Search
 • Follow NativePlanet
Share

లక్నో - నవాబుల భూమిలో టిక్కాలు, కబాబ్ లు !

59

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అయిన ‘నవాబుల నగరం’ గా పిలువబడే లక్నో గోమతి నది ఒడ్డున ఉంది. ఈ నగర చరిత్ర సూర్యవంశ వంశీయుల కాలం నాటిది. నవాబ్ అసఫ్-ఉద్-దౌలా స్థాపించిన ఈ నగరం అవద్ నవాబుల రాజధానిగా పనిచేసింది. నిజానికి, నవాబ్ కాలంనాటి మర్యాదపూర్వకమైన సంస్కృతి, మర్చిపోలేని రుచికరమైన వంటకాలు ఇప్పటికీ ప్రసిద్ది చెందినవే.

లక్నో దాని పూర్వపు ప్రపంచ ఆకర్షణను, కీర్తిని నిలుపుకుని ఇప్పటికీ దాని అసాధారణ అభివృద్ది, ఆధునీకరణ ప్రతిబింబిస్తుంది. మీరు వీధుల గుండా నడుస్తూ, స్థానికులను సంప్రదించి లక్నవి తేజాబ్ ని తీసుకోవచ్చు. ఈ భావనలు పెరిగిపోతున్న జనాభా నివాసానికి ఇప్పటికీ వెచ్చదనాన్ని, ఆతిధ్యాన్ని సంక్రమింప చేసే అపార్ట్మెంట్ దారులను చూపాయి. నవాబుల కాలం సున్నితమైన అలవాట్లను, నోరూరించే వంటకాలను లక్నోకు ప్రసాదించింది. ఆ కాలం సాహిత్యాన్ని, నృత్యాన్ని, సంగీతాన్ని, కళలను పెంపొందించింది. నిజానికి, కథక్, సితార్, టేబుల్, డాన్స్ వంటి సంగీత పరికరాలు ఈ నగర వీధుల్లోనే జన్మించాయి. కాలక్రమేణా, అవద్ బ్రిటీష్ వశమైంది, అక్కడి భవనాలు, స్మరకలు వారి సామ్రాజ్య పాలనను ప్రతిబింబించే అవశేషాలను చూడవచ్చు.

లక్నో ఉర్దూ, హిందుస్తానీ, హిందీ భాషలకు జన్మస్థలంగా ఉండి, భారత కవిత్వం, సాహిత్యానికి విశేష కృషిచేసింది.

దేశంలోని ఉత్తమ శిల్పులలో కొంతమంది ఈ నగరంలో కూడా ఉన్నారు, ఇది పురుషులు, స్త్రీలు వార్డ్ రోబ్ లలో పనిచేసే గర్వంతో కూడిన చికంకరి పనికి ప్రసిద్ది చెందింది. దాని విలాసవంతమైన వంటకాల సుగుణాలను కీర్తి౦చకుండా లక్నో వివరణను పూర్తి చేయలేము. అక్కడ ఉన్నపుడే మీరు టిక్కాలు, కబాబుల వంటి ప్రఖ్యాత మొఘలు రుచికరమైన వంటలను ప్రయత్నించండి.

లక్నో లోను, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు

మీరు లక్నోలో చూడవలసినవి, చెయ్యవలసినవి చాలా ఉన్నాయి. ఇప్పటివరకు, నగరంలోని బర ఇమంబర, భూల్ భులయియా, పెద్దది, ఆకట్టుకునే సమాధి ప్రాంగణం, 1783 లో నిర్మించిన ఆశక్తికర క్లిష్టమైన మార్గం అత్యంత ప్రసిద్ధ ఆకర్షణలు. ఈ స్మారక ప్రవేశ టికెట్ చిన్న ఇమంబర, హుసైనాబాద్ క్లాక్ టవర్, పిక్చర్ గాలరీ కి కూడా చెల్లుబాటు అవుతుంది. శిధిలమైన లక్నో భవనాలు, 1857 స్వాతంత్ర మొదటి యుద్ధ దృశ్యాలు, రాజ్ వంశ కాలంనాటి మెమోరియల్ మ్యూజియం లను కూడా సందర్శించవచ్చు. అయితే దీని రక్త చరిత్ర అజరామరమైనది, ఈ భవనం ఈ రోజు వేడి, దుమ్ము, నగర శబ్దాల నుండి చల్లగా తయారయింది.

లక్నోలో పచ్చదనం కూడా ఒక భాగంగా ఉంది. మీకు నగరంపట్ల అత్యుత్సాహం ఉంటే, లక్నో జూ, బొటానికల్ గార్డెన్, బుద్ధ పార్కు, కుక్రైల్ ఫారెస్ట్ రిసర్వ్, సికందర్ బాగ్ కూడా మీకు అవసరమైన ఉపశమనాన్ని ఇస్తుంది.

లక్నోలో కూడా అవధ నిర్మాణానికి సాక్ష్యంగా నిలిచే అనేక అద్భుతమైన కట్టడాలు, ఆకట్టుకునే భవనాలు ఉన్నాయి. కైసర్బాగ్ పాలెస్, తలుక్దర్ హాల్, షాహ్ నజఫ్ ఇమంబర, బేగం హజ్రత్ మహల్ పార్క్, రూమి దర్వాజా, భారతదేశం లోని ఆకర్షణీయమైన నిర్మాణాలలో ఒకటైన లక్నో నగర ప్రవేశ ద్వారం సందర్శించండి. 1423 లో సుల్తాన్ అహ్మద్ షాహ్ నిర్మించిన జమ మసీదు పేర్కొనదగినది. దీనిని పూర్తిగా పసుపు ఇసుకరాయితో నిర్మించారు, దీని రూపకల్పన, భవన నిర్మాణం క్లిష్టమైన శైలి కి ప్రసిద్ది చెందింది, ఇది భారతదేశంలోని అత్యంత అందమైన మసీదులలో ఒకటిగా భావించబడుతుంది. ఇక్కడ ప్రధాన ఘాట్, దాహాస్ ఘాట్ వంటి ఇతర ఆకర్షణలు ఉన్నాయి, పర్యాటకులు అందమైన దహాస్ సరస్సు సమీపంలోని భూభాగాన్ని ఒక కాంప్ స్పాట్ గా కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు.

లక్నో చేరుకోవడం

వాయు, రైలు & రోడ్డు మార్గాల ద్వారా లక్నో చేరుకోవచ్చు.

సందర్శనకు ఉత్తమ సమయం

అక్టోబర్, మార్చ్ మధ్య లక్నో సందర్శన ఉత్తమం.

లక్నో ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

లక్నో వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం లక్నో

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? లక్నో

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డుమార్గం ద్వారా లక్నో గుండా NH25, NH28, NH56 ప్రధాన రహదారులు ఉన్నాయి. ఇక్కడికి డిల్లీ, కాన్పూర్, ఆగ్రా, అలహాబాద్, డెహ్రాడూన్ నుండి ఈ జాతీయ రహదారి ద్వారా చేరుకోవచ్చు.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలుమార్గం ద్వారా లక్నో లో రెండు ప్రధాన రైల్వే జన్క్షన్లు ఉన్నాయి – అందులో ఒకటి సిటీ సెంటర్, మరొకటి చార్బాగ్ వద్ద సిటీ సెంటర్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నగరం శతాబ్ది, రాజధాని ఎక్స్పెస్ వంటి అనేక రైళ్ళ ద్వారా భారతదేశంలోని అనేక ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉంది.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  వాయుమార్గం ద్వారా లక్నో విమానాశ్రయం అముసి అనే ప్రదేశం వద్ద సిటీ సెంటర్ కి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. డిల్లీ, ముంబై, పాట్న, రాంచి వంటి భారతదేశంలోని ప్రధాన నగరాల నుండే కాకుండా, మధ్య ప్రాశ్చ దేశాల నుండి కూడా విమానాలు నడుస్తాయి.
  మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Jan,Sat
Return On
29 Jan,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
28 Jan,Sat
Check Out
29 Jan,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
28 Jan,Sat
Return On
29 Jan,Sun