ప్రతాప్ ఘడ్ - బెలా భవాని టెంపుల్!

ప్రతాప్ ఘడ్  ఉత్తర ప్రదేశ్ లో ఒక జిల్లా. దీనికి ఈ పేరు దాని హెడ్ క్వార్టర్ టవున్ అయిన బేల ప్రతాప్ ఘర్ నుండి వచ్చింది. చరిత్ర మేరకు ఒక స్థానిక రాజు అజిత్ ప్రతాప్ సింగ్ ఆరూర్ వద్ద గల రాంపూర్ ను తన ప్రధాన పాలనా కార్యాలయం చేసుకున్నాడు. తర్వాత 1858 లో ప్రతాప్ ఘర్ జిల్లా ఏర్పడినపుడు దానిని బెలా ప్రతాప్ ఘర్ అన్నారు. బెలా అనేది సాయి నది ఒడ్డున కల బెలా భవాని టెంపుల్ ను సూచిస్తుంది.

ప్రతాప్ ఘడ్  లోను చుట్టుపట్ల పర్యాటక ఆకర్షణలు

ప్రతాప్ ఘడ్ , రామాయణ మహాభారతాల కాలం నాటిది. శ్రీరాముడు ఇక్కడ కల బెలా భవాన్ని ఆలయంలో పూజలు చేసాడని ప్రతీతి. భయహరన్ నాథ్ ధాం పేరు మహాభారతంలో కలదు. పాండవులలో ఒకడైన భీముడు, బకాసురుడనే రాక్షసుడిని వధించి ఈ టెంపుల్ లో శివలింగం ప్రతిష్టించాడని చెపుతారు. ఈ ప్రాంతం గుండా ప్రవహించే సాయి నది హిందువులకు పవిత్రమైనది. దీనిలో వీరు స్నానాలు చేస్తారు. ఇక్కడ కల బౌద్ధ అరామాన్ని దర్సించేందుకు వచ్చిన బౌద్ధులు కూడా ప్రతాప్ ఘర్ కు వస్తారు.

Please Wait while comments are loading...