బారాబంకి - పూర్వాంచల్ ప్రవేశ ద్వారం!

బారాబంకి ఉత్తర ప్రదేశ్ లోని ఫైజాబాద్ యొక్క నాలుగు జిల్లాలలో ఒకటి. బారాబంకి కి ఘాగ్ర మరియు గోమతి నదులు సమాంతరంగా ప్రవహిస్తాయి. ఈ జిల్లాను పూర్వాంచల్ కు గేటు వే లేదా ప్రవేశ ద్వారం అంటారు. ఒకప్పుడు ఇది అనేక మంది మునులకు, ఋషులకు తపోస్తలి గా వుండేది. ఈ ప్రదేశాన్ని మొదటగా క్రి.శ.1000 లో కనుగొన్నారని చెపుతారు. తర్వాతి కాలంలో ముస్లింలచే ఆక్రమించ బడినది. దీనిని 12 భాగాలు చేయటం వలన ఆ పేరు వచ్చినది. మరో కధనం మేరకు ఈ పేరు అక్కడ కల అడవి కారణంగా వనం 12 భాగాలు చేయటం వలన కూడా ఏర్పడింది.

బారాబంకి లోను చుట్టుపట్ల కల పర్యాటక ఆకర్షణలు

బారాబంకి లో చూసేందుకు అనేక ప్రదేశాలు కలవు. ఇది పారిజాతం చెట్టుకు పుట్టినిల్లు. బారాబంకి ఘంటాఘర్ లేదా క్లాక్ టవర్ సిటీకి ప్రవేశ ద్వారంగా వుంటుంది. ఈ జిల్లాలో కల మహాదేవ టెంపుల్ పురాతన టెంపుల్స్ లో ఒకటి.

బారాబంకి జిల్లాలో అనేక పురాతన మరియు చారిత్రక టవున్ లు, గ్రామాలు కలవు. ఇక్కడ రాజ కుటుంబ గురువు అయిన దేవా స్వంత ఊరు, హాజీ వారిస్ అలీ షా క్షేత్రం, బదో సరయి అనే యాత్రా స్థలం, కుంతీ దేవి పుట్టిన స్థలం కిన్టూర్ మొదలైనవి కలవు.

వాతావరణం

బారాబంకిలో ఉప ఉష్ణమండల వాతావరణం నెలకొని వుంటుంది. ప్రధానంగా, వేసవి, వర్షాకాలం వింటర్ లు వుంటాయి.

Please Wait while comments are loading...