుతూ, ఉష్ణోగ్రతలు 25 నుండి 32 డిగ్రీల వరకూ మారుతూంటాయి. ఈ కాలం కూడా పర్యటనకు సరైనది కాదు.

చలికాలం

వింటర్ గ్వాలియర్ లో శీతాకాలం అధిక చలి గా వుంటుంది. చలికాలం నవంబర్ లో మొదలై ఫిబ్రవరి వరకూ వుంటుంది. ఉష్ణోగ్రతలు రాత్రులందు కొన్నిమార్లు జీరో లేదా మైనస్ స్థాయి లకు కూడా పది పోయి అసౌకర్యంగా వుంటుంది. అయితే సాధారణంగా పగటి ఉష్ణోగ్రత సగటున 27 డిగ్రీలు గా వుంది పర్యటనకు ఆహ్లాదం గా వుంటుంది.